Share News

స్థానిక సంస్థల ఎన్నికల జనసేన రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఎమ్మెల్యే పత్సమట్ల

ABN , Publish Date - Aug 23 , 2026 | 12:31 AM

ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజుకు జనసేన పార్టీ మరో బృహత్తర బాధ్యతను పార్టీ అధిష్టానం అప్పగించింది.

స్థానిక సంస్థల ఎన్నికల జనసేన రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఎమ్మెల్యే పత్సమట్ల
ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు

స్థానిక సంస్థల ఎన్నికల జనసేన రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఎమ్మెల్యే పత్సమట్ల

నిడమర్రు, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజుకు జనసేన పార్టీ మరో బృహత్తర బాధ్యతను పార్టీ అధిష్టానం అప్పగించింది. మంగళగిరిలో పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నాయకులతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించి, ఎన్నికల విధి విధానాల రూపకల్పన జనసేన రాష్ట్ర కమిటీని ప్రకటించారు. ఈ కమిటీలో ఉంగుటూరు జనసేన ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజుకు చోటు దక్కడంపట్ల జనసేన నాయకులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. శనివారం ఉంగుటూరులో జనసేన నాయకులు వంగా రఘు, రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ పొత్తూరి కృష్ణంరాజు, చింతలపాటి బాసిరాజు విలేకరులతో మాట్లాడుతూ ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు నిబద్ధత, పార్టీ కోసం చేస్తున్న కృషికి మెచ్చి పార్టీ అధినేత పవన్‌ ఈ కమిటీలో సభ్యుడిగా నియమించడం ఆనందంగా ఉందన్నారు. జనసేన నాయకులు తోట శ్రీను, నిమ్మల దొరబాబు, పత్తి మదన్‌, అయ్యప్ప పాల్గొన్నారు.

Updated Date - Aug 23 , 2026 | 12:31 AM