22ఏ నిషేధిత భూముల జాబితాలోని.. 4 వేల ఎకరాలకు మోక్షం
ABN , Publish Date - Aug 07 , 2026 | 12:11 AM
‘కలిదిండి లో ఈనెల 10న జరిగే సీఎం చంద్రబాబు సభను కూటమి శ్రేణులు విజయవంతం చేయా లి. ఈ సభలో నియోజకవర్గంలో 22ఏ నిషేధిత భూముల జాబితాలో ఉన్న నాలుగు వేల ఎకరా లకు మోక్షం లభిస్తుంది’ అంటూ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ పేర్కొన్నారు.
10న కలిదిండిలో సీఎం సభను.. విజయవంతం చేయాలి
వైసీపీ హయాంలో పాస్ పుస్తకాలపై, సర్వే రాళ్లపై జగన్ ఫొటోలు
కూటమి ప్రభుత్వంలో రాజముద్రతో పంపిణీ : ఎమ్మెల్యే కామినేని
కలిదిండి, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి):‘కలిదిండి లో ఈనెల 10న జరిగే సీఎం చంద్రబాబు సభను కూటమి శ్రేణులు విజయవంతం చేయా లి. ఈ సభలో నియోజకవర్గంలో 22ఏ నిషేధిత భూముల జాబితాలో ఉన్న నాలుగు వేల ఎకరా లకు మోక్షం లభిస్తుంది’ అంటూ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ పేర్కొన్నారు. కలిదిండి మార్కెట్ యార్డు ఆవరణలో గురువారం నియో జకవర్గ కూటమి నాయకులతో సమావేశం నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ కాళ్లపాలెంకు చెందిన 609 మంది రైతు లకు సీఎం పాస్ పుస్తకాలు పంపి ణీ చేస్తార న్నారు. 22ఏ నిషేధిత భూములపై రైతులకు హక్కులు కల్పిస్తున్నారన్నారు. రైతుల సంక్షేమ మే ధ్యేయంగా సీఎం చంద్రబాబు పని చేస్తు న్నారన్నారు. వైసీపీ హయాంలో పాస్ పుస్తకా లపై, సర్వే రాళ్లపై జగన్ ఫొటోలు వేసుకున్నా రని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధి కారంలోకి వచ్చాక రాజముద్రతో పాస్ పుస్త కాలు పంపిణీ చేస్తున్నారన్నారు. కలిదిండి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో హెలిప్యాడ్ ఏర్పాటు చేస్తుండగా, ఏఎంసీ పక్కన ఉన్న ఖాళీ స్థలంలో బహిరంగ సభ జరుగుతుందన్నా రు. తొలుత కాళ్లపాలెంలో జేసీ అభిషేక్‌గౌడ, ఆర్డీవో లక్ష్మీప్రసన్న, తహసీల్దార్ రామకృష్ణలతో సమీక్ష నిర్వహించారు. తప్పులు లేకుండా పాస్ పుస్తకాలు ఉండాలన్నారు. మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠల్‌రావు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి వీరమల్లు నరసింహారావు, పార్టీ పరిశీలకుడు గంటా త్రిమూర్తులు, టీడీపీ మండల అధ్యక్షుడు వల్లభనేని శ్రీనివాస్ చౌదరి, మాజీ అధ్యక్షుడు జోగిరాజు, కైకలూరు, కలి దిండి ఏఎంసీ చైర్మన్‌లు త్రినాఽథరాజు, ఏడు కొండలు, డీసీ చైర్మన్లు భోగేశ్వరరావు, సత్యనారా యణ, కార్పొరేషన్ల డైరెక్టర్లు అండ్రాజు శ్రీనివాస్, రత్నారావు, మాజీ జడ్పీటీసీలు రమా దేవి, విజయలక్ష్మి, బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు రవీంద్ర, లేబర్ వేల్ఫేర్ బోర్డు డైరెక్టర్ చలపతి రావు పాల్గొన్నారు.
నివేదికలు సిద్ధం చేయండి : కలెక్టర్
ఏలూరు రూరల్ : కలిదిండి మండలంలో సీఎం పర్యటన నేపథ్యంలో రెండేళ్లలో వివిధ శాఖలు అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, సాధించిన విజయాలపై సమగ్ర నివేదికలు సిద్ధం చేసి సమర్పించాలని కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో గురువారం నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడుతూ పట్టాదార్ పాస్ పుస్తకాల జారీ, రీ–సర్వే, పీజీఆర్‌ఎస్, రెవెన్యూ క్లినిక్‌లు, 22 (ఏ) కేసుల పరిష్కారం, బంగారు కుటుంబాల దత్తత వంటి కార్యక్రమాలతో పాటు శాఖల పనితీరు, తాజా గణాంకాలు, విజయగాథలను పొందుపరిచిన పవర్‌పాయింట్ ప్రజెం టేషన్‌లు సిద్ధం చేయాలని సూచించారు. జేసీ అభిషేక్ గౌడ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.