నూజివీడును పారిశ్రామిక హబ్‌గా తీర్చిదిద్దుతా : మంత్రి పార్థసారథి
ABN , Publish Date - Sep 17 , 2026 | 12:30 AM
నూజి వీడు నియోజకవర్గాన్ని పారిశ్రా మిక హబ్‌గా తీర్చిదిద్దుతానని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. బుధవారం పోతవరపాడు ఎన్‌ఆర్‌ఐ కళాశాలలో నిర్వహించిన విద్యార్థుల ముఖాముఖి సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
ఆగిరిపల్లి, సెప్టెంబరు 16(ఆంధ్రజ్యోతి): నూజి వీడు నియోజకవర్గాన్ని పారిశ్రా మిక హబ్‌గా తీర్చిదిద్దుతానని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. బుధవారం పోతవరపాడు ఎన్‌ఆర్‌ఐ కళాశాలలో నిర్వహించిన విద్యార్థుల ముఖాముఖి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సులో బహుళజాతి సంస్థలు పాల్గొన్నాయని, తద్వారా రూ.23 లక్షల కోట్లు పెట్టుబడులకు ఎంఓయూలు జరిగాయని తెలిపారు. రూ.11 లక్షల కోట్ల పెట్టుబడులు ఇప్పటికే గ్రౌండింగ్ అయ్యాయని, దీనిద్వారా 11 లక్షల ఉద్యోగాల కల్పన జరిగిందన్నారు. రానున్న రెండేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. విద్యార్థులు మాన్యుఫ్యాక్చరింగ్ పరిశ్రమలు, స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లు ఏర్పాటు చేయాలని అడగగా ప్రతి నియోజకవర్గంలో ఒక స్కిల్ సెంటర్ ఏర్పాటు చేసి శిక్షణ పూర్తయిన వెంటనే ఉద్యోగం వచ్చేలా ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. ఎన్‌ఆర్‌ఐ కళాశాల ఛైర్మన్ రావి వెంకట్రావు, టీడీపీ మండల అధ్యక్షుడు నక్కనబోయిన వేణు, ఆరేపల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు.