Share News

కొత్త..కొత్తగా

ABN , Publish Date - Aug 17 , 2026 | 12:43 AM

కూటమి పాల నలో నరసాపురం స్టేషన్‌కు మహర్దశ పట్టింది.కొత్త రైళ్లు కూతతో పాటు అమృత్‌ భారత్‌ స్కీమ్‌ కి ంద రూ.30 కోట్లతో నిర్మించిన కొత్తస్టేషన్‌ భవనం కూడా ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చింది.

కొత్త..కొత్తగా
కొత్తస్టేషన్‌ కౌంటర్‌లో టిక్కెట్లు తీసుకుంటున్న ప్రయాణికులు

టికెట్లు జారీ, లగేజీ బుకింగ్‌,

ప్రయాణికుల విశ్రాంతి గదులు తరలింపు

పాతస్టేషన్‌ తొలగింపునకు రంగం సిద్ధం

కొత్త స్టేషన్‌ వరకు రైల్వే ట్రాక్‌లు పొడిగింపు

ఐదుకు పెరగనున్న ప్లాట్‌ఫారాలు

నరసాపురం, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): కూటమి పాల నలో నరసాపురం స్టేషన్‌కు మహర్దశ పట్టింది.కొత్త రైళ్లు కూతతో పాటు అమృత్‌ భారత్‌ స్కీమ్‌ కి ంద రూ.30 కోట్లతో నిర్మించిన కొత్తస్టేషన్‌ భవనం కూడా ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చింది. ఆదివారం నుంచి టిక్కెట్ల బుకింగ్‌, ప్రయాణికుల విశాంత్రి గది, లగేజీ బుకింగ్‌ వంటి సదు పాయాలు కొత్త స్టేషన్‌లో ప్రారంభమయ్యాయి. పాత భవనంలో ఉన్న మరికొన్ని విభాగాలను కూడా తరలింపు పనులు చేపట్టారు. రెండు మూడు రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని రైల్వే ఉన్నతాధికారులు ఆదేశించారు. పూర్తయిన వెంటనే పాత భ వనాన్ని పూర్తిగా తొలగిం చేందుకు రెడీ అవుతున్నారు.

అమృత్‌ స్కీమ్‌లో అభివృద్ధి

నరసాపురం రైల్వే స్టేషన్‌ బ్రిటి ష్‌ హయంలో నిర్మించారు. విజయవాడ డివిజన్‌ పరిధిలో అతి పురాతనమైన రైల్వే స్టేషన్‌. రాష్ట్ర విభజనకు ముందు వరకు ఈ స్టేషన్‌లో కేవలం ఒక ప్లాట్‌ఫారం మాత్రమే ఉండేది. మరో చిన్న ఫ్లాట్‌ ఫారం నుంచి డెమో రైళ్లు నడిచేవి. విభజన తరువాత అప్పటి కూటమి ప్రభుత్వం విజయవాడ– నరసాపురం మధ్య దఽశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న డబ్లింగ్‌ రైల్వే లైన్‌కు పచ్చ జెండా ఊపి 2022లో పూర్తి చేసింది. దీంతో స్టేషన్‌ రూపు రేకలు మారిపోయాయి. కొత్త రైళ్లతో పాటు క్రాసింగ్‌ల సమస్యకు చెక్‌ పడింది. విజయవాడ– నరసాపురం మధ్య ప్రయాణ సమయం ఐదు గంటల నుంచి రెండున్నర గంటలకు తగ్గిపోయింది. స్టేషన్‌లో ప్లాట్‌ఫారాల సంఖ్య మూడుకు పెరిగింది. ఇదే క్రమంలో అప్పటి ఎంపీ రఘరామ కృష్ణరాజు కృషితో నరసాపురం స్టేషన్‌ అమృత్‌ స్కీమ్‌కు ఎంపికైంది. రూ.30 కోట్లతో చేపట్టిన ఆధునిక స్టేషన్‌ భవన పనులు దాదాపు 90 శాతం పూర్తయ్యాయి. దీంతో పాత భవనంలోని వివిధ విభాగాలను కొత్త భవనంలోకి మార్చేం దుకు చర్యలు చేపట్టారు. ఇటీవల పనులు పూర్తికావడంతో టిక్కెట్ల జారీ, రిజర్వేషన్‌ బుకింగ్‌, ప్రయాణికుల విశ్రాంతి లాంజ్‌, లగేజీ బుకింగ్‌, పోలీస్‌ స్టేషన్‌లను కొత్త భవనంలోకి మార్చివేశారు.

పెరగనున్న ప్లాట్‌ఫారాలు

కొత్త స్టేషన్‌కు ఇంకా అధికారికంగా ప్రారంభించనప్పటికి కార్యకలాపాలన్నీ కొనసాగుతుండంతో త్వరలో పాత స్టేషన్‌ భవనాన్ని తొలగించేందుకు రైల్వే అధికారులు రెడీ అవుతున్నారు. భవన తొలగింపు పూర్తికాగానే ప్రస్తుతం ఉన్న రైల్వేట్రాక్స్‌, ప్లాట్‌ ఫారాలను కొత్త భవనం వరకు పొడగించే విధంగా ప్లాన్‌ చేస్తున్నారు. ప్రస్తుతం పాత భవనం ముందు భాగంలో ఉన్న పార్కింగ్‌ ప్రదేశం నుంచి కొత్త స్టేషన్‌ వరకు కోటిపల్లి రైల్వే లైన్‌కు సంబంధించి కొత్తగా రెండు ట్రాక్‌లు రానున్నాయి. ఇప్పటికే వీటి నిర్మాణానికి చిన్నమామిడిపల్లి రైల్వే గేటు వద్ద అడ్డుగా ఉన్న ఇళ్ల తొలగింపునకు రైల్వే అధికారులు మార్కింగ్‌ వేశారు. ఈ కొత్తట్రాక్‌ల నిర్మాణం కూడా భవనం తొలగింపు పనులు పూర్తి కాగానే ప్రారంభిం చేందుకు సన్నాహాలు చేస్తున్నారు ఇదే జరిగితే స్టేషన్‌లో ప్లాట్‌ పారాలు సంఖ్య మూడు నుంచి ఐదుకు పెరగనుంది. ప్రస్తుతం కొత్తస్టేషన్‌ నుంచి టిక్కెట్‌ తీసుకుంటున్న ప్రయాణికులు పది అడుగుల దూరంలో ఉన్న మూడో నంబర్‌ ఫ్లాట్‌పారం నుంచి రైళ్లు ఎక్కేందుకు సులువుగా వెళ్లిపోతున్నారు.

Updated Date - Aug 17 , 2026 | 12:44 AM