Share News

నేడు ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ ఎన్నిక

ABN , Publish Date - Nov 19 , 2026 | 12:00 AM

రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన నోటిఫికేషన్ల ప్రకారం గురువారం జిల్లాలోని 27 మండల ప్రజా పరిషత్‌లలో కో ఆప్టెడ్‌ సభ్యుల ఎన్నికతో పాటు ఎంపీపీ అధ్యక్ష, ఉపాఽధ్యక్ష పదవులకు పరోక్ష ఎన్నికలు నిర్వహించ నున్నారు. జిల్లాలోని మండల ప్రజా పరిషత్‌ కార్యాలయాల్లో ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేశారు.

 నేడు ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ ఎన్నిక

(ఏలూరుసిటీ–ఆంధ్రజ్యోతి)

రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన నోటిఫికేషన్ల ప్రకారం గురువారం జిల్లాలోని 27 మండల ప్రజా పరిషత్‌లలో కో ఆప్టెడ్‌ సభ్యుల ఎన్నికతో పాటు ఎంపీపీ అధ్యక్ష, ఉపాఽధ్యక్ష పదవులకు పరోక్ష ఎన్నికలు నిర్వహించ నున్నారు. జిల్లాలోని మండల ప్రజా పరిషత్‌ కార్యాలయాల్లో ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేశారు.

ఎన్నికైన ఎంపీటీసీ సభ్యు లు తమలో ఒకరిని మండల పరిషత్‌ అధ్య క్షుడిగా, మరొకరిని ఉపాధ్యక్షుడిగా ఎన్ను కుంటారు. ప్రతి మం డల ప్రజాపరిషత్‌లో ఒక కో ఆప్టెడ్‌ సభ్యుడిని ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఈ ఎన్నికలను చేతులు పైకెత్తి ఓటు వేసే విధానంలో నిర్వహిస్తారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులకు జారీ చేసే పార్టీ విప్‌ను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. కో అప్టెడ్‌ సభ్యుల ఎన్నికల విషయంలో పార్టీ విప్‌ వర్తించదు.సంబంఽధిత మండల ప్రజా పరిషత్‌లకు ఎక్స్‌ అఫీషియా సభ్యులుగా ఉన్న ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రత్యేక సమావేశాలకు హాజరయ్యేందుకు ఆహ్వానించబడతారని, అయితే ఈ పరోక్ష ఎన్నికలలో వారికి ఓటు వేసే హక్కు మాత్రం ఉండదు. జిల్లాలో ఉన్న 27 ఎంపీపీలలో 24 కూటమి అభ్యర్థులకే దక్కనున్నాయి. మెజార్టీ ఎంపీటీసీల ఆధారంగా ఈ విధంగా కూటమి అత్యధిక స్థానాలను దక్కించుకోనుంది. మూడు ఎంపీపీలు వైసీపీకి దక్కనున్నాయి.

పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి : కలెక్టర్‌

జిల్లాలో జిల్లా పరిషత్‌లు, మండల పరిషత్‌ల పరోక్ష ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ వెట్రిసెల్వి అఽధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌ నుంచి జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌ అధ్యక్షులు, ఉపాఽధ్యక్షులు , కో ఆప్టెడ్‌ సభ్యులు ఎంపికకు పరోక్ష ఎన్నికలు, గ్రామ పంచా యతీ ఎన్నికల సన్నద్ధతపై ఆర్వోలు, సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్‌ జూమ్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షిం చారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ఈనెల 19న మండల పరిషత్‌ అధ్యక్ష, ఉపాఽధ్యక్ష, కో అప్టెడ్‌ సభ్యులు, 20న జిల్లా పరిషత్‌ అధ్యక్ష, ఉపాఽధ్యక్ష, కో అప్టెడ్‌ సభ్యుల ఎంపికకు నిర్వహించే పరోక్ష ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో , పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సంబంధిత

ఆర్వో ఈ పరోక్ష ఎన్నికకు ప్రిసైడింగ్‌ అధికారిగా వ్యవహరిస్తారన్నారు. ఎక్కడా అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా పటిష్ఠ పోలీస్‌ బందోబస్తు ఏర్పాట్లు చేయాలన్నారు. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఓటర్లకు ఓటర్‌ స్లిప్‌లు పంపిణీ చేయాలని, పోటీలో పాల్గొనే అభ్యర్థులతో సమావేశం నిర్వహించి ఎన్నికల ప్రవర్తనా నియమావళిపై అవగాహన కల్పించాలన్నారు. జేఈ అభిషేకగౌడతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.

మండల ప్రజా పరిషత్‌ కోఅప్టెడ్‌ సభ్యుడు, అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడి ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ షెడ్యూ లు ప్రకటించింది.

కో ఆప్టెడ్‌ సభ్యునికి నామినేషన్ల స్వీకరణ : ఉదయం 10 గంటల లోపు

నామినేషన్ల పరిశీలన: 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల లోపు

అభ్యర్థుల జాబితా: మధ్యాహ్నం 12 గంటలకు..

ఉపసంహరణ: మధ్యాహ్నం ఒంటి గంటలోపు..

కోఆప్టెడ్‌ సభ్యుడి ఎన్నికకు ప్రత్యేక సమావేశం : మధ్యాహ్నం ఒంటిగంటకు..

ఫలితాలు వెల్లడి: మధ్యాహ్నం ఒంటిగంట తర్వాత..

ఎంపీపీ, ఉపాఽధ్యక్షుడి ఎన్నిక : మధ్యాహ్నం 3గంటలకు నిర్వహించే ప్రత్యేక సమావేశంలో.

పల్లెపోరు.. రెండో విడతకు నామినేషన్ల స్వీకరణ

పల్లెపోరులో భాగంగా పంచాయతీ ఎన్నికల రెండో విడతకు సంబం ధించి బుధవారం జిల్లాలో రిట ర్నింగ్‌ అధికారి నోటిఫికేషన్‌ జారీ చేయగా నామినేషన్ల పర్వం ప్రారం భమైంది. జిల్లాలోని భీమడోలు, కైకలూరు, కలిదిండి, మండవల్లి, ముదినేపల్లి, నిడమర్రు, ఉంగు టూరు, ద్వారకాతిరుమల మండలా ల్లోని 194 పంచాయతీ సర్పంచ్‌లు, 1,972 వార్డు సభ్యులకు నామినేష న్లను స్వీకరిస్తున్నారు. 20వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ, 29న పోలింగ్‌ జరగనుంది. రెండో విడతకు సంబంధించి తొలిరోజు బుధవారం జిల్లాలోని 8 మండలాల్లోని 177 పంచాయతీ సర్పంచ్‌లకు, 1,896 వార్డు మెంబర్ల పదవులకు సంబంధించి 506 నామినేషన్లు దాఖలు కాగా ఇందులో సర్పంచ్‌ పదవులకు 138, వార్డు సభ్యు లకు 368 నామినేషన్లు దాఖలయ్యాయి.

మొదటి విడత.. 961 సర్పంచ్‌ నామినేషన్లు సక్రమం

మొదటి విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సర్పంచ్‌ పదవులకు 997 నామినేషన్లు దాఖలు కాగా ఇందులో పరిశీలన అనంతరం 961 నామినేషన్లు సక్రమమని తేల్చారు. వార్డు సభ్యుల పదవులకు 5,154 నామినేషన్లు దాఖలు కాగా ఇందులో పరిశీలన అనంతరం 5,114 నామినేషన్లు సక్రమంగా ఉన్నాయని తేల్చారు.

Updated Date - Nov 19 , 2026 | 12:00 AM