Share News

చావలిపాడులో ఎంఎస్‌ఎంఈ పార్కు

ABN , Publish Date - May 25 , 2026 | 12:13 AM

కైకలూరు నియో జకవర్గం మండవల్లి మండలం చావలిపాడులో ఎంఎస్‌ ఎంఈ పార్కును ఏర్పాటు చేస్తున్నారు. ఏపీఐ ఐసీ ఆధ్వర్యంలో రూ.14.80 కోట్లు అంచనా వ్యయంతో ప్లాటెడ్‌ ఫ్యాక్టరీ కాంప్లెక్స్‌ నిర్మాణా నికి సోమవారం ఉదయం 9 గంటలకు ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు వర్చువల్‌గా శంకుస్థాపన చేయనున్నారు.

చావలిపాడులో ఎంఎస్‌ఎంఈ పార్కు
మండవల్లి మండలం చావలిపాడులో ఎంఎస్‌ఎంఈ పార్కుకు శంకుస్థాపన చేయనున్న స్థలం

నేడు సీఎం చంద్రబాబు వర్చువల్‌గా శంకుస్థాపన

స్థానికంగా పారిశ్రామికఅభివృద్ధికి ఊతం

మండవల్లి, మే 24(ఆంధ్రజ్యోతి):రాష్ట్ర వ్యాప్తంగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ లను ప్రోత్సహించి యువతకు పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు ప్రతి అసెంబ్లీ నియోజక వర్గంలో ఒక ఎంఎస్‌ ఎంఈ పార్కు ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. మూడు దశల్లో మొత్తం 175 ఎంఎస్‌ఎంఈ పార్కులను ఏర్పా టు చేయాలని ప్రభుత్వం నిర్ణయించగా తొలి దశలో 55 పార్కులను అభివృద్ధి చేస్తున్నారు. ఇందులో భాగంగా కైకలూరు నియో జకవర్గం మండవల్లి మండలం చావలిపాడులో ఎంఎస్‌ ఎంఈ పార్కును ఏర్పాటు చేస్తున్నారు. ఏపీఐ ఐసీ ఆధ్వర్యంలో రూ.14.80 కోట్లు అంచనా వ్యయంతో ప్లాటెడ్‌ ఫ్యాక్టరీ కాంప్లెక్స్‌ నిర్మాణా నికి సోమవారం ఉదయం 9 గంటలకు ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు వర్చువల్‌గా శంకుస్థాపన చేయనున్నారు. స్థానికంగా ఎమ్మె ల్యే కామినేని శ్రీనివాస్‌, ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ ఇతర నాయకులు పాల్గొంటారు. 2.8 ఎకరాల్లో అభివృద్ధి కానున్న ఈ ప్రాజెక్టు ద్వారా చిన్న పరిశ్రమలకు ఒకే చోట మౌలిక వసతులు కల్పించనున్నారు. తక్కువ పెట్టుబడి తో యువ పారిశ్రామికవేత్తలు పరిశ్రమలు ప్రారంభించే అవకాశాలు లభించనున్నాయి. ఈ పార్కు ద్వారా ఫుడ్‌ ప్రాసెసింగ్‌, ప్యాకేజింగ్‌, చిన్న తరహా తయారీ యూనిట్లు, మహిళా స్వయం ఉపాధి పరిశ్రమలకు ఊతం లభించే అవకాశం ఉంది. స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు రవాణా, గోదా ములు, చిన్న వ్యాపారులకు ప్రోత్సాహం లభిం చనుంది. మండవల్లి–కైకలూరు ప్రాంతం పారి శ్రామికంగా అభివృద్ధి చెందేందుకు ఈ ప్రాజెక్టు కీలకంగా మారనుందని స్థానికులు భావిస్తున్నా రు. చావలిపాడు ఎంఎస్‌ఎంఈ పార్కు త్వరిత గతిన పూర్తయితే కైకలూరు నియోజకవర్గానికి పారిశ్రామిక రంగంలో ప్రత్యేక గుర్తింపు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Updated Date - May 25 , 2026 | 12:13 AM