మండుతున్న మిర్చి
ABN , Publish Date - Feb 22 , 2026 | 11:50 PM
మార్కెట్‌లో పచ్చిమిర్చి ధరలు పెరుగుతున్నాయి. గత వాతం తాడేపల్లిగూడెం మార్కెట్‌లో కిలో రూ.50 ఉండే పచ్చిమిర్చి ప్రస్తుతం కిలోకు రూ.20 పెరిగి రూ.70కు చేరింది.
మండుతున్న మిర్చి
నిలకడగా కూరగాయల ధరలు.. అదేబాటలో ఉల్లి
తాడేపల్లిగూడెం, ఫిబ్రవరి 22(ఆంధ్రజ్యోతి) : మార్కెట్‌లో పచ్చిమిర్చి ధరలు పెరుగుతున్నాయి. గత వాతం తాడేపల్లిగూడెం మార్కెట్‌లో కిలో రూ.50 ఉండే పచ్చిమిర్చి ప్రస్తుతం కిలోకు రూ.20 పెరిగి రూ.70కు చేరింది. నాటు చిక్కుళ్లు మాత్రం కేజీ రూ.120 అమ్మకాలు జరుగుతున్నాయి. మిగిలిన కూరగాయల ధరలో గత వారంతో పోల్చుకుంటే పెద్దగా వ్యత్యాసం కనిపించడం లేదు. పెండ్లం ధర గత వారం కిలో రూ.80 ఉండేది. ఈ వారం రూ.60కు పడిపోయింది. తెల్ల, నల్ల వంకాయలు కిలో రూ.40 నుంచి 50 మధ్య విక్రయిస్తున్నారు. దొండకాయలు రూ.50, బెండ రూ.40, బీర రూ.50, హైబ్రిడ్ చిక్కులు తెల్లవి రూ.40, నల్లవి రూ.80, దోస కాయలు రూ.40, క్యారెట్ రూ.40, బీట్‌రుట్ రూ.50, క్యాప్సికం రూ.100, బంగాళా దుంప రూ.30, టమాటా రూ.20 పొట్లకాయ రూ.30, అరటి జత రూ.15 నుంచి రూ.20 మధ్య అమ్ముతున్నారు. మార్చి నెలదాటిన తరువాత కూరగాయల ధరలు పెరుగుతాయని వ్యాపారులు చెబుతున్నారు. వాతావరణంలో వేడి పెరగడం వల్ల కూరగాయల దిగుమతి తగ్గుతుందని ఈమేరకు ధరలు పెరగే అవకాశం ఉంటుందంటున్నారు.
హోల్‌సేల్‌లో నాణ్యమైన ఉల్లి రూ.15 నుంచి రూ.20
హోల్‌సేల్ మార్కెట్‌లో అత్యంత నాణ్యమైన ఉల్లి క్వింటా రూ.1500 నుంచి రూ.2000 మఽధ్య విక్రయిస్తున్నారు. నాసిరకం ఉల్లి క్వింటా రూ.1000 నుంచి రూ.1200 మధ్య అమ్ముతున్నారు. ఇక ఇదే ఉల్లి రిటైల్ వర్తకులు నాణ్యమైన ఉల్లి రూ.100కు 4 కిలోలు, మధ్య రకం ఉల్లి రూ.100కు 5 కిలోలు విక్రయిస్తున్నారు. ఇక ఆటోల్లో అమ్మేవారు నాసిరకం, మధ్యరకం ఉల్లిని కలిపి రూ.100కు 6 కిలోల వంతున అమమ్ముతున్నారు. ఇప్పుడు మహారాష్ట్ర నుంచి మాత్రమే ఉల్లి వస్తుంది. ఆదివారం మహారాష్ట్ర నుంచి 10 లారీలో 280 టన్నుల ఉల్లి తాడేపల్లి గూడెం మార్కెట్‌కు వచ్చింది. వీటిలోనే మేలు రకం, నాసిరకం ఉల్లి ఉంది.