Share News

పనులు మీకేనా.. మాకు లేవా..?

ABN , Publish Date - Mar 10 , 2026 | 12:09 AM

అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నాం. పార్టీలు పక్కన పెట్టి అందరికీ సంక్షేమం అందిస్తున్నాం..

పనులు మీకేనా..  మాకు లేవా..?
రోడ్డు పనులకు శంకుస్థాపనలో నాయకర్‌, పొత్తూరి

నవరసపురం గ్రామస్థులపై నాయకర్‌ అసహనం

నరసాపురం రూరల్‌, మార్చి 9(ఆంధ్రజ్యోతి): ‘‘అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నాం. పార్టీలు పక్కన పెట్టి అందరికీ సంక్షేమం అందిస్తున్నాం..రోడ్డు పోయి పదేళ్లయింది. ఎన్నికల్లో హామీ ఇచ్చాం.మీ ఇబ్బందులు గుర్తించి రూ.2.60 కోట్లు మంజూరు చేయించాం. శంకుస్థాపన చేసేందుకు వస్తే మాకు పనులు ఉన్నాయంటూ తప్పించుకోవడం సరికాదు. చాలామంది జగన్‌ మాయలోనే ఉన్నారు.. అందులోంచి బయటకు రండి..’’ అంటూ నరసాపురం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ నాయకర్‌ అసహనం వ్యక్తం చేశారు. సోమవారం నవరసపురం నుంచి మేడ పాడు రోడ్డును కలుపుతూ నిర్మిస్తున్న అర్‌అండ్‌బీ రోడ్డు శంకుస్థాపనకు గ్రామానికి వెళ్లారు. అక్కడ కూటమిలో రెండు వర్గాలుగా ఏర్పడి చాలామంది రాలేదు. దీంతో నాయకర్‌ పార్టీ శ్రేణులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్‌ఛార్జి రామరాజు, కొల్లు పెద్దిరాజు, ఏఎంసీ చైర్మన్‌ జక్కం శ్రీమ న్నారాయణ, వాతాడి ఉమ, కొప్పాడ రవి, డాక్టర్‌ గణేశ్‌, దొండపాటి స్వామి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 10 , 2026 | 12:09 AM