ఆశలు తారుమారు..
ABN , Publish Date - Oct 13 , 2026 | 12:52 AM
పుర ఎన్నికల్లో పోటీ చేద్దామను కున్న ఓసీ సామాజిక వర్గాల అంచనాలు తారుమారు అయ్యాయి. గత రిజర్వేషన్లతో బేరీజు వేసుకుని కొద్ది నెలలుగా తమ ప్రయత్నాల్లో ఉన్నారు.
అంచనాల్లో మునిగి...చివరకు నిరాశ
పుర ఎన్నికలకు రిజర్వేషన్లు ఖరారు
ఏలూరు కార్పొరేషన్ బీసీ జనరల్
నూజివీడు ఎస్సీ జనరల్
జంగారెడ్డిగూడెం బీసీ మహిళ
చింతలపూడి ఎస్సీ మహిళకు..
పురపాలక రిజర్వేషన్లతో ఓసీ వర్గాల్లో స్తబ్దత
అభ్యర్థుల జల్లెడకు రాజకీయ పార్టీలు సన్నద్ధం
జిల్లా రాజకీయ సమకరణాలపై చర్చ
ఏలూరులో తెరపైకి మార్గాని చంద్రకిరణ్?
(ఏలూరు– ఆంధ్రజ్యోతి)
పుర ఎన్నికల్లో పోటీ చేద్దామను కున్న ఓసీ సామాజిక వర్గాల అంచనాలు తారుమారు అయ్యాయి. గత రిజర్వేషన్లతో బేరీజు వేసుకుని కొద్ది నెలలుగా తమ ప్రయత్నాల్లో ఉన్నారు. మేయర్, చైర్మన్ పీఠం తమకేనంటూ ఏలూరు కార్పొరేషన్, నూజివీడు, జంగారెడ్డిగూడెంల్లోను ఆశావహులు కలలు కన్నారు. తీరా పోటీకి నిన్న, మొన్నటి వరకు సిద్ధమైన వారు సైతం ఖంగుతినేలా రిజర్వేషన్లు వచ్చాయి. ఆయా పురపాలక సంఘా ల్లో వివిధ వర్గాల జనాభా దామాషా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఖరారు కావడంతో నిశ్చేష్టులయ్యారు.
చింతలపూడి నగర పంచాయతీకి రిజర్వేషన్ ముందే ఊహించినట్టుగా ఎస్సీ మహిళకు కేటాయించారు. వాస్తవానికి ఇది ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గం కేంద్రం కావడం వలనే ఈ రకంగా తొలి రోటేషన్ పద్ధతిని వర్తింప చేశా రన్న వ్యాఖ్యలు వినవస్తున్నాయి. మిగిలిన మూ డు చోట్ల వార్డుల, డివిజన్ల పునర్విజభనతో పూర్తిగా రిజర్వేషన్లు మారిపోవడానికి ఆస్కారం ఏర్పడినట్టు సమాచారం. కూటమి ధర్మంలో భాగంగా రాష్ట్రస్థాయిలో పొత్తులు ఖరారు కావా ల్సి ఉంది. జిల్లాలో జనసేనకు ఛాన్సు ఉంటుం దా? అన్న ప్రశ్న ఉత్నన్నం అవుతోంది. ఏలూరు మేయర్ సీటు జనసేనకు ఇవ్వాలని రెడ్డి అప్పలనాయుడు పట్టుబడుతున్నారు. మేయర్ స్థానాల పరంగా మచిలీపట్నం, విజయవాడ, కాకినాడ కార్పొరేషన్‌లు జనసేనకే కేటాయింపు జరుగుతుందన్న ప్రచారంతో ఏలూరుకు అవకా శం ఇవ్వక పోవచ్చని ప్రచారం సాగుతోంది. మిగిలిన మూడు మున్సిపాల్టీల్లోను ఛాన్సు 50 శాతం లోపే అంటున్నారు.
