ఓట్ చోరీ పేరుతో ఇండీ కూటమి అసత్య ప్రచారం
ABN , Publish Date - Sep 30 , 2026 | 12:56 AM
వరుస ఎన్నికల పరాజ యాలతో రాజకీయ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఇండీ కూటమి నేతలు ఎన్నికల సంఘంపై ‘ఓట్ చోరీ’ పేరుతో అసత్య ప్రచారం చేస్తున్నారని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ఆరోపించారు.
ఓట్ చోరీ పేరుతో ఇండీ కూటమి అసత్య ప్రచారం
కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ
భీమవరం టౌన్, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): వరుస ఎన్నికల పరాజ యాలతో రాజకీయ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఇండీ కూటమి నేతలు ఎన్నికల సంఘంపై ‘ఓట్ చోరీ’ పేరుతో అసత్య ప్రచారం చేస్తున్నారని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ఆరోపించారు. ఎన్నికల సంఘంపై నిరాధార ఆరోపణలు చేస్తూ ప్రజల్లో అపోహలు సృష్టించడం మానుకోవాలని, రాజ్యాంగ సంస్థల ప్రతి ష్టను దెబ్బతీసేలా వ్యవహరించిన రాహుల్ గాంధీ దేశ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. భీమవరంలోని బీజేపీ కార్యాల యంలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దేశవ్యాప్తంగా 13 కోట్ల ఓట్లు ఉద్దేశపూర్వకంగా తొలగించారంటూ కాంగ్రెస్, ఇండీ కూటమి చేస్తున్న ఆరోపణలు అవాస్తమని కొట్టిపారేశారు. ముసాయి దా ఓటర్ల జాబితాలో 2.8 కోట్లమంది మృతులు, 3 కోట్ల మంది ఆచూకీ లేని వారు, 6.3 కోట్లమంది ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారు ఉన్నారని తెలిపారు. ఒకే వ్యక్తికి రెండు లేదా అంతకంటే ఎక్కువ ప్రాంతాల్లో ఓట్లు ఉన్న కోటి మందికిపైగా డూప్లికేట్ ఓటర్లు ఉన్నట్లు గుర్తించారని చెప్పారు. ముసాయిదాపై అభ్యంతరాలు ఉంటే ఫారం–6 ద్వారా దరఖాస్తు చేసుకునే పారదర్శక అవకాశం ఉందని తెలిపారు. 1952 నుంచి దేశంలో ఓటర్ల జాబి తా సవరణ ప్రక్రియ అనేకసార్లు జరిగిందని, ఆ సమయంలో ఏడుసార్లు కాంగ్రెస్, ఆ పార్టీ కూటమి అధికారంలో ఉన్న విషయాన్ని గుర్తుచేశారు. ఎన్నికల సంఘం నిర్ణయాలు ముగ్గురు కమిషనర్ల ఏకగ్రీవ ఆమోదంతోనే జరుగుతున్నాయని శ్రీనివాస వర్మ అన్నారు. కొత్త ఓటర్ల నమోదు కోసం ఉపయోగించే ఫారం–6 మార్పులు చేశారంటూ కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని శ్రీనివాస వర్మ అన్నారు. ఉమ్మడి లక్ష్యం లేని ఇండీ కూటమి చెల్లాచెదురైందని, ఆ కూటమికి దేశంలో భవిష్యత్తు లేదని ఎద్దేవా చేశారు. పారదర్శక ప్రజాస్వామ్య ఎన్నికల ప్రక్రియపై బురదజల్ల డం మానుకుని, ప్రతిపక్షాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూ చించారు. విలేకరుల సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సుభాష్ రాజు, కాయిత సురేంద్ర, జిల్లా ప్రధాన కార్యదర్శి తోట గంగరాజు, వబిలిశెట్టి ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.