Share News

నేటి నుంచి జాతీయ స్ధాయి కబడ్డీ పోటీలు

ABN , Publish Date - Jan 14 , 2026 | 12:41 AM

జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు రుస్తుంబాదా స్టేడియం సిద్ధం చేశారు.

నేటి నుంచి జాతీయ స్ధాయి కబడ్డీ పోటీలు
పోటీలకు సిద్ధం చేసిన కబడ్డీ స్టేడియం

నరసాపురం చేరుకుంటున్న వివిధ రాష్ర్టాల జట్లు

నరసాపురం, జనవరి 13(ఆంధ్రజ్యోతి): జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు రుస్తుంబాదా స్టేడియం సిద్ధం చేశారు. గోగులమ్మ ఉత్సవ కమిటీ ఆద్వర్యంలో బుధవారం నుంచిపా ప్రారంభమయ్యే పోటీలకు వివిధ రాష్ట్రాలకు చెందిన 50 జట్లు తలపడనున్నాయి. మహిళలు, పురుషుల విభాగాల్లో పోటీలు వేర్వేరుగా నిర్వహించేందుకు స్టేడియంలో ఏర్పాట్లను సిద్ధం చేశారు. లీగ్‌ కం నాకౌట్‌ పద్దతిలో ఈ పోటీలు జరనున్నాయి. వివిధ రాష్ట్రాలకు జట్లు నరసాపురం చేరుకుంటున్నాయి. బుధవారం సాయంత్రం పోటీలను ప్రారంభించేందుకు ఉత్సవ కమిటీ ఆన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. అల్‌ ఇండియా కబడ్డీ అసోసి యేషన్‌ నుంచి 20 మంది రిఫరీలు హాజరుకానున్నాయి. ఈసారి విజేతలకు రూ.7లక్షలు ప్రైజ్‌మనీ అందించనున్నారు. స్టేడియం చదును చేసి సింథటిక్‌ మ్యాట్‌లు వేస్తున్నారు. పోటీల కన్వీనర్‌ మాజీ ఎమ్మెల్యే జానకీరామ్‌, కబడ్డీ అసిసోయేషన్‌ మాజీ కార్యదర్శి వీరా లంకయ్య, కబడ్డీ అసోసియేషన్‌ జిల్లా నాయకులు కబడ్డీ పోటీల ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు.

పాలకొల్లులో హోరాహోరీగా కబడ్డీ పోటీలు

పాలకొల్లు అర్బన్‌, జనవరి 13(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని బీఆర్‌ఎంవీఎం హైస్కూల్‌ ఆవరణలో జరుగుతున్న జాతీయ స్థాయి కబాడీ పోటీలు మంగళవారం రాత్రి హోరాహోరీ జరిగాయి. ధర్మారావు ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కప్‌గా జరుగుతున్న పోటీలను దివంగత ఆడిటర్‌ కలిదిండి రామరాజు స్మారకంగా ఈపోటీలు నిర్వహిస్తున్నారు. పోటీలకు 13 రాష్ట్రాల నుండి పురుష క్రీడాకారులు, 10రాష్ట్రాలనుండి మహిళా క్రీడాకారులు పోటీలకు విచ్చేసారు.

పురుషల విభాగంలో ఎస్‌ఈసి రైల్వే జట్టు ఆంధ్ర జట్టుపై 52–44తో విజయం సాధించింది. సీఆర్‌పీఎఫ్‌ (ఢిల్లీ)జట్టు ఎస్‌డి స్పోర్ట్స్‌ నాగఘర్‌ జట్టుపై 54–44 తో విజయం సాధించింది. రాజ్‌ రిప్లేస్‌ జట్టు ఎస్‌ఈసి రైల్వే నాగపూర్‌పై 31–28 స్కోరుతో గెలిచింది. అకాడమి కర్నల్‌ జట్టు జెఅండ్‌ కె పోలీసు జట్టుపై 37–37 సమాన స్కోర్‌తో నిలిచాయి.

మహిళల విభాగంలో హర్యానా జట్టు వైఎంసిఏ ఫరిదార్‌ జట్టుమీద 61–31 స్కోరుతో విజయం సాధించింది. సీఆర్‌పీఫ్‌ ఢిల్లీ జట్టు వెస్ట్‌ బెంగాల్‌ జట్టుపై 62–31 స్కోర్‌తో గెలుపొందింది. కలకత్తా పోలీస్‌ జట్టు, ఆంధ్ర జట్టుపై 21–1 స్కోర్‌తో గెలిచింది. జెఅండ్‌కే పోలీస్‌ జట్టు వైఎంసిఏ ఫరిదాబాద్‌ జట్టుపై 58–32 స్కోరు సాధించింది. రాయల్‌ స్పోర్ట్స్‌ జట్టు బాబా హరిదాస్‌ జట్టుపై 26–15స్కోరు, రాతక్‌ హర్యానా జట్టు బాబాహరిదాస్‌ జట్టుసౌ 38 – 31స్కోర్‌తో గెలిచింది. హర్యానా జట్టు, వెస్ట్‌ బెంగాల్‌ జట్టుపై 32–12 స్కోర్‌తో విజయం సాధించింది. సీఆర్‌పీఎఫ్‌ ఢిల్లీ జట్టు స్పోర్ట్స్‌ జట్టుపై 47– 14 స్కోర్‌తో విజయం సాధించింది. గెలుపే లక్ష్యంగా పోటీ పడిన జట్లు ఆటతీరు కనువిందు చేసింది.

మంత్రులు నిమ్మల రామానాయుడు, కొండపల్లి శ్రీనివాస్‌, మాజీ ఎమ్మెల్సీ అంగర రామమోహన్‌ మంగళవారం క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు.

Updated Date - Jan 14 , 2026 | 12:41 AM