నిష్కళంకంగా బయటకు వస్తా..
ABN , Publish Date - Apr 19 , 2026 | 11:59 PM
‘హైదరాబాద్ డ్రగ్స్ కేసుతో నాకు ఎటువంటి సంబంధం లేదు. నేను ఏ తప్పు చేయలేదు. నిష్కళంకంగా కేసు నుంచి బయటకు వస్తాను. నియోజకవర్గ ప్రజల అభిమానాన్ని మరచిపోలేను. నాపై వచ్చిన ఆరోపణలను ప్రజలు నమ్మకపోగా నాపై ఎంతో అభిమానం చూపుతున్నా’రని ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్‌కుమార్ యాదవ్ అన్నారు.
డ్రగ్స్ కేసుతో సంబంధం లేదు..
నేను ఏ తప్పూ చేయలేదు 8 ఎంపీ పుట్టా మహేశ్
ఏలూరు టూటౌన్, ఏప్రిల్ 19 (ఆంధ్రజ్యోతి): ‘హైదరాబాద్ డ్రగ్స్ కేసుతో నాకు ఎటువంటి సంబంధం లేదు. నేను ఏ తప్పు చేయలేదు. నిష్కళంకంగా కేసు నుంచి బయటకు వస్తాను. నియోజకవర్గ ప్రజల అభిమానాన్ని మరచిపోలేను. నాపై వచ్చిన ఆరోపణలను ప్రజలు నమ్మకపోగా నాపై ఎంతో అభిమానం చూపుతున్నా’రని ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్‌కుమార్ యాదవ్ అన్నారు. హైదరాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్నాక తొలిసారిగా ఆదివారం ఏలూరుకు వచ్చిన ఆయనకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. గన్నవరం విమానాశ్రయం నుంచి కార్లు, బైక్‌లతో భారీ ర్యాలీగా ఏలూరుకు చేరుకు న్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ ‘డ్రగ్స్ కేసులో పట్టుబడిన వ్యక్తులతో నాకు సంబంధం లేదు. ఈ విషయం కేసు విచారణలో కూడా తేలింది. నేను ఏ తప్పు చెయ్యలేదని నన్ను గెలిపించిన ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంది. ఏ తప్పు చెయ్యకపోయినా మీడియా లో వచ్చిన కథనాల పై తీవ్ర మనస్తాపానికి గురయ్యాను. కష్టసమయంలో ఏలూరు జిల్లా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అండగా నిలిచార’ంటూ కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యేలు బడేటి చంటి, చింతమనేని ప్రభాకర్, పత్సమట్ల ధర్మరాజు, సొంగా రోషన్‌కుమార్, ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనే యులు, మాజీ ఎమ్మెల్యే గంటా మురళీకృష్ణ, ట్రైకార్ చైర్మన్ బొరగం శ్రీనివాసులు ఎంపీ కార్యాలయానికి వెళ్లి మహేశ్‌కు సంఘీభావం తెలిపా రు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిస్వార్థ యువ నాయకుడు ఎంపీ పుట్టా మహేశ్‌పై ఆరోపణలు రావడం విచారకరమ న్నారు. రాజకీయాల్లో ఇలాంటివి సహజమని, ప్రజల ఆశీస్సులతో నిర్దోషిగా బయటకు వస్తారన్నారు.