వంట గ్యాస్ ఇబ్బంది లేదు
ABN , Publish Date - Apr 29 , 2026 | 12:53 AM
జిల్లాలో గ్యాస్ సరఫరా చాలా వరకు మెరుగు పడింది. వాణిజ్య గ్యాస్ సిలిండర్లు మినహాయిస్తే గృహా వసర గ్యాస్ సరఫరా సక్రమంగా సాగుతోంది.
గృహావసరాలకు త్వరితంగా సరఫరా
వాణిజ్య అవసరాలకు కొన్ని ఇబ్బందులు
(ఏలూరు సిటీ–అంధ్రజ్యోతి)
జిల్లాలో గ్యాస్ సరఫరా చాలా వరకు మెరుగు పడింది. వాణిజ్య గ్యాస్ సిలిండర్లు మినహాయిస్తే గృహా వసర గ్యాస్ సరఫరా సక్రమంగా సాగుతోంది. గ్యాస్ బుకింగ్ నిబంధనలు కొనసాగుతున్నాయి. ఒకసారి గ్యాస్ సిలిండర్ పొందినవారు పట్టణాల్లో 25 రోజులు, గ్రామాల్లో 45 రోజుల తర్వాత తిరిగి బుక్ చేసుకోవాల్సి ఉంది. గ్యాస్ బుక్ చేసినప్పటికీ ఓటీపీ వస్తేనే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారు. గ్యాస్ సరఫరాలో బ్లాక్ మార్కె టింగ్ జరగకుండా జిల్లా అధికార యంత్రాంగం ముం దస్తు చర్యలు చేపట్టడంతో గ్యాస్ కష్టాలు కొంత మేర కు తీరాయని చెబుతున్నారు. జిల్లాలో 6లక్షలు పైగా గ్యాస్ కనెక్షన్లు ఉండగా రోజువారీ 11వేల వరకు గ్యాస్ సిలిండర్లు అవసరం. ప్రస్తుతం జిల్లాలో 10 నుంచి 11 వేల వరకు గ్యాస్ సిలిడర్లు సరఫరా అవుతున్నాయని జిల్లా పౌరసరఫరాల శాఖాఽధికారులు చెబుతున్నారు. బ్యాక్‌లాగ్ తగ్గిందని గ్యాస్ సిలిండర్ల సరఫరా మెరుగు పడిందని అధికారులు చెబుతున్నారు.
వాణిజ్య సిలిండర్లకు తప్పని తిప్పలు
జిల్లాలో ప్రభుత్వ అవసరాల మేరకు మాత్రమే వాణిజ్య గ్యాస్ సిలిండర్లు సరఫరా చేస్తుండడం, సాధా రణ వ్యాపార అవసరాలకు అంతంత మాత్రంగానే వాణిజ్య గ్యాస్ సిలిండర్లు సరఫరా చేస్తుండడంతో ఇక్కట్లు తప్పడం లేదు. మధ్యాహ్న భోజనం, ప్రభుత్వ వసతి గృహాలు, హాస్పిటల్స్‌కు వాణిజ్య గ్యాస్ సిలిండర్లు సక్రమంగా సరఫరా అవుతున్నాయి. హోటల్స్, తినుబం డారాల వ్యాపారాలకు మాత్రం గ్యాస్ సరఫరా కావడం లేదని చెబుతున్నారు. ప్రస్తుతం వాణిజ్య గ్యాస్ సిలిం డర్లు 40శాతం మేరకు సరఫరా అవుతున్నాయని జిల్లా పౌరసరఫరా శాఖాధికారులు చెబుతున్నారు.