Share News

బైక్‌ మెకానిక్‌నే.. దొంగ!

ABN , Publish Date - Jan 10 , 2026 | 12:20 AM

బైక్‌ మెకానిక్‌గా వృత్తిని కొనసాగిస్తూ ప్రవృ త్తిగా బైక్‌లను తస్కరిస్తూ వాటిని విక్రయిం చడానికి తనకొక సహాయకారిని కూడా పెట్టు కుని నాలుగు సంవత్సరాలుగా బైక్‌ దొంగత నాలు చేస్తూ, వాటిని విక్రయిస్తూ చివరకు పోలీసులకు చిక్కాడు.

బైక్‌ మెకానిక్‌నే.. దొంగ!
పోలీసులు స్వాధీనం చేసుకున్న మోటార్‌ సైకిళ్లను పరిశీలిస్తున్న ఎస్పీ కేపీఎస్‌ కిశోర్‌

నాలుగేళ్లుగా అపహరించిన 50 మోటార్‌ సైకిళ్లు స్వాధీనం.. బైక్‌లు కొనుగోలు చేసిన 14 మందిపై కేసు

ఏలూరు క్రైం, జనవరి 9(ఆంధ్రజ్యోతి): బైక్‌ మెకానిక్‌గా వృత్తిని కొనసాగిస్తూ ప్రవృ త్తిగా బైక్‌లను తస్కరిస్తూ వాటిని విక్రయిం చడానికి తనకొక సహాయకారిని కూడా పెట్టు కుని నాలుగు సంవత్సరాలుగా బైక్‌ దొంగత నాలు చేస్తూ, వాటిని విక్రయిస్తూ చివరకు పోలీసులకు చిక్కాడు. దీంతో పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయడంతో నాలు గేళ్ళల్లో 50 బైక్‌లను అపహరించడంతో అతని వద్ద కొనుగోలు చేసిన 14 మంది నుంచి వాటి ని రికవరీ చేశారు. వీటి విలువ సుమారు 20 లక్షలు ఉంటుందని ఎస్పీ కేపీఎస్‌ కిశోర్‌ చెప్పారు. ఏలూరు జిల్లా పోలీస్‌ కార్యాలయం వద్ద శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ ఈ నేరస్తుల వివరాలను వెల్లడించారు. ఏలూరు తూర్పువీధి గౌరమ్మ గుడి ప్రాంతంలో నివాసం ఉండే బైక్‌ మెకానిక్‌ మహ్మద్‌ షాకీర్‌ కొద్ది కాలం నుంచి తన అత్తగారి ఊరు అయిన ద్వారకాతిరు మల మండలం గుండుగొలను గుంటలో ఉంటున్నాడు. నాలు గేళ్ళుగా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో మోటారు సైకిళ్ళను అపహరించి తీసుకువెళ్ళి వాటిని తక్కువ ధరకు విక్రయిస్తున్నాడు. తాను చోరీ చేసిన మోటారు సైకిళ్ళను విక్రయించడానికి ఏలూరు సుంకరవారి తోట కనకదుర్గమ్మ టెంపుల్‌ ఎదురుగా నివాసం ఉండే ఏలూరు గోద్రోజ్‌ కంపెనీ సేల్స్‌మాన్‌గా పనిచేస్తున్న గోపిశెట్టి సురేష్‌ (27)ను తనకు సహాయకారి గా పెట్టుకున్నాడు. దీంతో అతను తస్కరించిన మోటారు సైకిళ్ళను సురేష్‌ టి.నర్సాపురం మండలం వీరభద్రపురానికి చెందిన దూది పాల శ్రీను, మద్దాల మహేష్‌, మానికల జానకిరామ్‌, నయనవరపు శేషు, మారుతి వెంకటేశ్వరరావు, బొట్ల పవన్‌ కుమార్‌, కె వెంకట శేషు, గుడిదల నాగరాజు, గుడిదల అజైయ్‌, వెలగపాడు గ్రామానికి జాజుల నరేష్‌, వరదల సతీష్‌, శెట్టి త్రిమూ ర్తులు, బొమ్మసాని సూరిబాబు, జంగారెడి ్డగూడెం ఒక ప్రైవేటు స్కూల్లో పీఈటీగా పని చేస్తున్న కండ్రపు గంగామహేశ్వర మహేష్‌లు ఈ దొంగ మోటారు సైకిళ్ళను కొనుగోలు చేశారు. వీరి వద్ద నుంచి మోటారు సైకిల్‌ ను రికవరీ చేశారు. ఈ 14 మందిపై కూడా కేసు నమోదు చేశారు.

దొంగ దొరికిందిలా..

గత ఏడాది డిసెంబర్‌ 1వ తేదీన ఏలూరు సమీపంలోని దుగ్గిరాల గ్రామ ంలోని జోసఫ్‌ నగర్‌లో ఒక ఇంటి తాళాలు పగులగొట్టి హీరో ఫ్యాషన్‌ ప్రో మోటారు సైకిల్‌, ఒక సెల్‌ఫోన్‌ అపహరించాడు. దీంతో కొరగంటి ప్రభాకర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న సీసీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. షాకీర్‌ను గుర్తించి అతనిని అరెస్టు చేశారు. ఏలూరు, జంగారెడ్డిగూడెం, బుట్టాయిగూడెం, భీమడోలు, గణపవరం, దెందులూరు, నిడమర్రు, నల్లజర్ల, పెదపాడు, చేబ్రోలు, నూజివీడు, తాడేపల్లిగూడెం, తడికల పూడిలలో కేసులు నమోదు అయ్యాయని ఆ కేసులకు సంబం ధించి 38 మోటారు సైకిళ్ళు స్వాధీనం చేసుకున్నామన్నారు. వాటితోపాటు ఇంకా గుర్తించని మరో 12 మోటారు సైకిళ్ళు స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు.

Updated Date - Jan 10 , 2026 | 12:20 AM