లెక్క తేలింది..!
ABN , Publish Date - Oct 16 , 2026 | 12:38 AM
స్థానిక సంస్థల ఎన్నికలపై కూటమిలో సర్దుబాటు లెక్కలు తేలాయి. మున్సి పాలి టీలకు శుక్రవారం నుంచే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది.
ఏలూరు జనసేనకు.. జంగారెడ్డిగూడెం, నూజివీడు, చింతలపూడి టీడీపీకి..
ప్రకటించిన కూటమి పార్టీల అధిష్ఠానాలు.. ఏలూరు టీడీపీలో అసంతృప్తి
మేయర్ అభ్యర్థిగా జనసేన నుంచి అప్పలనాయుడు.. వైసీపీ నుంచి జీఎంఆర్
మున్సిపోల్స్కు నేటి నుంచే నామినేషన్లు.. ప్రత్యేక కౌంటర్ల ఏర్పాట్లు
ఏలూరు, అక్టోబరు 15(ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికలపై కూటమిలో సర్దుబాటు లెక్కలు తేలాయి. మున్సి పాలి టీలకు శుక్రవారం నుంచే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చింది. జిల్లాలో ఏలూరు కార్పొరేషన్ మేయర్ పదవిని జనసేనకు కేటాయించారు. ఈ సీటును ఆశించిన రెడ్డి అప్పలనాయుడుకు లైన్ క్లియర్ అయ్యింది. నూజివీడు(ఎస్సీ జనరల్) జంగారెడ్డిగూడెం(బీసీ మహిళ)తోపాటు చింతలపూడి నగర పంచాయతీలలోని చైర్మన్ సీట్లు టీడీపీకే కేటాయించారు. ఈ మూడుచోట్ల చైర్మన్ అభ్యర్థిత్వాలతోపాటు వార్డుల సర్దుబాట్లు కొలిక్కి రాలేదు. ఈనెల 19 నుంచి ఎంపీ టీసీలు, జడ్పీటీసీలకు నోటిఫికేషన్ విడు దల కానుంది. ఆ తర్వాత పంచాయతీలకు మూడు విడతల్లో ఎన్నిక నిర్వహిస్తారు.
నేడు నోటిఫికేషన్లు
జిల్లాలో మూడు పురాల ఎన్నికలకు ప్రత్యేకాధికారులు నోటిఫికేషన్లను శుక్ర వారం విడుదల చేస్తారు. అనంతరం నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. ఏలూరు కార్పొరేషన్ (బీసీ జనరల్) 62 డివిజన్లు, జంగారెడ్డిగూడెం (బీసీ మహి ళ) 32 వార్డులు, నూజివీడు (ఎస్సీ జనరల్) 36 వార్డులకు ఆయా కమిషనర్ల పర్యవేక్షణలో నామినేషన్లు స్వీకరిస్తారు. ఏలూరులో 16 మంది ఆర్వోలను నియ మించగా, ఒక్కో రూమ్లో నాలుగు డివి జన్లకు, జంగారెడ్డిగూడెంలో నాలుగుచోట్ల 8 వార్డుల చొప్పున నలుగురు ఆర్వోలు, నూజివీడులో పది మంది ఆర్వోలు నాలు గు వార్డుల చొప్పున నామినేషన్ల స్వీకరిస్తారు. పోలీస్ అధి కారులు బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షిం చారు. అభ్యర్థితోపాటు ఐదుగురిని అను మతించనున్నారు. మూడు రోజులపాటు నామినేషన్ల స్వీకరిస్తారు. 19న నామినేషన్ల పరిశీలన, 21న సాయంత్రం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు.
జంగారెడ్డిగూడెంలో..
జంగారెడ్డిగూడెం: మున్సిపల్ కార్యాలయం లో చైర్పర్సన్ అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. ఒకటి నుంచి 8 వార్డుల వరకు పాత మున్సిపల్ కార్యాలయం వద్ద కేసనపల్లి స్వర్ణ వార్డు కార్యాలయంలో, తొమ్మిది నుంచి 16 వార్డులకు జడ్పీ బాలికల హైస్కూల్లో, 17 నుంచి 24 వరకు జడ్పీ బాలుర హైస్కూల్లో, 25 నుంచి 32 వార్డుల వరకు డిగ్రీ కళాశాలలో స్వీకరించను న్నట్టు కమిషనర్ కేవీ రమణ తెలిపారు.
