Share News

రైతుల సంక్షేమానికి కూటమి అధిక ప్రాధాన్యం

ABN , Publish Date - Mar 14 , 2026 | 12:29 AM

రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తుందని ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు అన్నారు.

రైతుల సంక్షేమానికి కూటమి అధిక ప్రాధాన్యం
చేబ్రోలు సొసైటీ వద్ద అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్‌ నిధుల చెక్కు అందిస్తున్న ఎమ్మెల్యే పత్సమట్ల, ఆప్కాబ్‌ చైర్మన్‌ గన్ని..

నిడమర్రు, మార్చి 13(ఆంధ్రజ్యోతి) : రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తుందని ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు అన్నారు. శుక్రవారం నారాయణపురం సొసైటీ ఆవరణలో అన్నదాత సుఖీభవ– పీఎం కిసాన్‌ రైతులకు పెట్టుబడి సాయం 3వ విడత నిధుల విడుదల కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఆప్కాబ్‌ చైర్మన్‌ గన్ని వీరాంజనేయులు, బీజేపీ నాయకులు శరణాల మాలతీరాణి హాజరయ్యారు. చేబ్రోలు పీఏసీఎస్‌ చైర్మన్‌ కడియాల రవిశంకర్‌, సర్పంచ్‌ దిడ్ల అలకనంద, వేమూరి సుధీర్‌, అధికారులు పాల్గొన్నారు.

ద్వారకాతిరుమల : ఇది రైతు సంక్షేమ ప్రభుత్వమని.. అన్నదాత సుఖీభవ ద్వారా నియోజకవర్గంలో మూడు విడతల్లో సుమారు రూ.62కోట్లు అందించామని గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట్రాజు తెలిపారు. జి. కొత్తపల్లిలో శుక్రవారం అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో ఆయన మాట్లా డారు. నియోజకవర్గంలో మూడో విడతగా 33,133 మంది లబ్ధిదారులకు రూ.18.41కోట్లు వారి ఖాతాల్లో జమ చేస్తున్నామన్నారు.

లింగపాలెం:రైతుల సంక్షేమానికి అనేక సంక్షేమ పథకాలను ప్రభుత్వం ప్రవేశపెట్టిందని చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్‌కుమార్‌ అన్నారు. ధర్మాజీగూడెంలో చింతలపూడి నియోజకవర్గస్థాయి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్‌ నిధుల విడుదల నిర్వహించారు. నియోజకవర్గంలో 36,818 మంది రైతులకు రూ.20.51 కోట్లు మూడో విడత అన్నదాత సుఖీభవ నిధులను అందించిన ఘనత సీఎం చంద్రబాబునా యుడుకే దక్కుతుందన్నారు. వ్యవసాయ శాఖ ఏడీ వై.సుబ్బారావు, ఏవో వి.ప్రదీప్‌కుమార్‌, మండల హార్టికల్చర్‌ అధికారిని షాఫియా ఫర్హీన్‌, తహసీల్దార్‌ నజీముల్లాషా, ఎంపీడీవో కె.వాణి, కూటమి నాయకులు గరిమల చలపతిరావు, గుత్త సత్యసాయి వరప్రసాద్‌, జగ్గవరపు ముత్తా రెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ చీరాల దుర్గాపార్వతి మధుబా బు, పల్లి శ్రీను, మారంపూడి వరప్రసాద్‌, నిమ్మగడ్డ సుధాకర్‌, గారపాటి బుజ్జియ్య, కూటమి నాయకులు పాల్గొన్నారు.

పెదపాడు : కూటమి ప్రభుత్వం రైతుల ప్రభుత్వమని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ అన్నారు. దెందులూరు నియోజకవర్గ స్థాయి అన్నదాత సుఖీభవ రైతు సదస్సును పెదపాడు సొసైటీ ఆవరణలో శుక్రవారం నిర్వహించారు. నియోజకవర్గంలో 20,976 మంది రైతులకు రూ.11.63 లక్షల నమూనా చెక్కును అందజే శారు. సొసైటీ అధ్యక్షుడు గారపాటి స్టాలిన్‌, ఉప్పలపాటి రాంప్రసాద్‌, ఏఎంసీ ఛైర్మన్‌ రామసీత, డీసీ అధ్యక్షుడు బొప్పూడి కాశీబాబు, క్లస్టర్‌ ఇన్‌చార్జి గుత్తా అనిల్‌, మరడాని రవి, మోరు శ్రావణి, వంశీకృష్ణ, బొప్పన బాబ్జి, అధికారులు, రైతులు పాల్గొన్నారు.

పోలవరం : కొత్తపట్టిసీమలో శుక్రవారం అన్నదాత సుఖీభవ మూడో విడత, పీఎం కిసాన్‌ నిధుల జమ కార్యక్రమం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అధ్యక్షతన జరిగింది. తహసీల్దార్‌ బి.సాయిరాజు, ఏవో కె.రాంబాబు, కూటమి నేత లు ఏపీ ట్రైకార్‌ చైర్మన్‌ బొరగం శ్రీనివాసులు, బీజేపీ నాయకులు కరిబండి నాగరాజు, జనసేన మండల అధ్యక్షుడు గునపర్తి చిన్ని, కొణతాల ప్రసాద్‌, తెలగంశెట్టి రాంప్రసాద్‌, తదితరులు పాల్గొన్నారు. ఈక్రమంలో గ్రామంలో శుక్రవారం జరిగిన అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో ప్రొటోకాల్‌ పాటించకుండా వెనుక సీట్లలో కూర్చోబెట్టి అవమానించారని సర్పంచ్‌ మైగా పుల విజయదుర్గ ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - Mar 14 , 2026 | 12:29 AM