Share News

క్లారిటీ ఏదీ?

ABN , Publish Date - Jun 26 , 2026 | 12:58 AM

ఏలూరు పార్లమెంట్‌ నియోజకవర్గ నిధుల విని యోగంలో మంద గమనంలోనే అభివృద్ధి పనులు సాగుతున్నాయి. ఈ పనులకు ఆది నుంచి తడబాటే ఎదురవు తోంది. పర్యవేక్షణ లోపించడంతో ముందుకు సాగడం లేదు. రెండే ళ్లలో కేటాయించిన నిధుల్లో ఇంకా సగానికి పైగా నిధులకు సంబం ధించి పనులపై కదలిక లేదు.

క్లారిటీ ఏదీ?
కలెక్టరేట్‌ ప్రాంగణంలో ఎంపీ నిధులతో చేపట్టిన టాయిలెట్లు

సాగుతున్న.. ఎంపీ ల్యాడ్స్‌ పనులు

ఆదినుంచి పనుల్లో తడబాటే

రూ.9.80 కోట్లు నిధులు మంజూరు.. పూర్తి చేసింది రూ.5 కోట్ల విలువైన పనులు

15 పనుల విషయంలో క్లారిటీ లేదంటూ ఎంపీ పుట్టా ప్రశ్నతో అధికారుల్లో అలజడి

(ఏలూరు–ఆంధ్రజ్యోతి)

ఏలూరు పార్లమెంట్‌ నియోజకవర్గ నిధుల విని యోగంలో మంద గమనంలోనే అభివృద్ధి పనులు సాగుతున్నాయి. ఈ పనులకు ఆది నుంచి తడబాటే ఎదురవు తోంది. పర్యవేక్షణ లోపించడంతో ముందుకు సాగడం లేదు. రెండే ళ్లలో కేటాయించిన నిధుల్లో ఇంకా సగానికి పైగా నిధులకు సంబం ధించి పనులపై కదలిక లేదు.

ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్‌కు ఏటా ఎంపీ ల్యాడ్స్‌ కింద రూ.4.90 కోట్ల నిధు లను కేంద్రం మంజూరు చేస్తోంది. దీనికి తగ్గట్టుగానే ఏటా ప్రజల, వివిధ సంఘా లు స్వచ్ఛంద సంస్థలు, సామాజిక కుల సంఘ సభ్యులు, శ్మశాన వాటికలకు విన తులు, వారి కోరికల మేరకు ప్రతిపాదన లు సిద్ధం చేసి కలెక్టర్‌ ఆన్‌లైన్‌లో నివేది స్తారు. ఆ మేరకు వివిధ ఇంజనీరింగ్‌ శాఖల ఆయా పనులకు అంచనాలు రూపొందించి, టెండర్లు పిలుస్తాయి. ఈ నేపథ్యంలో పర్యవేక్షణ కీలకంగా మారు తుంది. ప్రధానంగా పనులు చేపట్టే వివిధ ఇంజనీరింగ్‌ శాఖల పర్యవేక్షణ తీసికట్టుగా ఉందన్న విమర్శలు లేకపోలేదు. ఎంపీ ల్యాడ్స్‌ నిధుల ఖర్చు, పనులు వ్యవహారా లను క్షేత్ర స్థాయిలో ఎవరు పర్యవేక్షిస్తుం దీ అంతా అయోమయమే. దీంతో పలు పనులు ప్రారంభానికి నోచుకోకపోవడంపై పనుల్లో క్లారిటీ లేకపోతే ఎలా అంటూ బుధవారం జరిగిన దిశ సమావేశంలో ఎంపీ ప్రణాళికశాఖ అధికారులు ప్రశ్నిం చడం అలజడి రేపుతోంది. ఈ పనులు బిల్లుల చెల్లింపులు ఎంపీ సిఫార్సులకు అనుగుణంగానే కలెక్టర్‌ బిల్లుల మంజూ రుకు ఆదేశాలిస్తారు. సాక్షాత్తు కలెక్టర్‌ ఎదుటే పనుల విషయంలో క్లారిటీ లేదని ఎంపీ ప్రశ్నించడం చర్చకు దారితీసింది.

ఖర్చు అంతంతే..

