పుష్కరాలకు ఆరు సబ్ స్టేషన్లు
ABN , Publish Date - Jan 22 , 2026 | 11:50 PM
గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికార యంత్రాంగం ముందస్టు ప్రణాళిక సిద్ధం చేస్తున్నది.
100కుపైగా కొత్త ట్రాన్స్‌ఫార్మర్లు
50 కిలోమీటర్ల మేర విద్యుత్ వైర్ల మార్పు
రూ.50 కోట్లతో ప్రాథమిక అంచనాలు
నరసాపురం, జనవరి 22(ఆంధ్రజ్యోతి): గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికార యంత్రాంగం ముందస్టు ప్రణాళిక సిద్ధం చేస్తున్నది. గత గోదావరి పుష్కరాలకు వచ్చిన యాత్రికుల్ని పరిగణలోకి తీసుకుని అవసరమైన పనుల్ని ప్రతిపాదిస్తున్నారు. ఇప్పటికే ఏటిగట్టు, దేవదాయ, ఆర్‌అండ్‌బీ, పురపాలకం వంటి శాఖల ప్రాథమిక పనుల్ని ప్రతిపాదించి ప్రభుత్వానికి నివేదించారు. తాజాగా ట్రాన్స్‌కో రూ.50 కోట్లతో నరసాపురం, పాలకొల్లు, ఆచంట నియోజకవర్గాల్లోని గోదావరి పరివాహక ప్రాంతాల్లో అవసర మైన పనుల్ని ప్రతిపాదించింది.
ఆరు సబ్‌స్టేషన్లు
లోఓల్టేజ్ సమస్య లేకుండా కొత్తగా ఆరు సబ్‌స్టేషన్ల్ ఏర్పాటుకు ప్రతి పాదించారు. అందులో రెండు సబ్‌స్టేషన్లు మంజూరయ్యాయి. ఇంకా నాలుగు పెండింగ్‌లో ఉన్నాయి. 5 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఈ సబ్‌స్టేషన్ నిర్మా ణానికి సుమారు రూ.20 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. మంజూరైన సబ్‌స్టేషన్‌లో నరసాపురం మండలం వేములదీవి, మేడపాడులు ఉన్నాయి. ఇంకా జున్నూరు, వైవీ లంక, ఆచంట వేమవరం, పాలకొల్లు పట్టణం లోని నాగరాజుపేట సబ్‌స్టేషన్లకు అనుమతి రావాల్సి ఉంది. యాత్రికులు ఎక్కువుగా సందర్శించే ప్రదేశాల్లో లోఓల్టేజ్ సమస్య తలెత్తకుండా వీటి నిర్మాణాలు చేపడుతున్నారు. పుష్కరాలు ముగిసిన తరువాత ఈ సబ్‌స్టేషన్ల వల్ల సుమారు 110 గ్రామాల్లో లోలోఓల్టేజ్ సమస్య పూర్తిగా తగ్గించే విధంగా డిజైన్ చేస్తున్నారు.
ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు
ఇక లోఓల్టేజ్ సమస్య తలెత్తకుండా 100కుపైగా కొత్త ట్రాన్స్‌ఫ్మార్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. వాటిలో 63 కేవీ, 100 కేవీ ట్రాన్స్‌ఫార్మర్లు ఎక్కువుగా ఉన్నాయి. ఇవి కాకుండా 70 కేవీ ట్రాన్స్ ఫార్మర్లు కూడా అవసరమైన చోట్ల ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. వీటి ఏర్పాటుకు సుమారు రూ.3 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ఇక 50 కిలోమీటర్ల మేర 33 కేవీ, 10 కిలో ్ౖటమీటర్ల మేర 11 కేవీ ఇంటర్ లింకింగ్ వైర్లను మార్చనున్నారు.
రూ.50 కోట్లతో ప్రతిపాదనలు
నరసాపురం, పాలకొల్లు, ఆచంట నియోజకవర్గాల్లోని గోదావరి పరివాహక ప్రాంతాల్లో పుష్కరాల 12 రోజులు లో ఓల్టేజ్ సమస్య తలెత్తకుండా అవసర మైన పనులు చేపడుతున్నాం. 12 రోజులు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలన్నదే లక్ష్యం. దానిలో భాగంగా కొత్తగా ఆరు సబ్‌స్టేషన్లు, 100కుపైగా ట్రాన్స్‌ఫార్మర్లు అవసరమైన చోట్ల 33 కేవీ విద్యుత్ వైర్ల మార్పు చేయనున్నాం. ప్రాఽథమికంగా రూ.50 కోట్లతో అంచనాలను తయారు చేసి ప్రభుత్వానికి పంపాం. ఇప్పటికే రెండు సబ్‌స్టేషన్లు మంజూరయ్యాయి. త్వరలో వీటి పనుల్ని ప్రారంభిస్తాం.
– మధుకుమార్, ఈఈ