చింతలపూడికి కొత్త మాస్టర్ ప్లాన్
ABN , Publish Date - Apr 12 , 2026 | 12:08 AM
చింతలపూడి నగర పంచాయతీ మాస్టర్ ప్లాన్‌ను ప్రస్తుతం చోటు చేసుకున్న మార్పులతో నమోదు చేసి కొత్త మాస్టర్ ప్లాన్‌ను రూపొందిం చాలని ఎమ్మెల్యే సొంగా రోషన్‌కుమార్ మునిసిపల్ అధికారులకు సూచించారు.
అధికారులకు ఎమ్మెల్యే రోషన్‌కుమార్ సూచన
చింతలపూడి, ఏప్రిల్ 11(ఆంధ్రజ్యోతి):చింతలపూడి నగర పంచాయతీ మాస్టర్ ప్లాన్‌ను ప్రస్తుతం చోటు చేసుకున్న మార్పులతో నమోదు చేసి కొత్త మాస్టర్ ప్లాన్‌ను రూపొందిం చాలని ఎమ్మెల్యే సొంగా రోషన్‌కుమార్ మునిసిపల్ అధికారులకు సూచించారు. 30 ఏళ్ల క్రితం రూపొందించిన మాస్టర్ ప్లాన్ వల్ల ప్రస్తుతం ప్రజలకు సరైన ఇంటి ప్లాన్‌లు ఇవ్వలేకపోతున్నారు. క్యాంపు కార్యాలయంలో మునిసిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులతో కలసి శనివారం ఎమ్మెల్యే మాస్టర్ ప్లాన్ పరిశీలించారు. పాత మాస్టర్ ప్లాన్‌లో పంచాయతీ విస్తీర్ణం 12 కిలోమీటర్ల పరిధి మాత్రమే ఉంది. ప్రస్తుతం ఈ విస్తీర్ణం 40 కిలోమీటర్ల పరిధికి విస్తరించింది. మేజర్ మునిసిపాలిటీల్లోను ఇంత విస్తీర్ణం లేదని అధికారులు చెబుతున్నారు. ఇండస్ట్రియల్ జోన్ అని చూపించిన స్థలాల్లో ప్రస్తుతం ఇళ్ల నిర్మాణం జోరుగా జరిగాయి. ఈమేరకు కొత్త మాస్టర్ ప్లాన్ రూపొందించాలని అధికారులకు సూచించారు. మరోవైపు నగర పంచాయతీలో పూర్తి స్థాయిలో సిబ్బంది నియామకాలు లేవు. మునిసిపల్ కమిషనర్, టౌన్ ప్లానింగ్ అధికారులు ఇన్‌చార్జ్‌లుగానే కొనసాగుతున్నారు. గతేడాది ఇక్కడ మునిసిపల్ శాఖ ఆరుగురు ఉద్యోగులను నియామకానికి అనుమతి ఇచ్చింది. అయితే పాత మాస్టర్ ప్లాన్ కారణంగా ఉద్యోగులను పూర్తి స్థాయిలో నియమించలేదని సమాచారం.