ప్రశాంతంగా ముగిసిన నీట్–పీజీ
ABN , Publish Date - Aug 31 , 2026 | 12:45 AM
నీట్–పీజీ పరీక్ష ఆది వారం జిల్లా కేంద్రంలో ప్రశాంతంగా ముగిసింది. స్థానిక సీఆర్‌ఆర్ ఇంజనీరింగ్ కళాశాల పరీక్ష కేంద్రానికి 214 మంది అభ్యర్థులను కేటా యించగా 213, సిద్ధార్థ క్వెస్ట్ సీబీఎస్‌ఈ స్కూలు కేంద్రానికి 175 మందిని కేటాయించగా 172 మంది అభ్యర్థులు హాజరయ్యారు.
ప్రశాంతంగా ముగిసిన నీట్–పీజీ
రహస్య కెమెరాలేవైనా ఉన్నాయా..
చెవిలో వినికిడి యంత్రాలేవైనా అమర్చారా?!
అభ్యర్థులకు అసాధారణ తనిఖీలు
ఏలూరు అర్బన్, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): నీట్–పీజీ పరీక్ష ఆది వారం జిల్లా కేంద్రంలో ప్రశాంతంగా ముగిసింది. స్థానిక సీఆర్‌ఆర్ ఇంజనీరింగ్ కళాశాల పరీక్ష కేంద్రానికి 214 మంది అభ్యర్థులను కేటా యించగా 213, సిద్ధార్థ క్వెస్ట్ సీబీఎస్‌ఈ స్కూలు కేంద్రానికి 175 మందిని కేటాయించగా 172 మంది అభ్యర్థులు హాజరయ్యారు. కాపీ యింగ్, మాల్‌ప్రాక్టీస్‌కు అవకాశం లేకుండా అభ్యర్థులను మెయిన్‌గేటు వద్దే క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే అనుమతించారు. యువతులకు చెవిపోగులు, హెయిర్ బ్యాండ్‌లు, ఉంగరాలు సైతం అనుమతించలేదు. జడలు లేకుండా జుట్టు విరబోసుకుని హాజరయ్యారు. ఓ అభ్యర్థిని చెవికి వేసుకున్న స్టడ్(చెవి కాడ)ను తొలగించేందుకు ప్రయత్నించినా అవ కాశం లేకపోవడంతో చెవి భాగానికి ప్లాస్టర్ వేసి అనుమతించారు. యువకులకు బూట్లు, సాక్స్, బెల్టులు కూడా తీయించేశారు. ముఖ్యంగా రహస్య కెమెరాలు, చెవుల్లో వినికిడి పరికరాలుండవచ్చుననే కోణంలో మెటల్ డిటెక్టర్లు, ప్రత్యేక పరికరాలతో సమగ్ర తనిఖీలు చేశారు. సీఆర్‌ఆర్ కళాశాల వద్ద డీఎస్పీ నేతృత్వంలోని పోలీసు బృందం పరీక్షార్థులను మెయిన్ గేటు నుంచి నేరుగా పరీక్ష గది వద్దకు చేర్చేందుకు పోలీసు వాహనాలను సమకూర్చారు. ట్రాఫిక్ జామ్‌కు అవకాశం లేకుం డా భారీ వాహనాలను దారి మళ్లించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నోడల్ ఆఫీసర్/డ్యూటీ మేజిస్ట్రేట్ ఎస్.వి.రవీంద్రనాథ్ పర్యవేక్షించారు.
పరీక్ష కేంద్రాలను తనిఖీచేసిన కలెక్టర్
పెదపాడు: ప్రశాంత వాతావరణంలో నీట్ పీజీ ప్రవేశ పరీక్ష జరిగిందని ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. పెదపాడు మండలం వట్లూరులోని సిద్ధార్థ క్వెస్ట్ పాఠశాల, సర్ సీఆర్‌రెడ్డి ఇంజ నీరింగ్ కళాశాలలో పరీక్ష కేంద్రాలను ఆదివారం పరిశీలించారు. కలె క్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ భారతీయ విశ్వవిద్యాలయాలు మరియు కళాశాలల్లో పీజీ వైద్య సీట్ల కోసం భారతీయ పౌరుల అర్హతను నిర్ణయించడానికి జాతీయ స్థాయిలో ప్రవేశ పరీక్ష జరిగిందన్నారు. ఆయా పరీక్షా కేంద్రాల వద్ద భద్రతాపరమైన అన్ని చర్యలు తీసుకున్నా మన్నారు. ఏలూరు ఆర్డీవో లక్ష్మీప్రసన్న, ఏలూరు, పెదపాడు తహసీ ల్దార్లు ఎస్.వి.రవీంద్రనాధ్, కృష్ణజ్యోతి తదితరులు పాల్గొన్నారు.
‘పశ్చిమ’లో ఐదుగురు గైర్హాజరు
భీమవరం రూరల్: పశ్చిమగోదావరి జిల్లాలో నీట్ పీజీ పరీక్ష ఆదివారం రెండు పరీక్ష కేంద్రాల్లో జరిగింది. ఉదయం 7 గంటల నుంచి పరీక్షకు అనుమతి ఉండటంతో విద్యార్థులు ముందుగానే కేంద్రాలకు చేరుకున్నారు. ఉదయం 9.30 నుంచి 12.30 గంటల వరకు పరీక్ష నిర్వహించారు. డీఎన్నార్ కళాశాలలో 160 మంది విద్యార్థులకు 157 మంది హాజరయ్యారు. ఎస్‌ఆర్‌కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో 120 మందికి 118 మంది పరీక్ష రాశారు. మొత్తం 280 మందికి 275 పరీక్ష రాశారు. ఐదుగురు అభ్యర్థులు గైర్హాజరైనట్టు అధికారులు తెలిపారు.