23 ఎంపీటీసీ స్థానాలు ఇవ్వాల్సిందే!
ABN , Publish Date - Oct 26 , 2026 | 01:07 AM
దెందులూరు నియోజకవర్గంలో కూటమి సీట్ల కేటాయింపుపై జనసేన నాయ కులు, కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేశారు. 75 ఎంపీటీసీ స్థానాలుండగా జనసేనకు కేవలం 11 స్థానాలే కేటాయి స్తా మనడం తగదని నియోజకవర్గ సమన్వయకర్తలు ఘంటసాల వెంకటలక్ష్మీ, కొఠారు ఆదిశేషు, సురేష్ అన్నారు.
అవసరమైతే ఎన్నికల బహిష్కరణ
దెందులూరు నియోజకవర్గ జనసేన నాయకులు, కార్యకర్తల స్పష్టీకరణ
ఏలూరు రూరల్, అక్టోబరు 25(ఆంధ్రజ్యోతి):దెందులూరు నియోజకవర్గంలో కూటమి సీట్ల కేటాయింపుపై జనసేన నాయ కులు, కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేశారు. 75 ఎంపీటీసీ స్థానాలుండగా జనసేనకు కేవలం 11 స్థానాలే కేటాయి స్తా మనడం తగదని నియోజకవర్గ సమన్వయకర్తలు ఘంటసాల వెంకటలక్ష్మీ, కొఠారు ఆదిశేషు, సురేష్ అన్నారు. ఆదివారం ఏలూరులో పార్టీ నాయకులు, కార్యకర్తల అత్యవసర సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో జన సేన తరపున 27 మంది ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్లు దాఖలు చేశారన్నారు. కూటమి సమన్వయ సమావేశంలో అడిగిన స్థానాలకు, ఎమ్మెల్యే చింతమనేని ఇచ్చిన హామీలకు పొంతన లేదన్నారు. పార్టీ అధిష్ఠానం సూచన మేరకే ఆశా వాహులు నామినేషన్లు వేశారని పేర్కొన్నారు. కూటమి ధర్మాన్ని పాటిస్తూ జనసేనకు 23 ఎంపీటీసీ స్థానాలతో పాటు ఒక ఎంపీపీ, ఒక జడ్పీటీసీ స్థానం కేటాయించాలని డిమాండ్ చేశా రు. నామినేషన్లు వేసిన అభ్యర్ధులకు బీఫారాలు ఇవ్వాలన్నారు. సీట్ల పంపకంపై సానుకూల నిర్ణయం తీసుకోకపోతే నామి నేషన్ల ఉపసంహరణకు సిద్ధంగా లేమని, అవసరమైతే ఎన్ని కలను బహిష్కరించే అంశాన్ని పరిశీలిస్తామని స్పష్టం చేశారు.