ముత్యాలపల్లిలో ఆక్రమణల తొలగింపు యత్నం
ABN , Publish Date - Aug 08 , 2026 | 12:17 AM
ముత్యాలపల్లి గొంతేరు డ్రెయిన్ ఆక్రమణ తొలగింపు కోసం శుక్రవారం హైకోర్టు ఆదేశాలతో అధికా రులు చేసిన ప్రయ త్నాలతో ముత్యాలపల్లిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
పోలీసులతో ఆలయ ప్రతినిధుల వివాదం.. వెనుతిరిగిన అధికారులు
మొగల్తూరు, ఆగస్టు 7 (ఆంధ్ర జ్యోతి): ముత్యాలపల్లి గొంతేరు డ్రెయిన్ ఆక్రమణ తొలగింపు కోసం శుక్రవారం హైకోర్టు ఆదేశాలతో అధికా రులు చేసిన ప్రయ త్నాలతో ముత్యాలపల్లిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ముత్యాలపల్లి వంతెన వద్ద నుంచి వారతిప్ప వంతెన వరకు 216 జాతీయ రహదారి వెంబడి సుమారు 37 ఎకరాలు ప్రభుత్వ భూమి ఆక్రమణలో ఉంది. ఈ భూముల విషయంలో ఇరువర్గాలు ఒకరిపై ఒకరు తమ ఆధీనంలో ఉన్న భూములు తమకే చెందాలని హైకోర్టును ఆశ్రయించారు. సమస్యను పరిశీలించి డ్రెయినేజీ భూములు ఆక్రమణల్లో ఉన్నందున మొత్తం ఆక్రమణలు తొలగించి డ్రెయినేజీ శాఖకు అప్పగించాలని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినట్టు సమాచారం. శుక్రవారం రెవెన్యూ, పోలీస్, ఫైర్ సిబ్బంది అంబులెన్స్ వాహనాలతో తమ సిబ్బందిని తీసుకువచ్చి అక్రమణ స్థలాన్ని గుర్తించి మార్కింగ్ ఇచ్చారు. ఈ క్రమంలో ఆక్రమణదారులు, ముత్యాలపల్లి వంతెన వద్ద 36 అడుగుల ఆభయాంజ నేయస్వామి ఆలయ కమిటీ భక్తులు గ్రామస్థుల నుంచి తీవ్ర అభ్యంతరాలు రావడంతో అధికారులు వారితో చర్చలు జరిపి హైకోర్టు ఆదేశాల మేరకు డ్రెయినేజీ భూమిని అక్రమణలు తొలగించి వారికి అప్ప చెప్పాల్సిందేనని వివరించడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆక్రమణలు క్షేత్రస్థాయిలో గుర్తించిన అఽధికారులు ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో మరో సమయంలో తొలగించేందుకు ఏర్పాట్లు చేసి వెనుతిరిగారు.