రెండేళ్లలో ఎంపీ ల్యాడ్స్‌ కింద రూ.9.80 కోట్ల నిధులు మంజూరు చేయగా.. ఇందు లో కేవలం రూ.5 కోట్ల పనులే పూర్తి చేశారు. అయితే మిగిలిన పనుల్లో టెండ ర్లు దశ దాటనివే ఎక్కువగా ఉన్నాయి. 2024–25లో మంజూరు చేసిన వాటిల్లోను కొన్ని పనులు టెండర్లు పూర్తి కాలేదని స మాచారం.. ప్రధానంగా కలెక్టరేట్‌లో వివి ధ టాయిలెట్లు పునరుద్ధరణకు రూ.4.90 లక్షలతో ప్రజారోగ్యశాఖ పనులను చేప ట్టింది. ఇది కూడా బినామీ పేర్లతో జరిగిన ట్టు ఆరోపణలున్నాయి. దేవదాయశాఖ నుంచి అనుమతులు ఆలస్యం వల్ల అప్ప నవీడు అభయాంజనేయస్వామి ఆలయా నికి కమ్యూనిటీ హాల్‌ కింద రూ.40 లక్షలు మంజూరు చేయగా ఇప్పటికీ టెండర్ల దశకు వచ్చింది. పంచాయతీరాజ్‌ శాఖ ఈ పనులను పర్యవేక్షించ నుంది. లింగపాలెం మండలం కొత్తపల్లిలో 2024– 25 కింద రూ.10లక్షల వ్యయంతో చేపట్టిన మల్టీపర్పస్‌ హాల్‌ ఇప్పటికి పూర్తి కాలేదు. దాదాపు రూ.కోటిలోపే నామినేషన్ల పను లు అప్పగించడంపైన చర్చ సాగుతోంది. గోపన్నపాలెం పీఈటీ కళాశాలలో బాలి కల వసతిగృహం నిర్మాణం పనులు 2025 లో రూ.25 లక్షలతో టెండర్లు పిలవగా ఇటీవల పనులు ప్రారంభం అయ్యాయి.

సందట్లో సడేమియాగా

నామినేషన్‌ పనులు

జిల్లాలో పలు నియోజకవర్గాల్లో పేద లకు అవసర పడే సామాజిక భవనాలు, స్కూల్స్‌కు ప్రహారీలు, ఇతర పనులు దాదాపుగా పలువురు నేతల అనుచరులే చేస్తున్నట్లు విమర్శలున్నాయి. కొన్ని ప్రత్యేకించి సందట్లో సడేమియాగా రూ.5 లక్షల లోపు పనులు కూడా నామినేషన్‌ పైనే చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఈ రకంగా చింతలపూడి నియోజకవర్గంలో సింహభాగం పనులను కొందరు కాంట్రాక్టర్ల అవతారం ఎత్తి చేస్తున్నారని చెబుతున్నారు. ఈ ఆర్థిక సంవత్సరానికి ఇంకా మంజూరులు ఏమీ ఇవ్వలేదని సమాచారం. గత రెండేళ్లలో కావాల్సిన పనులు పూర్తి ఎప్పుడు చేస్తారన్నది ప్రశ్నగా మారింది.

పర్యవేక్షణ చేయాల్సింది ఎవరు.. ?

ఎంపీ ల్యాడ్స్‌ వినియోగంలో పర్యవేక్షణ చేయడంలో తడబాటే నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులకు ఆటంకంగా పరిణమిస్తోంది. ఈ నిధుల వినియోగంపై దిశ సమావేశంలో తప్ప ఎక్కడా కూడా చర్చ సాగడం లేదు. ఎమ్మెల్యేలతో కలిసి నియోజకవర్గాల్లో ఈ పనులు పరిశీలన చేయాల్సిన ఎంపీకి తీరిక ఉందా? అన్న ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. రెండు రోజుల సుడిగాలి పర్యటన వల్ల కూడా పనులు పర్యవేక్షణ పూర్తిగా చేయలేకపోతు న్నారన్న విమర్శలు లేకపోలేదు. ఎంపీ కూడా సివిల్‌ ఇంజనీర్‌ కావడం వల్ల లోపాలను పసిగట్టాల్సి ఉండగా, ఎందుకు ప్రాధాన్యతల వారీగా పనులు ముందుకు సాగడం లేదన్న ప్రశ్న తలెత్తుతోంది. రైల్వేస్టేషన్‌ ఆధునికీకరణపై ఇప్పటికీ రెండుసార్లు ఆయా సంస్థలపై నిగ్గుతీసి ప్రశ్నల వర్షం కురిపించి ఎంపీ.. తన నిధులతో జరిగే పనులు విషయంలో అదే ఒరవడి చూపకపోతే ప్రజలకు సాధ్యమైనంత అభివృద్ధి కానరాదని అవగతం అవుతోంది. ఎమ్మెల్యేల సహకారం పనులు విషయంలో ఉందా? వారు వెంటాడుతున్నారా?అంటే లేదనే తెలుస్తోంది.

Updated Date - Jun 26 , 2026 | 12:58 AM