నూజివీడులో..
నూజివీడు టౌన్: నూజివీడు మున్సి పల్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణకు తొమ్మిది కౌంటర్లను ఏర్పాటు చేశారు. మరో కౌంటర్ చైర్మన్ అభ్యర్థి నామి నేషన్లకు ఏర్పాటు చేశారు.ఎన్నికల అధి కారులకు గురు వారం శిక్షణ నిర్వ హించారు. సబ్ కలె క్టర్ వినూత్న మున్సి పల్ కార్యాలయ ప్రాంగణం లో నామినేష్ల స్వీకరణ ఏర్పాట్లను గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
జన సేనకు ఏలూరు మేయర్ స్థానం!
పొత్తులో భాగంగా ఏలూరు కార్పొ రేషన్ మేయర్ సీటును జనసేనకు కేటా యించడంతో అభ్యర్థిగా రెడ్డి అప్పల నాయుడు పోటీ చేయడం ఖరారైంది. మరోవైపు ఏలూరు టీడీపీ వర్గాల్లో ఆందోళన మొదలైంది. స్థానిక టీడీపీ కార్యాలయంలో గురువారం రాత్రి పార్టీ నేతలు కంప్యూటర్ ప్రసాద్, చోడే వెంకట రత్నం, రెడ్డి నాగరాజు, ఎస్ఎం ఆర్ పెద బాబు, మారం హనుమంతరావు తదితరు లు మాట్లాడుతూ టీడీపీ అధిష్ఠానం పునః పరిశీలించి మేయర్ సీటును టీడీ పీకి కేటాయించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో శుక్రవారం పార్టీ జిల్లా అధ్య క్షుడు, ఎమ్మెల్యే బడేటి చంటిని కలిసి టీడీపీ నగర కార్యవర్గం, 62 డివిజన్ల ఇన్ ఛార్జ్లు, క్లస్టర్ ఇన్చార్జ్లు మూకుమ్మడి రాజీనామాలు సమర్పిస్తామని హెచ్చరిం చారు. మరోవైపు నగరంలో 15 చోట్ల జన సేన అభ్యర్థులను బరిలో దింపేందుకు పావులు కదిపింది. అప్పలనాయడు శనివారం నామినేషన్ దాఖలు చేయనున్నారు.
వైసీపీ మేయర్ అభ్యర్థిగా జీఎంఆర్
వైసీపీ మేయర్ అభ్యర్థిగా గంటా మోహన్రావు(తూర్పుకాపు)ను అఽధి ష్ఠానం ప్రకటించింది. కొమడవోలుకు చెందిన ఈయన ఆది నుంచి కాంగ్రెస్లో క్రియశీల కార్యకర్తగా ఉన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి. వైసీపీలో జగన్తో అభిమానంతో చేరారు. వైసీపీ రాష్ట్ర వాణిజ్యసెల్ కార్యదర్శిగా పనిచేస్తున్నారు.
అభ్యర్థుల వేటలో కాంగ్రెస్
జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రాజనాల రామ్మోహన్రావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ మేయర్ అభ్యర్థి వేట మొదలైంది. ఆశావహుల నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించారు. 30 డివిజన్లలోనైనా అభ్యర్థులను బరిలో దింపాలని ప్రయత్నాలు మొదలయ్యాయి.
పొత్తుతో వామపక్షాలు పోటీ
ఏలూరు నగరంలో సీపీఎం, సీపీఐ బలం ఉన్నచోట్ల పోటీకి తమ అభ్యర్థులను దింపాలని నిర్ణయించింది. సీపీఐ ఆరు డివిజన్లలోను, సీపీఎం మూడు డివిజన్లల్లో పోటీకి సిద్ధమైంది.