Share News

శేషాచలాన్ని, సుందరగిరిని ఇంటర్‌లింక్‌ చేసి అభివృద్ధి చేస్తాం

ABN , Publish Date - Jun 24 , 2026 | 12:10 AM

శ్రీవారి శేషాచలాన్ని, సుందరగిరి నారసింహుని క్షేత్రాన్ని ఇంటర్‌లింక్‌ చేసి 22 కిలోమీటర్ల మేర రూ.30 కోట్లతో డబుల్‌ రోడ్డును నిర్మించి అభివృద్ధి చేసేలా ప్రణా ళికలు రూపొందిస్తున్నట్టు రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుపాటి పురందేశ్వరి, ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట్రాజు తెలిపారు.

శేషాచలాన్ని, సుందరగిరిని  ఇంటర్‌లింక్‌ చేసి అభివృద్ధి చేస్తాం
సమావేశంలో ఎంపీ పురందేశ్వరి, ఎమ్మెల్యే వెంకట్రాజు, చైర్మన్‌ సుధాకరరావు

రాజమహేంద్రవరం ఎంపీ పురందేశ్వరి, ఎమ్మెల్యే వెంకట్రాజు

ద్వారకాతిరుమల, జూన్‌ 23(ఆంధ్రజ్యోతి): శ్రీవారి శేషాచలాన్ని, సుందరగిరి నారసింహుని క్షేత్రాన్ని ఇంటర్‌లింక్‌ చేసి 22 కిలోమీటర్ల మేర రూ.30 కోట్లతో డబుల్‌ రోడ్డును నిర్మించి అభివృద్ధి చేసేలా ప్రణా ళికలు రూపొందిస్తున్నట్టు రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుపాటి పురందేశ్వరి, ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట్రాజు తెలిపారు. చినవెంకన్న ఆలయాన్ని దర్శించిన అనంతరం రాజా ఎస్వీ సుధాకరరావు అధ్యక్షతన నూతన ట్రస్ట్‌బోర్డు సమావేశం నిర్వహించి, సంబంధిత వివరాలను విలేకర్లకు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నూతనంగా ఏర్పాటు చేసిన మొదటి ట్రస్ట్‌ బోర్డు సమావేశంలో భక్తుల సౌకర్యాల కల్పనపైనా, ఆలయ అభివృద్ధిపై బోర్డు సభ్యులతో చర్చించామన్నారు. ఇప్పటికే శ్రీవారి క్షేత్రం అభివృద్ధి చెందిందని, రానున్న రోజుల్లో మరింత అభివృద్ధికి ప్రణాళికలు చేస్తున్నామన్నారు. గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట్రాజు మాట్లాడుతూ శ్రీవారి క్షేత్రాన్ని.. ఐఎస్‌ జగన్నాథ పురంలోని లక్ష్మీ నారసింహుని క్షేత్రాన్ని కలిపేలా చూస్తున్నామన్నారు. ద్వారకాతిరుమలకు వచ్చే భక్తులు ఈ రెండు క్షేత్రాల్లో ఎక్కడో ఒకచోట ఒకరోజు ఉండేలా సౌకర్యాల కల్పనవైపు దృష్టి పెడుతున్నామన్నారు. ఈవో వి.త్రినాథరావు, ట్రస్ట్‌బోర్డు సభ్యులు పాల్గొన్నారు.

శేషాచలంపై విద్యుత్‌ సబ్‌స్టేషన్‌కు శంకుస్థాపన

శ్రీవారి శేషాచల కొండపై భక్తుల సౌకర్యార్థం రూ.3.50 కోట్లతో నిర్మిం చనున్న 33–11కేవీ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ నిర్మాణానికి ఎంపీ పురందేశ్వరి, స్థానిక ఎమ్మెల్యే వెంకట్రాజు మంగళవారం శంకుస్థాపన చేశారు. తొలుత వారు ఆలయానికి వెళ్లి స్వామి, అమ్మవార్లను దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఆలయ అనువంశిక ధర్మకర్త ఎస్వీ నివృతరావు, ఈవో వి.త్రినాథరావు స్వామివారి చిత్రపటాన్ని ప్రసాదా లను అందజేశా రు. ఏపీఈపీడీసీఎల్‌ చైర్మన్‌, సీఎండీ ఇమ్మడి పృధ్వీతేజ్‌ పాల్గొన్నారు.

Updated Date - Jun 24 , 2026 | 12:10 AM