మిస్ ఏలూరు దివ్య ఆలపాటి
ABN , Publish Date - Mar 24 , 2026 | 12:13 AM
ఏలూరు నగర ంలో ఆదివారం రాత్రి ప్రముఖ సినీ దర్శకుడు సతీష్ అడ్డాల దర్శకత్వంలో నిర్వహించిన ‘క్రౌన్ ఆఫ్ ఏలూరు’ అందాల పోటీ లు అత్యంత వైభవంగా జరిగాయి.
ఘనంగా ‘క్రౌన్ ఆఫ్ ఏలూరు’ పోటీలు
ఏలూరు రూరల్, మార్చి 23(ఆంధ్రజ్యోతి): ఏలూరు నగర ంలో ఆదివారం రాత్రి ప్రముఖ సినీ దర్శకుడు సతీష్ అడ్డాల దర్శకత్వంలో నిర్వహించిన ‘క్రౌన్ ఆఫ్ ఏలూరు’ అందాల పోటీ లు అత్యంత వైభవంగా జరిగాయి. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రతిభావంతులైన యువతీ యువకులు మధ్య జరిగిన ఈ హోరాహోరీ పోటీలో దివ్య ఆలపాటి అద్భుత ప్రద ర్శన కనబరిచి ‘మిస్ ఏలూరు’ కిరీటాన్ని దక్కించుకుని విజేతగా నిలిచారు. దర్శకులు సతీష్ అడ్డాల, కోడైరెక్టర్ ప్రియా ఎండానా, ఇతర సినీ ప్రముఖులు ఆలపాటి దివ్యకు ‘మిస్ ఏలూరు’ ప్రతి ష్టాత్మక ట్రోఫీని, కిరీటాన్ని అందజేశారు. ర్యాంప్ వాక్, ఐక్యూ, రౌండర్లలో తనదైన శైలిలో రాణించిన దివ్య ఆలపాటి విజేతగా నిలిచారు. మిసెస్ ఏలూరు, మిస్టర్ ఏలూ రు, కిడ్స్ విభాగంలో పోటీలు నిర్వహి ంచారు. విజేతలకు ట్రోఫీలు అందజేశారు. ఔత్సాహికులు భారీగా ఈ అందాల పోటీ ల్లో పాల్గొని సందడి చేశారు. దర్శకుడు సతీష్ అడ్డాల మాట్లాడుతూ ఇటువంటి అందాల పోటీలు ప్రతి ఏడాది నిర్వహి స్తామన్నారు. రాష్ట్ర జాతీయస్థాయి పోటీ ల్లో సత్తా చాటేలా, యువతీ యువకులను ప్రోత్సహిస్తామన్నారు. ఈసందర్భంగా మిస్ ఏలూరు విజేత దివ్య ఆలపాటి మాట్లాడుతూ మిస్ ఏలూరుగా ఎంపిక వ్వడం చాలా సంతోషంగా ఉందని, ఏలూ రు వంటి నగరంలో ఇలాంటి పోటీలు నిర్వహించడం వలన యువత టాలెం ట్‌ను ప్రోత్సహించడమేనని అన్నారు.