Share News

పురపోరుకు నోటిఫికేషన్‌ జారీ

ABN , Publish Date - Nov 13 , 2026 | 11:54 PM

మునిసిపాలిటీలో ఎన్నికల ప్రక్రియకు తెరలేచింది. రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ ప్రకారం శుక్రవారం మునిసిపల్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేశామని భీమవరం మునిసిపల్‌ కమిషనర్‌ కె.రామచంద్రారెడ్డి తెలిపారు.

పురపోరుకు నోటిఫికేషన్‌ జారీ
భీమవరంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న అధికారులు

భీమవరంటౌన్‌, నవంబరు 13 (ఆంఽధ్రజ్యోతి) : మునిసిపాలిటీలో ఎన్నికల ప్రక్రియకు తెరలేచింది. రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ ప్రకారం శుక్రవారం మునిసిపల్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేశామని భీమవరం మునిసిపల్‌ కమిషనర్‌ కె.రామచంద్రారెడ్డి తెలిపారు. శుక్రవారం మునిసిపల్‌ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చైర్‌పర్సన్‌తో పాటు మొత్తం 52 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. మునిసిపాల్టీతోపాటు విలీనమైన తాడేరు, చిన్న అమిరం, రాయలం, కొవ్వాడ గ్రామాలు ఉన్నాయన్నారు. ఈనెల 14 నుంచి 16 వరకు మూడు రోజులపాటు నామినేషన్లు స్వీకరిస్తామని, ప్రతిరోజూ ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు దాఖలు చేసుకోవచ్చన్నారు. 26న పోలింగ్‌, 30న ఓట్ల లెక్కింపు నిర్వహిస్తామన్నారు. మునిసిపల్‌ స్పెషల్‌ ఆఫీసర్‌, ఆర్డీవో కె.ప్రవీణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేందుకు అందరూ సహకరించాలని కోరారు. పట్టణంలో మొత్తం 157 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. నామినేషన్ల స్వీకరణకు మున్సిపల్‌ కార్యాలయంలో 14 కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. చైర్‌ప ర్సన్‌ అభ్యర్థుల కోసం ప్రత్యేక కౌంటర్‌, 13వార్డులకు సంబంధించి ఒక్కో కౌంటర్‌కు నాలుగు వార్డుల చొప్పున 13 కౌంటర్లు ఏర్పాటు చేశామన్నారు. ప్రతి కౌంటర్‌కు నలుగురు సిబ్బందిని నియమించినట్లు వివరించారు. నామినే షన్లు దాఖలు చేసే అభ్యర్థులకు సహాయం అందిం చేందుకు ప్రత్యేక హెల్ప్‌ డెస్క్‌ కూడా ఏర్పాటు చేశామన్నారు. డీఎస్పీ రఘువీర్‌ విష్ణు మాటా ్లడుతూ నామినేషన్ల సమయంలో పట్టణంలో సెక్షన్‌ 30 అమలు చేస్తున్నట్టు తెలిపారు. తహసీల్దార్‌ రాంబాబు మాట్లాడుతూ పట్టణంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ 144 సెక్షన్‌ అమల్లో ఉంటుందన్నారు.

పాలకొల్లు అర్బన్‌ : పాలకొల్లు మున్సిపల్‌ ఎన్నికలకు శుక్రవారం నోటిఫికేషన్‌ జారీ అయిం దని కమిషనర్‌ దొడ్డా కిరణ్‌ కుమార్‌ తెలిపారు. చైర్మన్‌ అభ్యర్థులు మున్సిపల్‌ కార్యాలయంలోని ఇంజనీరింగ్‌ భవనంలోనూ, 44వార్డుల కౌన్సిలర్‌ అభ్యర్థులు స్త్రీశక్తి మెప్మా భవనంలోనూ నామినేషన్లు దాఖలు చేసుకోవాలని తెలిపారు. 12 టీమలు ఏర్పాటు చేశామన్నారు.

‘పశ్చిమ’లో 4 మునిసిపాల్టీలకు, 90 గ్రామాల ఎన్నికలకు ఏర్పాట్లు

‘పశ్చిమ’ జిల్లా కలెక్టర్‌ నాగరాణి

భీమవరంటౌన్‌ : జిల్లాలో స్థానిక ఎన్ని కల సందడి మొదలుకానుంది. నాలుగు మునిసిపాలిటీలతో పాటు ఐదు మండలా ల్లోని 90 గ్రామ పంచాయతీలకు ఈనెల 26న ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్‌ నాగరాణి తెలిపారు. భీమవరం, పాలకొల్లు, తణుకు, తాడేపల్లి గూడెం మున్సిపాలిటీల్లోని 188 వార్డులకు, నరసాపురం రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని ఐదు మండలాల్లో 90 గ్రామ పంచాయతీ లకు ఒకే రోజు పోలింగ్‌ జరుగు తాయ న్నారు. నాలుగు మున్సిపాలిటీల పరిధిలో 443 పోలింగ్‌ కేంద్రాలు, 3,050 మంది సిబ్బందిని నియమించామన్నారు. 90 పం చాయతీలకు తొలి విడత ఎన్నికలు నరసాపురం, మొగల్తూరు, ఆచంట, పెను మంట్ర, పెనుగొండ మండలాల్లో తొలి విడ తగా 90 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తామన్నారు.

Updated Date - Nov 13 , 2026 | 11:54 PM