పుర ఎన్నికలకు సమాయత్తం
ABN , Publish Date - Aug 14 , 2026 | 12:25 AM
జిల్లాలో పుర ఎన్నికలకు సర్వం సమాయత్తం అవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పురాల్లోని పాలకవర్గాల పదవీకాలం ముగియడంతో అన్నిచోట్ల ఒకే సారి ఎన్నికల జరపడానికి మార్గం సుగమం అయ్యింది.
సెప్టెంబరు 3న ఓటర్ల జాబితాల ప్రచురణ
త్వరలోనే రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి
ప్రత్యక్ష పద్ధతిలోనే మేయర్, చైర్మన్‌ల ఎన్నిక ?
(ఏలూరు–ఆంధ్రజ్యోతి)
జిల్లాలో పుర ఎన్నికలకు సర్వం సమాయత్తం అవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పురాల్లోని పాలకవర్గాల పదవీకాలం ముగియడంతో అన్నిచోట్ల ఒకే సారి ఎన్నికల జరపడానికి మార్గం సుగమం అయ్యింది. తాజాగా సెప్టెం బరు మూడో తేదీన కార్పొరేషన్లు, మున్సి పాల్టీలు, నగర పంచాయతీల్లో ఫొటోలతో కూడిన ఓటర్ల జాబితాలను వార్డులు, డివి న్ల వారీగా ప్రచు రించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. పురపాలకశాఖ ప్రత్యేకాధి కారులు, కమిష నర్లు ఎన్నికలకు అడుగులు వేస్తున్నారు.
జిల్లాలో ఏకైక కార్పొరేషన్ ఏలూరు పాలకవర్గం పదవీ కాలం గడువు జూలై నెలాఖరున ముగియగా, నూజివీడు, జంగారెడ్డిగూడెంలకు మార్చి నెలాఖరున పదవీ కాలం పూర్తయింది. ఇప్పుడు ఈ మూడు చోట్ల ప్రత్యేకాధికారులు పాలన సాగుతోంది. చింతలపూడి నగరపంచాయతీగా ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు ఎన్నికే జరగలేదు. తాజాగా ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ముగింపు దశకు చేరింది. డోర్ నెంబర్లు వారీగా ఇప్పుడున్న ముసాయిదా జాబితాలతోనే వార్డు, డివి జన్లలో ఫొటో ఓటర్ల జాబితాలను ప్రచురించను న్నారు. ఇప్పుడు సర్ కార్యక్రమంలో ఓటర్ల నుంచి అభ్యంతరా ల ను పరిశీలించి, నోటీసులు ఇచ్చి తొలగింపులు, మార్పుల ప్రక్రియ చేస్తుండటంతో సెప్టెంబరు 3వ తేదీ నాటికి జాబితాల ప్రచురణ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.
వార్డుల రిజర్వేషన్లపై ప్రతిష్టంభన వీడేనా ?
అసంబద్ధంగా వార్డుల విభజన చేశారంటూ కొంత మంది కోర్టుకెక్కడంతో రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేషన్లు, వార్డుల రిజర్వేషన్ల ప్రక్రియ ఇంకా కొలిక్కిరాలేదు. దీనిపై హైకోర్టు స్టే నడుస్తోంది. బీసీ రిజర్వేషన్ల అంశంపై డెడికే షన్ కమిటీ త్వరలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మొత్తం మీద రాష్ట్రవ్యాప్తంగా కార్పొరేషన్, పురపాలక సంఘాలు, నగర పంచాయతీలకు మేయర్, చైర్మన్ల రిజర్వేషన్లు కొలిక్కి తీసుకువచ్చే ప్రయత్నం మొదలైంది. దీంతో సెప్టెంబరు నెలాఖరు నాటికి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం లేకపోలేదని చెబుతున్నారు. ఏలూరులో 62 వార్డులు, జంగారెడ్డి గూడెంలో 32 వార్డులు, నూజివీడులో 36 వార్డుల పెంపునకు ఒకటి రోజుల్లో గ్రీన్‌సిగ్నల్ రానుంది.
ఈసారి మేయర్, చైర్మన్ల ఎన్నికలు ప్రత్యక్ష పద్ధతిలోనే జరపాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీంతో కూటమి పార్టీల నడుమ సర్దుబాటులతో చైర్మన్, మేయర్ అభ్యర్థులను ఖరారు చేయాల్సి వుంటుంది. దీనివల్ల ఐదేళ్ల పాటు మేయర్, చైర్మన్లను కదిపే ప్రసక్తి లేకుండా ఎన్నికలు సజావుగా సాగడం, గ్రూపులు లేకుండా ముందుకు సాఫీగా సాగడానికి కూటమి పార్టీలకు అవకాశం ఏర్పడనుంది. ఇది ప్రభుత్వం, ఎన్నికల సంఘం పరిశీలనలో ఉంది. అయితే చింతలపూడి నగరపంచాయతీ ఎన్నికపై ఇంకా సందిగ్ధం వీడలేదు. నోటిఫికేషన్ వచ్చేలోగా కోర్టు కేసు సమసిపోతే ఎన్నికలు ఇక్కడ జరిపే అవకాశం లేకపోలేదు.