కేరళంలో ప్రధాని సభలు విజయవంతం చేయాలి: వర్మ
ABN , Publish Date - Mar 05 , 2026 | 12:36 AM
కేరళం అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ అధి ష్ఠానం ఆదేశాల మేరకు కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహా య మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ కేరళంలోని పలు ప్రాంతాల్లో విస్తృతం గా పర్యటించారు.
కేరళంలో ప్రధాని సభలు విజయవంతం చేయాలి: వర్మ
భీమవరం టౌన్, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): కేరళం అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ అధి ష్ఠానం ఆదేశాల మేరకు కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహా య మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ కేరళంలోని పలు ప్రాంతాల్లో విస్తృతం గా పర్యటించారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం, ఎన్నికల వ్యూహాలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. అంగమాలిలో నిర్వహించిన సమావేశంలో కొచ్చి, త్రిచూర్ జిల్లా అధ్యక్షులతో పాటు అలువా, కున్నతునాడు, పెరుంబూరు, అంగమాలి అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్లు, ఇన్చార్జిలు, మండల అధ్యక్షులు, పార్టీ ముఖ్య నాయకులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వర్మ మాట్లా డుతూ తిరువనంతపురం కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకోవడంతో ప్రజలు పార్టీకి పూర్తి అనుకూలంగా ఉన్నారని స్పష్టమవు తోందన్నారు. ఈ చారిత్రక విజయం కేరళం అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగుర వేయడానికి పునాది అన్నారు. త్వరలో ప్రధాని నరేంద్ర మోదీ కేరళంలో పర్యటించనున్నారని, ఆయన బహిరంగ సభలను విజయవంతం చేయాలన్నారు.