5,973
ABN , Publish Date - Nov 24 , 2026 | 12:24 AM
పల్లెపోరులో భాగంగా పంచాయతీ ఎన్నికల మూడో విడతకు సంబంధించి నామినేషన్ల పర్వం సోమవారంతో ముగిసింది.
మూడో విడతకు దాఖలైన నామినేషన్లు
సర్పంచ్ పదవికి 943..వార్డులకు 5,030.. ముగిసిన నామినేషన్ల పర్వం
(ఏలూరుసిటీ– ఆంధ్రజ్యోతి)
పల్లెపోరులో భాగంగా పంచాయతీ ఎన్నికల మూడో విడతకు సంబంధించి నామినేషన్ల పర్వం సోమవారంతో ముగిసింది. గత మూడు రోజుల్లో జిల్లాలో ఎన్నికలు జరిగే ఎనిమిది మండలాల్లో మొత్తం 5,973 నామినేషన్లు దాఖలు కాగా ఇందులో సర్పంచ్ పదవులకు 943, వార్డు సభ్యుల పదవులకు 5,030 నామినేషన్లు దాఖల య్యాయి. జిల్లాలోని దెందులూరు, ఏలూరు, పెదపాడు, పెదవేగి, ఆగిరి పల్లి, చాట్రాయి, ముసునూరు, నూజివీడు మండలా ల్లోని 173 పంచాయతీ సర్పంచ్‌లు, 1,828 వార్డు సభ్యులకు నామినేషన్లును స్వీకరించారు. ఆయా గ్రామాల్లో స్టేజ్–1 అధికారులు ఈ నామినేషన్ల స్వీకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈనెల 23వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ జరుగుతుంది. సర్పంచ్, వార్డు మెంబర్ల పదవులకు నామినేషన్ల స్వీకరణకు 93 నామినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మూడో విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి డిసెంబరు 2న పోలింగ్ జరుగుతుంది.