మున్సిపోల్స్
ABN , Publish Date - Jul 18 , 2026 | 12:23 AM
మున్సిపల్ ఎన్నికలపై ప్రభుత్వ పెద్దల నుంచి సంకేతాలు రావడంతో జిల్లాలోని ఆశావహుల్లో జోష్ నెలకొంది.
లేదనుకుంటే 2027 వరకు ఆగాల్సిందే...
అన్ని మున్సిపాలిటీలతో
నిర్వహించాలంటే విలీనం తప్పనిసరి
అన్నింటికీ ఒకేసారి రిజర్వేషన్లు ఖరారు
కూటమిలో సిద్ధంగా ఉన్న ఆశావహులు
వైసీపీలో అంతర్మథనం..విభేధాలతోనే సరి
(భీమవరం–ఆంరఽధజ్యోతి)
మున్సిపల్ ఎన్నికలపై ప్రభుత్వ పెద్దల నుంచి సంకేతాలు రావడంతో జిల్లాలోని ఆశావహుల్లో జోష్ నెలకొంది. అదే సమయంలో విలీన గ్రామాల సమస్యపై మీమాంస ఏర్పడింది. కూటమి అధిష్ఠానం నుంచి వచ్చిన సమాచారం మేరకు అయితే విలీన గ్రామాలను కలుపుకొనే ఎన్నికలు నిర్వహించనున్నారు. లేదంటే 2027 వరకు ఆగాల్సి ఉంటుంది. అప్పుడే విలీన గ్రామాలను మినహాయించి ఎన్నికలకు వెళ్లాలి. ఇప్పటికే జిల్లాలో భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, పాలకొల్లు పురపాలక సంఘాలకు వైసీపీ హయాం నుంచే ఎన్నికలు లేవు. ఈ సారి కూడా విలీన సమస్యతో ఎన్నికలు నిర్వహించకపోతే ఆర్థికంగా మున్సిపాలిటీలు నష్టపోనున్నాయి. ఆర్థిక సంఘం నిధులు మంజూరుకు పెద్ద అవరోధం కానుంది. ఇదే విషయంపై ప్రభుత్వ స్థాయిలో తర్జన భర్జన పడుతున్నారు. అన్ని మున్సిపాలిటీలతోనే విలీన గ్రామాల సమస్య ఉన్న మున్సిపాలిటీలకు ఎన్నిక నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు కూటమి అధిష్ఠానం నుంచి సంకేతాలు వస్తున్నాయి. ఆ మేరకు జిల్లాలోని కూటమి నేతల్లోనూ చర్చ జరుగుతోంది.రిజర్వేషన్‌లపైనే ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. గతంలో రాష్ట్రం యూని ట్‌గా అన్ని మున్సిపాలిటీలకు రిజర్వేషన్‌లు ఖరారు చేశారు. ఆ తర్వాతే జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలకు ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఇప్పుడు అవే రిజర్వేషన్లు ఉంటాయా లేదంటే కొత్తగా అమలులోకి వస్తాయనే విషయంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
పాలకొల్లు, తణుకులో జనరల్ ?
తణుకు, పాలకొల్లు పురపాలక సంఘాలు ఈ సారి జనరల్ కోటాలోకి వెళ్లనున్నాయి. స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీలుగా అప్‌గ్రేడ్ అయ్యాయి. ప్రస్తుత ప్రభుత్వంలోనే వీటిని స్పెషల్ గ్రేడ్‌గా ఖరారు చేశారు. ఇలా ఒక కేటగిరీ నుంచి మరో కేటగిరీకి అప్‌గ్రేడ్ అయినప్పుడు రిజర్వేషన్‌లు మళ్లీ మొదటి నుంచి ప్రారంభమవుతాయి. జనరల్ కేటగిరీ నుంచి సదరు మున్సిపాలిటీల్లో రిజర్వేషన్‌ను ప్రక్రియను కొనసాగిస్తారు. గతంలో భీమవరం, తాడేపల్లిగూడెం పురపాలక సంఘాలు స్పెషల్ గ్రేడ్ నుంచి సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీలుగా అప్‌గ్రేడ్ అయినప్పుడు జనరల్ కేటగరికీ చైర్మన్ పదవిని కేటాయిం చారు. ఇప్పుడు తణుకు, పాలకొల్లు పురపాలక సంఘాల్లోనూ అదే తరహాలో ఓసీ రిజర్వేషన్ ఖరారు కానుంది. భీమవరం, తాడేపల్లిగూడెం పట్టణాల్లో విలీన గ్రామాలున్నప్పటికీ రిజర్వేషన్ మాత్రం జనరల్ అయ్యే అవకాశం ఉండదు. రాష్ట్రంలోని ఇతర మున్సిపాలిటీలు, గతంలో ఇక్కడ అమలులో ఉన్న రిజర్వేషన్‌ను దృష్టిలో పెట్టుకుని మాత్రమే రిజర్వేషన్ అమలు చేస్తారు. దీనిపైనే ఇప్పుడు ఆశావహులు ఆశలు పెట్టుకున్నారు.
భీమవరం కార్పొరేషన్ అవుతుందా... ?
భీమవరం మున్సిపాలిటీని వైసీపీ హయాం లోనే ఉండి, భీమవరం నియోజక వర్గాల పరిధిలోని గ్రామాలను విలీనం చేస్తూ ప్రభు త్వానికి పంపారు. కార్పొరేషన్ చేయా లంటూ అప్పట్లో ప్రతిపాదించారు. కానీ భీమవరం రూరల్ మండలంలోని రాయలం, చినఅమిరం, తాడేరు, కొవ్వాడ అన్నవరం గ్రామా లను మాత్రమే విలీనం చేశారు. దాంతో కార్పొరేషన్ ప్రతిపాదన మరుగునపడింది. జిల్లా కేంద్రం కావడంతో జనాభా, ఆదాయం పరంగా కాకుండా కార్పొరేషన్ చేసే అవకాశం ప్రభు త్వానికి ఉంటుందని అధికారులు చెపుతు న్నారు. భీమవరం మున్సిపాలిటీకి అన్ని విధాల అర్హత లున్నాయి. ఆదాయ పరంగానూ చూసుకు న్నాసరే జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలకంటే అధిక ఆదాయం వస్తోంది. ఏడాదికి రూ. 35 కోట్లకు పైగానే ఆదాయం సమకూరుతోంది. రాష్ట్రస్థాయిలో గుర్తింపు ఉన్న విద్యా సంస్థలున్నాయి. ఇటీవల రైలు మార్గం కూడా వృద్ధి చెందింది. జాతీయ రహదారి కూడా ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇవన్నీ భీమవ రం మున్సిపాలిటీని కార్పొరేషన్ చేసేందుకు అర్హతలుగానే అంతా అభిప్రా యపడుతున్నారు. ఈసారి ఎన్నికలకు మాత్రం కార్పొరేషన్ ప్రతిపాదన అమలయ్యే అవకాశం లేదు. ప్రభుత్వం వద్ద అంత సమయం లేదు. కార్పొ రేషన్ చేసినట్టయితే విలీన గ్రామాల కేసులను ఉపసంహ రించుకుంటా మంటూ గతంలో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ భీమవరం విచ్చేసిన ప్పుడు స్థానిక నేతలు ప్రతిపాదించారు. ఇలా కార్పొ రేషన్‌పై అంతా సుముఖంగా ఉన్నారు. ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.