నామినేషన్ల పరిశీలన పూర్తి
ABN , Publish Date - Oct 20 , 2026 | 12:47 AM
జిల్లాలో ఏలూరు కార్పొరేషన్, జంగారెడ్డిగూడెం, నూజివీడు మునిసిపాలిటీలకు సంబంధించిన దాఖలైన నామి నేషన్ల పరిశీలన సోమవారం ప్రశాంతంగా ముగిసింది.
ఏలూరు కార్పొరేషన్‌లో తొమ్మిది.. జంగారెడ్డిగూడెం, నూజివీడుల్లో ఒక్కొక్కటి తిరస్కరణ
ఏలూరు/జంగారెడ్డిగూడెం/నూజివీడుటౌన్, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి):జిల్లాలో ఏలూరు కార్పొరేషన్, జంగారెడ్డిగూడెం, నూజివీడు మునిసిపాలిటీలకు సంబంధించిన దాఖలైన నామి నేషన్ల పరిశీలన సోమవారం ప్రశాంతంగా ముగిసింది. ఏలూరు కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి రాత్రి 9గంటల వరకు పరిశీలన కొనసాగింది. మొత్తం 62 డివిజన్లకు 343 నామినేషన్లు దాఖలు కాగా పరిశీలనలో 9 నామినేషన్లను అధికారుల తిరస్క రించగా మిగిలిన 334 సక్రమంగా ఉన్నట్టు తేల్చారు. మేయర్ స్థానానికి 12 మంది నామినేషన్లు దాఖలు చేయగా అన్నీ చెల్లు బాటయ్యాయి. టీడీపీ నుంచి 107, వైసీపీ నుంచి 117, జనసేన నుంచి 44, బీజేపీ నుంచి 10, సీపీఐ నుంచి 6, సీపీఎం నుంచి 3, కాంగ్రెస్ 4, రిఫామ్స్ పార్టీ ఆఫ్ ఇండియా 1, స్వతంత్రులు 42 మంది దాఖలు చేసిన నామినేషన్లు సక్రమంగా ఉన్నాయి.
జంగారెడ్డిగూడెంలో..
జంగారెడ్డిగూడెం మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి సోమ వారం నామినేషన్ల పరిశీలన కార్యక్రమాన్ని ఎన్నికల అధికారు లు సమగ్రంగా నిర్వహించారు. చైౖర్‌పర్సన్ అభ్యర్థులుగా ఏడు నామినేషన్లు దాఖలు కాగా అన్ని సక్రమంగా ఉన్నాయని తేల్చా రు. వీరిలో కూటమి బలపరిచిన టీడీపీ అభ్యర్థి రొంగల అనూ ష, టీడీపీ రెబల్ అభ్యర్థి మారిశెట్టి బాలచిట్టెమ్మ, టీడీపీ నుంచి మరొక అభ్యర్థి రొంగల సాయిచంద్రిక నామినేషన్లను, వైసీపీ చైర్‌పర్సన్ అభ్యర్థిగా మేకా సత్యవతి, ఆమె కుమార్తె మేకా చాందిని నామినేషన్లను, బీఎస్పీ నుంచి కణితి నీలిమ, కాం గ్రెస్ నుంచి మునకల రేణుక నామినేషన్లను ఆమోదిం చారు. 32 వార్డులకు 149 నామినేషన్లు దాఖలు కాగా ఒక నామినేషన్ సక్రమంగా లేక పోవడంతో తిరస్క రణకు గురికాగా 148 నామినేషన్లు సక్రమంగా ఉన్న ట్టు ఎన్నికల అథారిటీ, మున్సిపల్ కమిషనర్ కెవి. రమణ తెలిపారు.
నూజివీడులో..
నూజివీడు మున్సిపల్ పరిధిలో దాఖలైన 168 నామి నేషన్లలో ఒక్క నామినేషన్ మినహా అన్ని నామినేషన్లు సక్ర మంగా ఉన్నట్టు ఎన్నికల అధికారి, నూజివీడు మున్సిపల్ కమిష నర్ పీరయ్య తెలిపారు. 36 వార్డులకు 160 నామినేషన్లు దాఖ లు కాగా 11 వార్డులో ఒక నామినేషన్‌కు మున్సిపల్ టాక్స్ పో అబ్జెక్షన్ సర్టిపికేట్ జత చేయని కారణంగా తిరస్కరణకు గురై నట్లు తెలిపారు. మిగిలిన 159 నామి నేషన్లు సక్రమంగా ఉన్నాయన్నారు. చైర్మన్ స్థానానికి దాఖలైన 8 నామి నేషన్లు సక్రమంగా ఉన్నట్లు తెలిపారు.