Share News

పార్టీ బలోపేతానికి కార్యకర్తలే మూల స్తంభాలు

ABN , Publish Date - Jun 01 , 2026 | 12:35 AM

భారతీయ జనతా పార్టీ బలోపేతానికి, సిద్ధాంతాల ప్రచా రానికి కార్యకర్తలే మూల స్తంభాలని కేంద్రమంత్రి భూప తిరాజు శ్రీనివాస్‌ వర్మ అన్నారు.

 పార్టీ బలోపేతానికి కార్యకర్తలే మూల స్తంభాలు
ఎంపీ పాకా సత్యనారాయణకు భోజనం వడ్డిస్తున్న కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్‌ వర్మ

పార్టీ బలోపేతానికి కార్యకర్తలే మూల స్తంభాలు

భీమవరం, మే 31(ఆంధ్రజ్యోతి): భారతీయ జనతా పార్టీ బలోపేతానికి, సిద్ధాంతాల ప్రచా రానికి కార్యకర్తలే మూల స్తంభాలని కేంద్రమంత్రి భూప తిరాజు శ్రీనివాస్‌ వర్మ అన్నారు. భీమ వరంలో పండిట్‌ ధీన్‌ దయాల్‌ ఉపాధ్యాయ ప్రశిక్ష ణ అభియాన్‌ కార్యక్రమాన్ని రెండు రోజులపాటు నిర్వహించారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆదివారం శిక్షణ కార్యకమ్రంలో మాట్లాడారు. కార్యకర్తల వికాసం –బాధ్యతలపై ప్రసంగించారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజాబాహుళ్యంలోకి తీసుకు వెళ్లడంలోనూ, సమాజం పట్ల ఉండాల్సిన బాధ్యతలపై కార్యకర్తలకు సోమువీర్రాజు దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్‌.మధుకర్‌ మాట్లాడుతూ పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయడానికి కార్యకర్తలు అనుసరించాల్సిన సమయ పాలన, సంస్థాగత నియమాలను వివరించారు. అనంతరం కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్‌ వర్మ కార్యకర్తలకు, నాయకులకు భోజనాలు వడ్డించి ఉత్సా హ పరిచారు. అంతకుముందు ప్రధానమంత్రి నరేంద్రమోదీ మన్‌కీ బాత్‌ కార్య క్రమాన్ని నాయకులు, కార్యకర్తలు వీక్షించారు. ఎంపీ పాకా సత్యనారాయణ, జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి, రాష్ట్ర అధికార ప్రతినిధి మూళ్లపూడి రేణుక, రాష్ట్ర కార్యదర్శి భోగిరెడ్డి ఆదిలక్ష్మి, జిల్లా ప్రధాన కార్యదర్శులు కలిదిండి వినోద్‌వర్మ, తోట గంగరాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 01 , 2026 | 12:35 AM