ఆకివీడులో ముఖాముఖి
ABN , Publish Date - Oct 22 , 2026 | 12:46 AM
ఆకివీడు నగర పంచాయతీ ఎన్నికల్లో బుధవారం నామినేషన్ల ఉపసంహరణ తర్వాత కూటమి పార్టీల తరపున తెలుగుదేశం అభ్యర్థిగా షేక్ నిలోఫర్, వైసీపీ నుంచి మన్నే లలితాదేవి నిలిచారు.
మునిసిపోల్స్‌కు రెడీ
చైర్‌పర్సన్‌కు టీడీపీ నుంచి నిలోఫర్, వైసీపీ నుంచి లలితాదేవి
తొమ్మిది వార్డుల్లో ఏకగ్రీవం !
19 వార్డులో 41 మంది పోటీ
ఆకివీడు, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): ఆకివీడు నగర పంచాయతీ ఎన్నికల్లో బుధవారం నామినేషన్ల ఉపసంహరణ తర్వాత కూటమి పార్టీల తరపున తెలుగుదేశం అభ్యర్థిగా షేక్ నిలోఫర్, వైసీపీ నుంచి మన్నే లలితాదేవి నిలిచారు. 28 వార్డులకుగాను తొమ్మిది చోట్ల ఒక్కొక్క అభ్యర్థి మాత్రమే మిగలగా వీరు ఏకగ్రీవమైట్లే.. అయితే అధికారికంగా ప్రకటించాల్సి వుంది. మిగిలిన 19 వార్డుల్లో 41 మంది కౌన్సిలర్ అభ్యర్థులు మిగిలారు. వీరిలో కూటమి పార్టీలైన టీడీపీ నుంచి 15 మంది, జనసేన, బీజేపీల నుంచి చెరో ఇద్దరు చొప్పున నిలిచారు. ఇక వైసీపీ నుంచి 19 మంది, సీపీఎం నుంచి ఇద్దరు, స్వతంత్ర అభ్యర్థి ఒకరు ఉన్నారు.చైర్‌పర్సన్‌తో పాటు అత్యధిక వార్డుల్లో పోరు ముఖాముఖిగా జరగనుంది.
నామినేషన్ల ఉపసంహరణ
కౌన్సిలర్ అభ్యర్థులకు మొత్తం 119 నామినేషన్లు దాఖలు కాగా, బుధవారం వివిధ పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు తమ నామినేషన్లను ఉపసంహరించు కున్నారు. దీంతో తొమ్మిది వార్డుల్లో ఒక్కొక్క అభ్యర్థి మాత్రమే బరిలో మిగలడంతో ఇవి ఏకగ్రీవమైనట్లే. వీటిలో టీడీపీ మూడు, జనసేన ఆరు వార్డులు ఉన్నాయి. వీరిలో టీడీపీ నుంచి గూడాల మణి(1వ వార్డు), బత్తుల శ్యామల(9), కిమిడి అరుణకుమారి(12), జనసేన నుంచి తోట శ్రీనివాసరావు(2), రుంకాన శ్రీహరి(4), పుప్పాల వెంకట సత్యనారాయణ(7), పిల్లా నరశింహరావు(8), జల్లా లక్ష్మి(18), కారంపూడి జానకిసుమంత్(20) ఉన్నారు. అధికారులు వీటిని ధ్రువీకరించాల్సి వుంది.
కూటమి నుంచి బరిలో..
టీడీపీ నుంచి బాదం లక్ష్మి(5), యర్రా మధుక్రాంతి(10), అడపా తిరుమల్లేశ్వరి(14), మహ్మాద్‌అరీముల్లా(15), బొల్లా వీరశ్వేత(16), బొండాడ విజయనిర్మల(17), షేక్ సగీరా(19), శిరపు శ్రీనివాస్(21), ఉత్తిరిల్లి జ్యోతిహుమకుమారి(22), దూబ ధనలక్ష్మి(23), మాకా లక్ష్మణరావు(24), వూడిగ శ్రీనివాసరావు(25), వేగేశ్న రామరాజు(26), సందా కృష్ణవేణి(27), కటికతల జాన్‌వెస్లీ(28), జనసేన నుంచి.. అందే జలదుర్గ(6), పైలా శివశిరీష(11), బీజేపీ నుంచి వీర్ల కుమారి(3), చొప్పెర్ల లీలా(13) బరిలో నిలిచారు.
