Share News

నీట్‌ ప్రశాంతం

ABN , Publish Date - May 03 , 2026 | 11:37 PM

దేశవ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన ‘నీట్‌’ యూజీ–2026’ ఉమ్మడి పశ్చిమ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది.

నీట్‌ ప్రశాంతం
ఏలూరు గాంధీనగర్‌ స్కూల్‌ వద్ద నంబర్లు చూస్తున్న విద్యార్థులు

ఏలూరు అర్బన్‌/తాడేపల్లిగూడెం రూరల్‌/తణుకు, మే 3 (ఆంధ్రజ్యోతి) : దేశవ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన ‘నీట్‌’ యూజీ–2026’ ఉమ్మడి పశ్చిమ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. ఏలూరు జిల్లాలో మొత్తం 1680 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 1619 మంది హాజరయ్యారు. 61 మంది గైర్హాజరయ్యారని నీట్‌ సిటీ కో–ఆర్డినేటర్‌, గోపన్నపాలెంలోని కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపాల్‌ భూర్‌సింగ్‌ మీనా తెలిపారు.

ఏలూరు నగరంలో 6 కేంద్రాల్లో పరీక్ష జరిగింది. పీఎంశ్రీ కేంద్రీయ విద్యాలయంకు 360 మంది అభ్యర్థులను కేటాయించగా 344, సుబ్బమ్మదేవి మున్సిపల్‌ హైస్కూలులో 312మందికి 299, కస్తూర్బా మున్సిపల్‌ బాలికోన్నత పాఠశాలలో 288మందికి 276, ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో 288మందికి 283, గోపన్నపాలెంలోని గవర్నమెంట్‌ హైస్కూలులో 192మందికి 185, గాంధీనగర్‌ మున్సిపల్‌ హైస్కూలులో 240కి 232 మంది హాజరయ్యారు.

పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం 2,483 మందికి 2,420 మంది హాజరయ్యారు. తాడేపల్లిగూడెంలో రెండు సెంటర్లలో 673 మందికి 665 మంది హాజరయ్యారు. తణుకు గర్ల్స్‌ హైస్కూల్‌, బాలుర హైస్కూళ్లలోని రెండు సెంటర్లలో 656మందికి 643 మంది. భీమవరం డీఎన్‌ఆర్‌ కాలేజీలోని రెండు సెంటర్లలో 1,154 మందికి 1,112 మంది హాజరయ్యారని నీట్‌ పరీక్షల కో–ఆర్డినేటర్‌ జయరాం తెలిపారు. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు లేదా పరీక్ష కేంద్రాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తలేదని అధికారులు తెలిపారు.

Updated Date - May 03 , 2026 | 11:37 PM