ఏలూరు సీటుపై పురుష అభ్యర్థుల ఆశలు
జిల్లా కేంద్రమైన ఏలూరు మేయర్ పీఠం బీసీ జనరల్‌కు కేటాయింపు జరగడంతో బీసీ ల్లోని ఆశావహులు అతి త క్కువ మంది టీడీపీ నుంచి పోటీ పడుతున్నారు. తాజాగా మార్గాని చంద్ర కిరణ్ మేయర్ సీటుపై ఆశలు పెట్టుకు న్నారు. గౌడ సామాజిక వర్గానికి చెందిన ఈయన గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 1995 నుంచి బడేటి బుజ్జి ప్రధాన అనుచరుడిగా ఉన్నారు. ఏలూరు నియోజకవర్గ బీసీ సెల్ ప్రధాన కార్యదర్శితో పాటు పలు కీలక పదవు లకు పార్టీలో చేశారు. చాలాకాలంగా ఎమ్మెల్యే లకు వెన్నుదన్నుగా నిలిచిన కొప్పుల వెలమ బీసీ వర్గానికి చెందిన చల్లా ప్రసాద్ (కంప్యూ టర్ ప్రసాద్) పేరు వినపడుతోంది. ఈయన మాజీ ఎమ్మెల్యేలు అంబికాకృష్ణ, బడేటి బుజ్జి లకు వ్యక్తిగతంగా కీలకంగా వ్యవహరించారు, ప్రస్తుత ఎమ్మెల్యే బడేటి చంటికి తలలో నాలుక ఉంటూ పార్టీ మీడియా కో–ఆర్డినేటర్ బాధ్యత లను నిర్వహిస్తున్నారు. మాజీ కార్పొరేటర్‌గా రెండుసార్లు పనిచేసిన పృఽథ్వీశారద(దేవాంగ) పేరు వినిపిస్తోంది. ఓసీ జనరల్ అయితే పోటీ దిగడానికి ఈమె భర్త సోము పోటీపడ్డారు. ఇప్పుడు రిజర్వేషన్ మారడంతో భార్యను పోటీ కి నిలపాలని భావిస్తున్నారు. అన్న దివంగత నాయుడు పోతురాజు, బావ మరిది గంగాధర రావులు ఈ కుటుంబం నుంచి కార్పొరేటర్లుగా పనిచేశారు. మరోవైపు టీడీపీ నగర కార్యదర్శి రెడ్డి నాగరాజు(కొప్పుల వెలమ) పేరు వినిపి స్తోంది. మరో మాజీ కౌన్సిలర్ బెల్లంకొండ కిశోర్ (శెట్టి బలిజ) పోటీ పడుతున్నారు. ఓసీ వర్గం లో కాపు, ఆర్యవైశ్య వర్గాలు ఇప్పుడిచ్చిన రిజ ర్వేషన్‌ను జీర్ణించుకోలేకపోతున్నారు. 22 ఏళ్ల కార్పొరేషన్ చరిత్రలో ఐదేళ్లు ఎస్సీ వర్గాలకు చెందిన ఇద్దరు మేయర్లుగా, అటు తర్వాత బీసీ వర్గం నుంచి పార్టీలు మారినా రెండుమార్లు షేక్ నూర్జహాన్ మేయర్‌గా పనిచేశారు. అయితే ఈసారి పురుష అభ్యర్థికే పార్టీ మొగ్గు చూపే అవకాశం ఉంది. పొత్తు ధర్మంలో మేయర్ పదవికి మాకే కేటాయించాలని పట్టుబడుతున్న జనసేన నేతలు తూర్పుకాపు వర్గానికి చెందిన బీసీ నేతలు రెడ్డి అప్పలనాయడు, రెడ్డి అను రాధ, నారా శేషులు సీటు ఆశిస్తున్నారు.
వైసీపీ అభ్యర్థుల వేట మొదలు
బీసీ జనరల్‌కు మేయర్ పదవి రిజర్వ్ కావ డంతో వైసీపీ ఏలూరు నియోజకవర్గ ఇన్‌చార్జి మామిళ్లపల్లి జయప్రకాశ్ ఆఽధ్వర్యంలో మాజీ మంత్రి గుడివాడ అమరనాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం రాత్రి సమీక్ష జరిగింది. ఇందులో మాజీ డిప్యూటీ మేయర్ గుడిదేశి శ్రీనివాస్, గంటా మోహన్‌రావు(తూర్పుకాపు)ల పేర్లు చర్చకు వచ్చాయి. మూడో వ్యక్తిగా గేదెల సూర్యప్రకాశరావు(కొప్పుల వెలమ) పేరును చర్చించారు.
జంగారెడ్డిగూడెంలో మూడో ‘సారీ’..
నగర పంచాయతీ నుంచి స్పెషల్ గ్రేడ్ వరకు బీసీలకు చెందిన నేతలు.. అదీ కూడా మహిళలే జంగారెడ్డిగూడెం పీఠంను అధిష్ఠించా రు. ఈసారి పక్కాగా జనరల్‌కు కేటాయిస్తారని తలపోసిన కూటమి నేతలు ఖంగుతిన్నారు. నగర పంచాయతీగా ఎన్నికల్లో బీసీ మహిళ, మున్సిపాల్టీగా రెండో పర్యాయం జరిగిన ఎన్ని కల్లో జనరల్ మహిళకు కేటాయించగా బీసీ మహిళే ఈ పీఠంను దక్కించుకున్నారు. మూడో సారి ఇప్పుడు బీసీ మహిళకు రిజర్వేషన్ కేటా యించడంతో జనరల్ నుంచి సీటు ఆశించిన నాయకులు నిరాశకు గురయ్యారు.