ప్రతిపక్షాల నుంచి
వైసీపీ నుంచి.. అంబటి శ్యామలారాణి(3), ఎన్ని నాగమణి(5), బేతపూడి రత్నకుమారి(6), బండారు రాణి(10), కుంచాడ బాబ్జి(11), నక్కాని దుర్గాదేవి(13), నిమ్మల వినీత(14), మహ్మాద్ రియాజుద్దీన్ ఆలీ అహ్మాద్ (15), మన్నే పోతురాజు(16), మద్దా ఫ్రాన్సినా (17), మహ్మాద్ ఫర్విన్‌భాను(19), దొడ్డి జగదీష్(21), జామి ఇంద్రాణి(22), గేదెల అప్పారావు(24), బొక్కా శ్రీనివాసరావు(25), పడాల శ్రీనివాసరెడ్డి(26), పడాల రత్నమణి(27), కటికతల వసంతరావు(28వ వార్డు). సీపీఎం నుంచి సందక ఉదయ్‌కుమారి(23), బొక్కా వెంకటవర్మ(25), స్వతంత్ర అభ్యర్థి మాసిపోగుల కోటేశ్వరరావు(28) బరిలో నిలిచారు.
నరసాపురంలో త్రిముఖం!
చైర్‌పర్సన్ బరిలో ముగ్గురు..
వార్డుల్లో 91 మంది
36 వార్డుల్లో.. టీడీపీ 17, జనసేన 17, బీజేపీ 2, వైసీపీ 35,
నరసాపురం, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): నరసాపురం పురపాలక సంఘం చైర్ పర్సన్ అభ్యర్థుల మధ్య త్రిముఖ పోరు జరగనుంది. బుధవారం పలువురు అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. చైర్‌పర్సన్ బరిలో ముగ్గురు అభ్యర్థులు, 36 వార్డులకు గాను 91 మంది అభ్యర్థులు మిగిలారు. అయితే పూర్తి వివరాలను సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల సంఘం అధికారులు ధ్రువీకరించలేదు. పోటీలో కూటమి పార్టీలకు చెందిన టీడీపీ నుంచి 17, జనసేన నుంచి 17, బీజేపీ నుంచి ఇద్దరు మొత్తం 36 మంది పోటీలో ఉండగా.. వైసీపీ నుంచి 36, సీపీఎం నుంచి ఇద్దరు, కాంగ్రెస్ నుంచి ఒకరు, 16 మంది స్వతంత్ర ఆభ్యర్థులు బరిలో నిలిచారు. మొత్తం 164 మంది నామినేషన్లు వేయగా.. పరిశీలనలో ఒకటి తిరస్క రించారు. మిగిలిన 163లో 72 మంది ఆభ్యర్ధులు బుధవారం నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. చైర్‌పర్సన్ అభ్యర్థిగా జనసేన నుంచి కొత్తపల్లి శైలజ, వైసీపీ నుంచి కావలి రామసీత, కాంగ్రెస్ నుంచి సంతోషికుమారి పోటీ పడుతున్నారు. ఇప్పటికే వీరు ప్రచారాన్ని ముమ్మరం చేశారు.
తుది జాబితా ప్రకటన నిలిపివేసిన ఎన్నికల సంఘం
నేడు ప్రకటించే అవకాశం
(భీమవరం–ఆంధ్రజ్యోతి)
జిల్లాలో నర్సాపురం మున్సిపాలిటీ, ఆకివీడు నగర పంచాయతీల్లో అభ్య ర్థుల నామినేషన్ ఉపసంహరణ గడువు బుధ వారంతో ముగిసింది. నర్సాపురం మున్సిపాలిటీలోని 36 వార్డుల్లో 91 మంది అభ్యర్థులు మిగిలారు. ఆకివీడులో 28 వార్డులకు 42 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 9 వార్డుల్లో వైసీపీ అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. దాంతో ఆకివీడులో ఎనిమిది వార్డులు ఏకగ్రీవమయ్యాయి. అయితే సుప్రీం కోర్టు ఆదేశాలతో బరిలో ఉన్న అభ్యర్థుల జాబితా, ఏకగ్రీవమైన అభ్యర్థులను ప్రకటించలేదు. గురువారం ప్రకటించే అవకాశం ఉంది. జిల్లా ఎన్నికల సంఘం అధికారులు సమర్పిం చిన నివేదిక తర్వాత ప్రకటన వెలువడనుంది. శాంతి భధ్రతల సమస్య కారణంగా నామినేషన్‌లు వేయ లేకపోయారంటూ వైసీపీ సుప్రీం కోర్టును ఆశ్రయిం చింది. దాంతో సుప్రీం కోర్టు నామినేషన్ల గడుపు పెంచుతూ నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. జిల్లాలో అటువంటి సంఘటనలు లేవు.