Share News

నార్కోటిక్‌ డగ్స్‌ కలకలం

ABN , Publish Date - Sep 03 , 2026 | 12:57 AM

వేగవరం హైస్కూల్‌ సమీపంలోని ఓ పామాయిల్‌ తోటలో ట్రామడెక్స్‌, ట్రామెక్‌ అనే రెండు కంపెనీలకు చెందిన నార్కోటిక్‌ (ఎన్‌ఆర్‌ఎక్స్‌) డ్రగ్‌ ఇంజక్షన్లతో పాటు సూదులు పడవేసిన ఘటన కలకలం రేపుతోంది.

నార్కోటిక్‌ డగ్స్‌ కలకలం
రికార్డులు పరిశీలిస్తున్న డ్రగ్‌ అధికారులు.. పామాయిల్‌ తోటలో మందులు, ఇంజక్షన్లు

నార్కోటిక్‌ డగ్స్‌ కలకలం

ప్రభుత్వ పాఠశాల సమీపంలోని పామాయిల్‌ తోటలో ఘటన.. డ్రగ్స్‌ అధికారుల తనిఖీలు

రెండు మెడికల్‌ ఏజెన్సీలపై కేసుల నమోదు

జంగారెడ్డిగూడెం, సెప్టెంబరు 2(ఆంధ్రజ్యోతి): వేగవరం హైస్కూల్‌ సమీపంలోని ఓ పామాయిల్‌ తోటలో ట్రామడెక్స్‌, ట్రామెక్‌ అనే రెండు కంపెనీలకు చెందిన నార్కోటిక్‌ (ఎన్‌ఆర్‌ఎక్స్‌) డ్రగ్‌ ఇంజక్షన్లతో పాటు సూదులు పడవేసిన ఘటన కలకలం రేపుతోంది. బుధవారం స్థానికుల సమాచారంతో డ్రగ్‌కంట్రోల్‌ అధికారులు రంగంలోకి దిగారు. స్థానిక డ్రగ్‌ ఇన్స్‌పెక్టర్‌ పి.మల్లిఖార్జునరావు, ఏలూరు డ్రగ్‌ ఇన్స్‌పెక్టర్‌ ఎం. విక్రమ్‌రెడ్డి తమ సిబ్బందితో వేగవరంలోని ఘటనా స్థలం వద్ద ఇంజ క్షన్లను పరిశీలించి వాటి శాంపిల్స్‌, బ్యాచ్‌ నంబర్లు తీసుకుని సంబంధిత కంపెనీల నుంచి సమాచారం తెప్పించుకున్నారు. ఆ సమాచారం మేరకు స్థానిక లక్ష్మీశ్రీనివాస మెడికల్‌ ఏజెన్సీస్‌, విరూప పెద్దింటి మెడికల్‌ ఏజెన్సీస్‌ సంస్థల్లో డ్రగ్‌ అధికారులు తనిఖీలు చేయగా పట్టణంలోని ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. పట్టణ ంలోని పాత బ్రేక్‌ ఇన్‌ స్పెక్టర్‌ కార్యాలయం సమీపంలో ఉన్న లక్ష్మీ శ్రీనివాస మెడికల్‌ ఏజెన్సీ స్‌కు హైదరాబాద్‌ నుంచి మూడు నెలల కాలంలో దాదాపు 20వేల ట్రామడెక్స్‌ ఇంజక్షన్లు దిగు మతి అయినట్లు గుర్తిం చారు. సంస్థ యజమాని కిశోర్‌ ఆ ఇంజక్షన్లకు చెందిన బిల్లులను చూపించ లేదు. ఆ ఇరవై వేల ఇంజక్షన్లలో ఒక్కటి కూడా అతనివద్ద లభించలేదు. ఆ ఇంజక్షన్లన్నీ స్థానిక డంపింగ్‌ యార్డు లో పడవేసినట్లు పొంతన లేని సమాధానాలు చెబు తున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే మసీదు సెంటర్‌లో ఉన్న విరూప పెద్దింటి మెడికల్‌ ఏజెన్సీస్‌ సంస్థ యజమాని ఏలూరి దుర్గాప్రసాద్‌ రెండేళ్లలో 5వేల ట్రామెక్‌ ఇంజక్షన్లు అహ్మదాబాద్‌ నుంచి తెప్పిం చినట్లు గుర్తించారు. ఇక్కడ నుంచి దాదాపు 3800 ఇంజక్షన్లను తెలంగాణ రాష్ట్రానికి చెందిన అశ్వా రావుపేట మండలం కన్నాయగూ డెంలో రిశ్వంత్‌ జనరల్‌ స్టోర్స్‌ అనే మెడికల్‌ షాపు నడిపే వ్యక్తి కొనుగోలు చేసి తీసుకువెళ్లినట్లు తెలియ జేశారు. ఈ మెడికల్‌ ఏజెన్సీ కొనుగోలు చేసిన 5వేలు ఇంజక్షన్లకు బిల్లు లు చూపించినట్లు తెలియ జేశారు. అయితే ఆ ఇరవై వేల ఇంజక్షన్లు ఎవరెవరికి అమ్మారో వివరాలు సేకరిస్తున్నామన్నారు. ఈ రెండు రకాల ఇంజక్షన్లలో కంపెనీలు వేరైనా మందు ఒక్కటేనని, ఈ మందు శరీర ంలోని నరాలలోకి ఎక్కించుకో వడం వలన మత్తుగా ఉంటుందని త్వరగా అలసిపోరని తెలిపారు. ఈ మందులు అతిగా వాడడం వలన కిడ్నీలు దెబ్బతింటాయని డ్రగ్‌ ఇన్‌స్పె క్టర్లు తెలిపారు. ఇటువంటి నార్కొటిక్‌ డ్రగ్స్‌ మందులను అనుమతులు లేకుండా కొనుగోలు చేసి అమ్మినందు కు ఇద్దరిపై కేసులు నమోదు చేసి ఉన్నతాధికారులకు నివేదిస్తామ న్నారు. వీటి ధర రూ.6లక్షల వరకు ఉంటుందని తెలిపారు. పాఠశాల సమీపంలో విద్యార్థులు ఎవరైనా వీటికి బానిసలయ్యారా లేదా వేరెవరైనా వీటిని వినియోగిస్తున్నారా అనే విషయాన్ని పోలీసులు విచారించాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Sep 03 , 2026 | 12:57 AM