Share News

నామినేషన్‌లు షురూ..

ABN , Publish Date - Oct 17 , 2026 | 01:13 AM

ఏలూరు నగర పాలక సంస్థ పాలక మండలి ఎన్నికకు నామినేషన్ల పర్వం ప్రారంభ మైంది. తొలిరోజు శుక్రవారం వైసీపీ తరపున ఐదు నామినేషన్లు దాఖలయ్యాయి.

 నామినేషన్‌లు షురూ..
నామినేషన్ల సందర్భంగా ఏలూరు కార్పొరేషన్‌ కార్యాలయం వద్ద పర్యవేక్షిస్తున్న కమిషనర్‌ భానుప్రతాప్‌

ఏలూరు టూటౌన్‌, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): ఏలూరు నగర పాలక సంస్థ పాలక మండలి ఎన్నికకు నామినేషన్ల పర్వం ప్రారంభ మైంది. తొలిరోజు శుక్రవారం వైసీపీ తరపున ఐదు నామినేషన్లు దాఖలయ్యాయి. 10వ డివిజన్‌కు (జనరల్‌ మహిళ) తొండవరపు సుశీల, ఆదినాగమణి, 25వ డివిజన్‌కు (జనరల్‌ మహిళ) భోగిశెట్టి పార్వతి, 31వ డివిజన్‌కు (బీసీ జనరల్‌) కుప్పాల ఆంజ నేయులు, 33వ డివిజన్‌కు (అన్‌రిజర్వ్‌డ్‌) భాస్కర్ల నాగిని వైసీపీ తరపున నామినేషన్లు దాఖలు చేశారు.ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించారు. నామినేషన్ల స్వీకరణకు మొదటి, రెండవ అంతస్తుల్లో గదులను కేటాయించారు. 62 డివిజన్లకు నామినేషన్లు స్వీకరించడానికి ఆర్వో, ఏఆర్వోలతో పాటు ఒక్కొ టీమ్‌కు మున్సిపల్‌ సిబ్బంది ముగ్గురు, నలుగురిని కేటాయించారు. ఒక్కొక్క టీమ్‌కు కొన్ని డివిజన్లు కేటాయించారు. అభ్యర్థులు ఆయా డివిజన్లకు చెందిన టీమ్‌ల దగ్గరకు వెళ్లి నామినేషన్లు దాఖలు చేశారు. నగరపాలక సంస్థ కమిషనర్‌ భానుప్రతాప్‌ అన్ని ఏర్పాట్లు చేశారు.

తొలిరోజు నామినేషన్‌లు నిల్‌

నూజివీడు టౌన్‌/ జంగారెడ్డిగూడెం : మున్సి పల్‌ ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం నుంచి నామి నేషన్ల స్వీకరణ కార్యక్ర మాన్ని నూజివీడు మున్సిపల్‌ అధికారులు చేపట్టారు. పట్టణంలో 36 వార్డులు ఉండగా తొలిరోజు నామినేషన్లు దాఖలు కాలేదు. నామినేషన్ల స్వీకరణకు ప్రతి నాలుగు వార్డులకు ఒక కౌంటర్‌ చొప్పున మొత్తం తొమ్మిది కౌంటర్లు ఏర్పాటు చేసి ప్రతి కౌంటర్‌కు ఒక ఎన్నికల అధికారితో పాటు అదనపు ఎన్నికల అధికారి, సహాయ ఎన్నికల అధికారులను నియమించారు. చైర్మన్‌ నామినేషన్ల దాఖలుకు ఒక కౌంటర్‌ను ఏర్పాటు చేశారు. నూజివీడు ప్రత్యేక అధికారి, సబ్‌ కలెక్టర్‌ వినూత్న నామినేషన్ల స్వీకరణ కార్యక్రమా న్ని డీఎస్పి కేవీఎన్‌వీ ప్రసాద్‌తో కలసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. కమిషనర్‌ పీరయ్య, తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించి చైర్‌పర్సన్‌, 32 వార్డులకు మొదటిరోజు నామినేషన్లు పడలేదు. మున్సిపల్‌ కార్యాలయంలో చైర్‌పర్సన్‌ అభ్యర్థులకు నామినేషన్‌ కౌంటర్‌ ఏర్పాటు చేశారు. మరో నాలుగు ప్రాంతాల్లో ఒక్కొక్క కేంద్రం వద్ద ఎనిమిది వార్డులకు సంబంధించి నామినేషన్‌ స్వీకరణ కేంద్రాలు ఏర్పాటు చేశారు.

Updated Date - Oct 17 , 2026 | 01:13 AM