Share News

నామినేషన్ల జోరు!

ABN , Publish Date - Oct 23 , 2026 | 01:14 AM

జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి గురు వారం జడ్పీ కార్యాలయంలో నామినేషన్లు వేయడానికి వచ్చిన అభ్యర్థులతో సందడి నెలకొంది.

నామినేషన్ల జోరు!
ముసునూరు జడ్పీటీసీ స్థానం నుంచి నామినేషన్‌ దాఖలు చేస్తున్న అట్లూరి రాధిక

జడ్పీటీసీలకు ఒకరోజే 78 దాఖలు

రెండు రోజులు కలిపి జడ్పీటీసీలకు 86..

ఎంపీటీసీ స్థానాలకూ భారీసంఖ్యలో..

నేడు నామినేషన్లకు చివరిరోజు

(ఏలూరుసిటీ– ఆంధ్రజ్యోతి):

జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి గురు వారం జడ్పీ కార్యాలయంలో నామినేషన్లు వేయడానికి వచ్చిన అభ్యర్థులతో సందడి నెలకొంది. జిల్లాలోని 27 జడ్పీటీసీలకు సంబంధించి కూటమి పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీ అభ్య ర్థులతో పాటు ప్రతిపక్ష వైసీపీ అభ్యర్థులు అధిక సంఖ్యలో నామినేషన్లు వేశారు. తొలిరోజు కేవలం ఆరు జడ్పీ టీసీలకు సంబం ధించి 8 నామి నేషన్లు దాఖలు కాగా రెండో రోజు గురువారం 78 దాఖలయ్యాయి. గత రెండు రోజుల్లో మొత్తం 86 దాఖలయ్యాయి. ఇందులో టీడీపీ 28, జనసేన 9, బీజేపీ 5, వైసీపీ 34, కాంగ్రెస్‌ 3, సీపీఐఎం 2, ఇతర పార్టీలు 2, ఇండిపెండెంట్‌ 3 నామినేషన్లు దాఖల య్యాయి. కైకలూరు, ఉంగుటూరు, దెందు లూరు ఎమ్మెల్యేలు కామినేని శ్రీనివాస్‌, పత్సమట్ల ధర్మరాజు, చింతమనేని ప్రభాకర్‌లు తమ నియో జక వర్గాలకు చెందిన అభ్యర్థుల నామినేషన్ల కార్యక్రమానికి జడ్పీ కార్యాలయానికి వచ్చా రు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి అభ్యర్థుల విజయం ఖాయమని, అందరూ కూటమి ధర్మాన్ని పాటించి కూటమి అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని కోరారు.

కిక్కిరిసిన జడ్పీ కార్యాలయం

జిల్లా పరిషత్‌ కార్యాలయం జడ్పీటీసీ నామినేషన్లు వేసే అభ్యర్థులతో కిక్కిరిసింది. ఉదయం 10.30 గంటల నుంచే నామినేషన్ల పర్వం ప్రారంభం కాగా మధ్యాహ్నానికే అత్యధిక సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. సాయంత్రం 5గంటల వరకే నామినేషన్లు స్వీకరించాల్సి ఉన్నప్పటికీ నిర్ణీత సమయానికి నామినేషన్‌ కేంద్రంలో ఉన్న అభ్యర్థుల అందరి నామినేషన్లు తీసుకోవాల్సి ఉండటంతో నామినేషన్ల స్వీకరణ కొంత ఆలస్యమైంది. నామినేషన్లు దాఖలు చేసిన వారిలో కూటమి తరపున జడ్పీ చైర్‌పర్సన్‌ సీటు ఆశిస్తున్న టీడీపీకి చెందిన అట్లూరి రాధిక ముసునూరు జడ్పీటీసీ స్థానానికి నామినేషను దాఖలు చేశారు. జిల్లాలోని 27 జడ్పీటీసీల నామినేషన్ల సంఖ్య వరిశీలిస్తే ముదినేపల్లి జడ్పీటీసీ స్థానానికి జిల్లాలోనే అత్యధికంగా 7 నామినేషన్లు దాఖలయ్యాయి. మండవల్లి, కొయ్యలగూడెం, కామవరపుకోట, కైకలూరు, ఏలూరు జడ్పీటీసీ స్థానాలకు 6 నామినేషన్ల చొప్పున దాఖలయ్యాయి. ఇక మూడవ రోజైన శుక్రవారం అత్యధిక సంఖ్యలో నామినేషన్లు దాఖలు అయ్యే అవకాశాలున్నాయి.

ఎంపీటీసీ స్థానాలకు జోరుగా నామినేషన్లు

జిల్లాలో ఎంపీటీసీ స్థానాలకు రెండోరోజు జోరుగా నామినేషన్లు దాఖలయ్యాయి. వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు అధిక సంఖ్యలో రావడంతో మండల పరిషత్‌ కార్యాలయాల్లో కోలాహలం నెలకొంది. అయితే గురువారం రాత్రి వరకు జిల్లాలో ఎంపీటీసీలకు మొత్తం ఎన్ని నామినేషన్లు దాఖలయ్యాయన్న సమాచారం తెలియరాలేదు.

శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా చర్యలు : కలెక్టర్‌

ఏలూరుసిటీ, అక్టోబరు 22(ఆంధ్రజ్యోతి): జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబం ధించి నామినేషన్ల స్వీకరణలో ఎక్కడా శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా చర్య లు తీసుకోవాలని కలెక్టర్‌ వెట్రిసెల్వి చెప్పా రు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబం ధించి నామినేషన్ల స్వీకరణ, పరిశీలన ప్రక్రి యలపై ఆర్వోలు, ఏఆర్వోలు, అధికారులు , సిబ్బందితో కలెక్టర్‌ గురువారం సాయంత్రం టెలీకాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ నామినేషన్‌ పత్రాల స్వీకరణ లో ఎన్నికల కమిషన్‌ జారీ చేసిన మార్గ దర్శకాలను తప్పనిసరిగా పాటించాలన్నా రు. ఈనెల 23వ తేదీ నామినేషన్ల స్వీక రణకు చివరి తేదీ కావడంతో అధిక సంఖ్య లో నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉన్న దృష్ట్యా రిటర్నింగ్‌ అధికారులు నామి నేషన్‌ స్వీకరణ కేంద్రాల వద్ద పటిష్ఠ ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. జేసీ అభిషేక గౌడ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Oct 23 , 2026 | 01:14 AM