చింతలపూడిలో మారిన లెక్కలు
చింతలపూడి: చింతలపూడి నగర పంచా యతీకి రిజర్వేషన్‌ను ఎస్సీ మహిళకు కేటా యించారు. దీంతో ఇప్పటివరకు తొలిపోరుకు సిద్ధమైన ఆశావహులు నిరాశ చెందారు. కొత్త మహిళా అభ్యర్థి కోసం ప్రధాన పార్టీల అన్వేషణ ప్రారంభమైంది. 2021 జనవరిలో నగర పంచాయతీగా మారింది., అప్పటి నుంచి యాక్ట్ 5 స్టే ఉంది. దానిని ఇటీవల ఎత్తివేయడంతో తొలిసారిగా ఎన్నికలు జరగ నున్నాయి. వార్డుల పెంపు, వార్డుల వారీగా రిజర్వేషన్లు ఒకట్రెండు రోజుల్లో తేలనుంది.
వీడిన ఉత్కంఠ
జిల్లాలో పురపాలక సంఘాల ఎన్నికలకు రిజర్వేషన్లపై ఉత్కంఠ వీడింది. మును పెన్నడూ లేని విధంగా అన్‌రిజర్వుడు (ఓసీ)వర్గాల ప్రస్తా వన లేకుండానే రిజర్వేషన్లు ఖరారు చేశారు. ఒకేరోజు అన్ని రిజర్వేషన్ల లెక్కతేలింది. ఇక రాజకీయ పార్టీలు అభ్యర్థులను ఎంపిక చేయ డమే మిగిలింది. ఏలూరు కార్పొరేషన్ మేయర్ పదవిని బీసీ జనరల్‌కు, నూజివీడు మున్సిపల్ చైర్మన్ పద వి ఎస్సీ జనరల్‌కు, జంగారెడ్డి గూడెం మున్సిపాల్టీ చైర్‌పర్సన్ పదవి బీసీ మహిళకు,తొలి సారిగా నగర పంచాయతీగా చింతలపూడి ఎన్నికకు చైర్మన్ పదవి ఎస్సీ మహిళకు కేటా యించారు. ఇప్పుడు ఈ సామాజిక వర్గాల నుంచి అభ్యర్థుల ఎంపికపై రాజకీయ పక్షాలు కసరత్తు చేయాల్సి ఉంటుం ది. కూటమి పొత్తుల్లో ఎవరికి చైర్మన్ సీటు కేటాయిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ప్రతిపక్ష వైసీపీ కూడా అభ్యర్థుల వేటలో ఉంది. తాజా రిజర్వేషన్ల నేపథ్యంలో ఓసీ సామాజిక వర్గాలకు చెందిన కీలక నేతలు జిల్లా పాలన, పార్టీ వ్యవహా రాలను చూస్తున్న ప్పటికి కీలకమైన పట్టణాల్లో బీసీ మంత్రం ఫలించింది. మంత్రి కొలుసు పార్థసారఽథి నియోజకవర్గం నూజివీడులోను పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. రిజర్వుడు ఎమ్మెల్యే స్థానమైన చింతలపూడిలో కూటమి సత్తా చాటేందుకు రిజర్వేషన్ ఊతమివ్వనుంది.
టీడీపీకే మేయర్ సీటు ?
ఏలూరు టూటౌన్,అక్టోబరు 12(ఆంధ్రజ్యోతి): ఏలూరు నగర పాలక సంస్థ మేయర్ పదవికి అంతా ఊహించిన విధంగానే బీసీ జనరల్‌కు కేటాయించారు. ఇప్పటికే డివిజన్లలోను అధిక శాతం బీసీలకే పెద్దపీట వేశారు. నగరంలో 62 వార్డులుంటే బీసీ జనరల్‌కు 11, బీసీ మహిళలకు 11 మొత్తం 22 డివిజన్లు కేటాయించారు. ఎస్టీ జనరల్ 1, ఎస్సీ జనరల్ 4, ఎస్సీ మహిళలు 4, జనరల్ మహిళ 16, అన్‌రిజర్వ్‌డ్ 15 డివిజన్లు కేటాయించారు. ఈక్రమంలో మేయర్ సీటుపై ఉత్కంఠ నెలకొంది. మేయర్ పదవి టీడీపీకా, జనసేనకా అనేది తేలలేదు. టీడీపీకే కేటాయించే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నారు. ఎందుకంటే స్థానికంగా టీడీపీ ఎమ్మెల్యే ఉండటం, 2024 ఎన్నికల్లో 63వేల భారీ మెజారిటీతో గెలుపొందడం టీడీపీకి అనుకూలించే అంశాలు. నియోజకవర్గంలో ఏ పార్టీ ఎమ్మెల్యే, ఎంపీలున్నారో ఆ పార్టీలకే చైర్మన్ సీట్లు ఇచ్చేందుకు కూటమి నేతలు సూత్రప్రాయంగా అంగీకారానికి వచ్చినట్లు తెలుస్తుంది. టీడీపీకి మేయర్ పదవి కేటాయిస్తే అభ్యర్థి ఎవరనేది ప్రశ్నగా మారింది. పార్టీలో అత్యఽధికులు బీసీలే ఉన్నారు.