తల్లి పేరుపై రుణాలు తీసుకుని.. ఆపై హత్య
ABN , Publish Date - Oct 27 , 2026 | 01:12 AM
ఆర్థిక ఇబ్బందుల్లో సతమతమవుతూ తల్లి పేరుమీద రుణాలు తీసుకుని వాటిని కట్టే మార్గం లేక తల్లి మరణిస్తే ఆ రుణాలు రద్దయిపోతాయని నిర్ధారణ చేసుకుని తల్లిని హతమార్చిన కుమారుడిని ఏలూరు త్రి టౌన్ సీఐ వి కోటేశ్వరరావు అరెస్టు చేశారు.
తల్లి పేరుపై రుణాలు తీసుకుని.. ఆపై హత్య
తనయుడిని అరెస్టు చేసిన పోలీసులు
ఏలూరు క్రైం, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): ఆర్థిక ఇబ్బందుల్లో సతమతమవుతూ తల్లి పేరుమీద రుణాలు తీసుకుని వాటిని కట్టే మార్గం లేక తల్లి మరణిస్తే ఆ రుణాలు రద్దయిపోతాయని నిర్ధారణ చేసుకుని తల్లిని హతమార్చిన కుమారుడిని ఏలూరు త్రి టౌన్ సీఐ వి కోటేశ్వరరావు అరెస్టు చేశారు. ఏలూ రు త్రి టౌన్ పోలీస్ స్టేషన్లో సోమవారం రాత్రి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశ ంలో ఈ కేసు వివరాలను తెలిపారు. ఏలూరు శాంతినగర్ 14వ రోడ్డులో ఒంటరిగా నివాసం ఉంటున్న కొమ్ము సత్యవతి (53)కు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. రెండవ కుమారుడు సురేష్ ఏలూరు శ్రీరామ్‌నగర్ రెండవ రోడ్డులో ఇద్దరు పిల్లల మహిళతో సహజీవనం చేస్తున్నాడు. శాంతినగర్ 14వ రోడ్డులో బజ్జీల బండి పెట్టుకుని వ్యాపారం చేస్తున్నాడు. తన తల్లి సత్యవతి హోటళ్ళల్లో పనిచేసిన సొమ్మంతా ఆమె కుమార్తె, మనుమరాలికి ఇస్తుందని కక్ష పెంచుకున్నా డు. అంతేకాకుండా తల్లి పేరు మీద వివిధ ఖరీదైన ఫోన్లను ఫైనాన్స్ కంపెనీల ద్వారా తీసుకుని ఆ ఫోన్లను కొన్న షాపుల్లోనే విక్రయి ంచేశాడు. ఆమె పేరు మీద కూడా వ్యక్తిగత రుణాలు కూడా తీసుకున్నాడు. వాయిదాలు చెల్లించలేక ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న అతను తన తల్లి మరణిస్తే ఆ రుణాలు కట్టవలసిన అవసరం లేదని భావించి నిర్ధారణ చేసుకు న్నారు. దీంతో ఈనెల 24వ తేదీ మధ్యాహ్నం ఆమె వద్దకు వెళ్లి ఆమెతో గొడవపడి అకస్మాత్తుగా మెడనొక్కి నోట్లో గుడ్డలు పెట్టి చంపివేశాడు. తన వేలిముద్రలు ఎక్కడ తమ శరీరంపై ఉంటాయని భావించి ఆమెకు పౌడర్ కూడా రాశాడు. ఆమె కుమార్తె షేక్ నజీనా (నాగలక్ష్మి) ఇచ్చిన ఫిర్యాదు మేరకు త్రి టౌన్ సీఐ వి కోటేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సురేష్‌ను అదుపు లోకి తీసుకుని విచారించగా తాను హత్య చేసినట్లుగా అంగీకరించాడు. విలేకరుల సమావేశంలో ఎస్ఐ రాంబాబు పాల్గొన్నారు.