నిజం గెలిచింది
ABN , Publish Date - Sep 10 , 2026 | 01:00 AM
నిజం గెలిచింది.. పేరుతో చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు గుర్తుగా బుధవారం రాత్రి రాష్ట్ర మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు ఆధ్వ ర్యంలో కొవ్వొ త్తులతో మానవహారం నిర్వహించారు.
సీఎం చంద్రబాబును అరెస్టు చేసి మూడేళ్లు పూర్తి
టీడీపీ నాయకుల కొవ్వొత్తుల ప్రదర్శన
చంద్రబాబు అరెస్టు చరిత్రలో మాయని మచ్చ : నిమ్మల
పాలకొల్లు అర్బన్/నూజివీడు, సెప్టెంబరు 9(ఆంధ్రజ్యోతి): నిజం గెలిచింది.. పేరుతో చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు గుర్తుగా బుధవారం రాత్రి రాష్ట్ర మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు ఆధ్వ ర్యంలో కొవ్వొ త్తులతో మానవహారం నిర్వహించారు. మంత్రి కార్యాల యం వద్ద జరిగిన కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు 53 రోజుల అక్రమ నిర్బందానికి ప్రతీకగా 53 కొవ్వొత్తులు చేతబట్టి కూటమి నాయకులు కార్యకర్తలు ప్రదర్శన చేశారు. మంత్రి నిమ్మల మాట్లాడుతూ చంద్రబా బు అక్రమ అరెస్టు ప్రజాస్వామ్య చరిత్రలో మాయని మచ్చ అన్నారు. నూజివీడులోని రాజీవ్ సర్కిల్ సెంటర్లో ‘నిజం గెలిచింది’ అనే నినా దంతో మంత్రి కొలుసు పార్థసారథి నేతృత్వంలో కూటమి నాయకులు, కార్యకర్తలు భారీ కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. రాష్ట్ర అగ్రికల్చర్ వైస్ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
గొడ్డలి పార్టీ వికృతానందం : ఆరిమిల్లి
తణుకు : రాష్ట్ర చరిత్రలో సెప్టెంబరు 9, 2023 చీకటి అధ్యాయంగా మిగిలిపోతుందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. బుధవారం సాయంత్రం తణుకులో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నంద్యాల పర్యటనలో ఉండగా తప్పుడు కేసులతో నిర్భందించి, అరెస్టు చేసి గొడ్డలి పార్టీ నాయకులు వికృతా నందం పొందారన్నారు. అనంతరం చంద్రబాబు జైల్లో ఉన్న 53 రోజు లను గుర్తు చేసుకుంటూ 53 ఆకారంలో కొవ్వొత్తుల ప్రదర్శన చేశారు.
తెలుగువాడి గుండె గాయపడింది : బడేటి చంటి
ఫ ఏలూరు టూటౌన్/పెదవేగి : రాష్ర్టానికి నాలుగుసార్లు ముఖ్య మంత్రిగా పని చేసిన చంద్రబాబు నాయుడిని ప్రాథమిక ఆధారాలు లేకుండా అరెస్టు చేయడంతో ప్రతీ తెలుగువాడి గుండె గాయపడిందని ఎమ్మెల్యే చంటి అన్నారు. చంద్రబాబును అరెస్ట్ చేసి మూడేళ్లు గడిచిన సందర్భంగా ఏలూరులో కొవ్వొత్తుల ప్రదర్శన చేశారు. మాల కార్పొరే షన్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు, ఈడా చైర్మన్ శివప్రసాద్, ఏఎంసీ చైర్మన్ పార్థసారథి, ఎస్‌ఎంఆర్ పెదబాబు, పూజారి నిరంజన్ పాల్గొన్నారు.
నిజం నిప్పులాంటిది : చింతమనేని
పెదవేగి మండలం దుగ్గిరాలలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభావకర్ 53 మంది నాయకులతో కలిసి కొవ్వొత్తుల ప్రదర్శన చేశారు. 53 దేవాల యాల్లో దీపాలు వెలిగించి, ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు అరెస్ట్ అక్రమమని, నిజం నిప్పులాంటిదని, అబద్దాన్ని కాల్చి వేస్తుందని నిరూపితమైందన్నారు. నియోజకవర్గ పరిశీలకురాలు ఇందిరా ప్రియదర్శిని, కూటమి నాయకులు పాల్గొన్నారు.