కూటమి జోష్
ABN , Publish Date - Nov 16 , 2026 | 12:16 AM
పురపోరులో నామినేషన్ల దాఖలుకు ఒక్కరోజే గడువు ఉంది. జిల్లాలోని నాలుగు మునిసిపాలిటీలకు కూటమి చైర్మన్ అభ్యర్థులను ప్రకటించడంతో జోరుమీదుంది.
నాలుగు మునిసిపాలిటీల్లో చైర్మన్ అభ్యర్థుల ఖరారు
కౌన్సిలర్ అభ్యర్థులపై సర్దుబాట
భీమవరంలో వార్డుల్లో కూడా స్పష్టత
తాడేపల్లిగూడెంలో ఒకటి రెండు వార్డుల్లో తికమక
పాలకొల్లులో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు
తణుకులో నామినేషన్ల తర్వాతే వార్డుల నిర్ణయం
పురపోరులో నామినేషన్ల దాఖలుకు ఒక్కరోజే గడువు ఉంది. జిల్లాలోని నాలుగు మునిసిపాలిటీలకు కూటమి చైర్మన్ అభ్యర్థులను ప్రకటించడంతో జోరుమీదుంది. నాలుగు మున్సిపాలిటీల్లో సర్దుబాటు కొలిక్కి వచ్చింది. తాడేపల్లిగూడెంలో పాలూరి వెంకటేశ్వరరావు (జనసేన)ను మూడు రోజుల ముందుగానే చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించారు. భీమవరంలో జనసేన చైర్పర్సన్ అభ్యర్థిగా డాక్టర్ చుండూరు మల్లీశ్వరి, పాలకొల్లులో టీడీపీ అభ్యర్థిగా ఆబోతుల ఉషారాణి పేర్లను ఖరారు చేశారు. కూటమిలో అన్ని పార్టీలు డాక్టర్ మల్లీశ్వరీ అభ్యర్థిత్వంపై సానుకూలంగా ఉన్నాయి. తణుకులో అనూహ్యంగా బసవ వీవీఎస్ రామకృష్ణ పేరును అధిష్ఠానం ప్రకటించింది. కూటమి శ్రేణులు పుర పోరులో ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు.
(భీమవరం–ఆంధ్రజ్యోతి)
జిల్లాలో పురపోరులో కూటమి శ్రేణులు జోష్తో ఉన్నాయి. నాలుగు మునిసిపాలిటీల్లో చైర్మన్ అభ్యర్థులను అధిష్ఠానం ఖరారు చేసింది. తాడేపల్లిగూడెంలో జనసేన పార్టీ పాలూరి వెంకటేశ్వరరావును మూడు రోజుల ముందుగానే చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించింది. భీమవరంలో జనసేన చైర్పర్సన్ అభ్యర్థిగా డాక్టర్ చుండూరు మల్లీశ్వరి, పాలకొల్లులో టీడీపీ అభ్యర్థిగా ఆబోతుల ఉషారాణి ఖరారు కాగా ఆదివారం రాత్రి తణుకు మునిసిపాలిటీ చైర్మన్ అభ్యర్థిగా బసవా రామకృష్ణ పేరును అధిష్ఠానం ప్రకటించింది. వారంతా సోమవారం నామినేష్ దాఖలు చేయనున్నారు. కౌన్సిలర్ అభ్యర్థుల విషయంలో కూడా కూటమి సర్దుబాటు దిశగా వెళుతోంది. భీమవరం మునిసిపాలిటీలో కౌన్సిలర్ అభ్యర్థు లను తెలుగుదేశం పార్టీ ఖరారు చేయగా జనసేన తర్జన భర్జన పడుతోంది. మంచిరోజుగా భావించి జనసేన తరపున ఆదివారం పలువురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. అధికారికంగా నిర్ణయించిన వారే బరిలో ఉంటారు. తాడేపల్లిగూడెం వార్డుల న్నీ దాదాపు కొలిక్కి రాగా రెండు వార్డుల మఽధ్య రెండు రోజులుగా తర్జనభర్జన పడు తున్నారు. దీనితో సమీకరణలు మారుతూ వస్తున్నాయి. కౌన్సిలర్ టిక్కెట్టు తమకే అంటూ మాట తీసుకున్న వారికి ఇప్పుడు ఇబ్బందు లు ఎదురయ్యే పరిస్థితి నెలకొంది. ఇంకా ఒక్కరోజే గడువు మిగిలిఉంది. నామినేషన్లు వేసిన తర్వాత ఉపసంహరించు కుంటే తమ పరపతికి భంగం కలుగుతుం దంటూ తెలుగు దేశం పార్టీలో కొందరు అభ్యర్థులు మల్లగుల్లాలు పడుతు న్నారు. తెలుగుదేశం, జనసేన పార్టీలో చాలా వరకు సీనియర్లకే అవకాశం కల్పించారు. పాలకొల్లులోనూ కౌన్సిల ర్ అభ్యర్థులపై నిర్ణయం తీసుకున్నారు. తణుకు మున్సిపా లిటీ వార్డులలో కూటమి అభ్యర్థుల ఎంపిక కొలిక్కిరాలేదు. నామినేషన్లు దాఖలు అనంతరం అభ్యర్థులను ఖరారు చేసే దిశగా నాయకులు కృషి చేస్తున్నారు.
ఏకపక్ష విజయమేనంటూ ధీమా
మున్సిపాలిటీల్లో ఏకపక్ష విజయం సాధిస్తామంటూ కూ టమిలో ధీమా ఉంది. అందుకే కౌన్సిలర్ల విషయంలో గట్టి పోటీ నెలకొంది. చైర్మన్ అభ్యర్థుల విషయంలోనూ మల్లగు ల్లాలు పడ్డారు. కౌన్సిలర్ విషయంలో నాలుగు మున్సిపాలి టీల్లోనూ గట్టిపోటీ నెలకొంది. సీనియర్లకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని చోట్ల కూటమి నేతలు అభ్యర్థులుగా ప్రకటించారు. వార్డుల విషయంలోనే కాస్త ఇబ్బందులు ఉండడంతో పార్టీలో టిక్కెట్టు ఆశించిన వారికి చుక్కెదురవు తోంది. గెలుపు ధీమాతోపాటు, ఎన్నాళ్ల నుంచో కౌన్సిలర్ కావాలన్న ఆకాంక్ష నెరవేర్చుకోలేకపోతున్నారు. కూటమిలో పొత్తు వల్ల విజయావకాశాలున్న సమయంలో పోటీకి అవ కాశం లేకుండా పోయిందన్న ఆవేదన కూటమి నాయకుల్లో నెలకొంది. భీమవరంలో జనసేన నుంచి అభ్యర్థులు ఖరారు కాకుండానే నామినేషన్లు వేస్తున్నారు. తాడేపల్లిగూడెంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు రామరాజు, జనసేన అఽధ్యక్షుడు కొటికలపూడి చిన్నబాబులు చర్చలు జరిపారు. కూటమిలో సయోధ్యను దాదాపు ఒక కొలిక్కి తేగలిగారు. కానీ జనరల్ కేటగిరీలో వార్డులపైనే ఆదివారం రాత్రి వరకు చర్చిస్తూనే ఉన్నారు. తణుకులో నామినేషన్ల అనంతరం కొందరు అభ్య ర్థులను ఖరారు చేసేలా ఏర్పాట్లు చేసుకున్నారు. మొత్తం పైన కూటమిలోనే ముందుగానే విజయ దరహాసం తొణిక సలాడుతోంది. కూటమిలో ఐక్యతతో తొలి దశ పురపోరులో ఘన విజయాలను అందుకున్నారు. ఇప్పుడదే పరిస్థితి ఉండాలి. లేదంటే పరిషత్ పోరులో కొన్నిచోట్ల ముఖ్యంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో దెబ్బలు తగిలినట్టే పురుపోరులో పునరావృతమయ్యే అవకాశం ఉంది.