Share News

పురపోరు.. ప్రశాంతం

ABN , Publish Date - Nov 02 , 2026 | 01:32 AM

ఏలూరు జిల్లాలో ఆదివారం ఏలూరు నగర కార్పొరేషన్‌తో పాటు జంగారెడ్డిగూడెం, నూజివీడు మునిసిపాలిటీలకు ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి.

పురపోరు.. ప్రశాంతం
ఏలూరు గాంధీనగర్‌ నగర పాలక ఉన్నత పాఠశాలలో ఓటర్ల క్యూ

ఏలూరు కార్పొరేషన్‌, జంగారెడ్డిగూడెం, నూజివీడు మునిసిపాలిటీల్లో ఎన్నికలు

కార్పొరేషన్‌లో మందకొడిగా..

మునిసిపాలిటీల్లో కాస్త జోరుగా పోలింగ్‌.. పటిష్ఠ బందోబస్తు

ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్‌, ఎస్పీ

ఏలూరు/ఏలూరు టూటౌన్‌/నూజివీడు/ జంగారెడ్డిగూడెం, నవంబరు 1(ఆంధ్రజ్యోతి): ఏలూరు జిల్లాలో ఆదివారం ఏలూరు నగర కార్పొరేషన్‌తో పాటు జంగారెడ్డిగూడెం, నూజివీడు మునిసిపాలిటీలకు ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసింది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ఠ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఏలూరు నగర పాలక సంస్థ పాలక మండలికి ఆదివారం జరిగిన ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. పటిష్ఠ పోలీస్‌ బందోబస్తు నడు మ ఎన్నికలు జరిగాయి. ఎక్కడా అవాంఛ నీయ ఘటనలు జరగలేదు. పోలింగ్‌ మొదటి వేగంగా ప్రారంభమైనా చివరి వరకు మంద కొడిగానే సాగింది. ఉదయం 8.30 గంటల వరకు 255 పోలింగ్‌ కేంద్రాల్లో ఓటర్ల సందడి ఉన్నట్లు కనిపించినా..అప్పటికే ఏడు శాతమే ఓట్లు పోలయ్యాయి. మధ్యాహ్నం ఒంటి గంటకు సగటున 30 శాతమే ఓట్లు పోల య్యా యి. సాయంత్రం 5 గంటలకు ఎక్కడ బారులు తీరిన పరిస్థితి లేకపోగా.. ఎక్కువ శాతం పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్ల కోసం పోలింగ్‌ సిబ్బంది వేచి ఉండటం కన్పించింది. నగరంలో 62 డివిజన్లకు 2,37,256 మంది ఓటర్లకు గాను 1,41,506 ఓట్లు (59.64 శాతం) పోలయ్యాయి. పురుష ఓటర్లు 1,13,332 మందికి గాను 67,919 మంది ఓటేశారు. మహిళా ఓటర్లు 1,23,873 మంది ఉండగా, ఇందులో 73,564 మంది ఓటే శారు. ఇతరులు 59 మందికి 23 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 164 అభ్యర్థులు బరిలో తలపడ్డారు. 2021లో నగర పాలక సంస్థకు జరిగిన ఎన్నికల్లో 56.22 శాతం పోలింగ్‌ నమోదైంది. ఈ ఏడాది గతంలో కంటే 3.36 శాతం పెరిగింది. వృద్ధులు, దివ్యాంగులు, మొట్ట మొదటిసారి ఓటింగ్‌ వేసిన వారు ఉత్సా హంగా పాల్గొన్నారు. మేయర్‌ అభ్యర్థి జనసేన నేత, కూటమి అభ్యర్థి రెడ్డి అప్పలనాయుడు 6వ డివిజన్‌లోని మస్తాన్‌ మణ్యం కాలనీ ఎంపీపీ పాఠశాలలో ఓటు హక్కు వినియోగిం చుకు న్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే బడేటి చంటి పవర్‌ పేట ఎంపీయూపీ పాఠశాలలో మొదటి గంటలోనే తన ఓటుహక్కును వినియోగించుకున్నారు. పోలింగ్‌ అనంతరం బ్యాలెట్‌ బాక్సులను సీఆర్‌.రెడ్డి ఇంజనీరింగ్‌ కాలేజీకి తీసుకెళ్లి పోలీసుల బందోబస్తు మధ్య భద్రపరిచారు. ఇక్కడ భద్రతా అంశాలను కలెక్టర్‌ వెట్రిసెల్వి పరిశీలించారు. ఈ నెల 3న ఓట్ల లెక్కింపునకు పోలింగ్‌ సిబ్బంది, ఏజెంట్ల సమక్షంలో బ్యాలెట్‌ బాక్సులను తెరిచి లెక్కి స్తామన్నారు.

నూజివీడులో 72.31 శాతం

నూజివీడులో పురపాలక ఎన్నికలు 57 పోలింగ్‌ స్టేషన్లలో ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 36 వార్డులలో 42,952 మంది ఓటర్లకు 31,067 మంది (72.31 శాతం) ఓటు వేశారు. ఉదయం ఏడు గంటలకు ఎన్నికల అధికారులు పోలింగ్‌ ప్రక్రియను ప్రారంభించగా తొలి గంట పోలింగ్‌ ప్రక్రియ మందకొడిగా సాగి కేవలం 5.90% మాత్రమే ఓట్లు పోలయ్యాయి. అనం తరం వడివడిగా పోలింగ్‌ శాతం పెరి గింది.

జంగారెడ్డిగూడెంలో 61.06

జంగారెడ్డిగూడెంలో మున్సిపల్‌ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి.ఉదయం ఆరు గంటలకు ఎన్నికల అధికారులు మాక్‌ పోలింగ్‌ నిర్వహించారు. అనంతరం ఏడు గంటల నుంచి పోలింగ్‌ నిర్వహించారు. పట్టణంలోని 32 వార్డులకు ఒక్కొక్క వార్డుకు రెండు పోలింగ్‌ కేంద్రాలు చొప్పున 64 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు మొత్తం 48,463 ఓట్లకు 29,591 ఓట్లు (61.06శాతం) పోలయ్యాయి.సుమారు 40 శాతం 18,872 ఓట్లు పోల్‌ కాలేదు. వీటిలో డెత్‌లు, మైగ్రేషన్లు సుమారు 20 శాతం ఓట్లను తీసివేసినా మిగతా 20 శాతం మంది ఓటర్లు తమ ఓటు వేయడానికి సుముఖత చూపలేదు. మున్సిపల్‌ టీడీపీ చైర్‌ పర్సన్‌ అభ్యర్థిని రొంగల అనూష 16వ వార్డులో, వైసీపీ చైర్‌పర్సన్‌ అభ్యర్థిని మేకా సత్యవతి 26 వార్డులో తమ ఓటుహక్కు వినియోగించు కున్నారు.

Updated Date - Nov 02 , 2026 | 01:33 AM