సేంద్రియ వ్యవసాయంపై దృష్టిపెట్టాలి
ABN , Publish Date - Apr 09 , 2026 | 12:49 AM
డిమాండ్ ఆధారిత పంటల సాగుపై రైతులు దృష్టిపెట్టాలని, ఎరువులు, పురుగుమందుల వినియో గాన్ని తగ్గించి సేంద్రియ వ్యవసాయంపై ఆలోచన చేయాలని’ రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ పశు సంవర్ధక, పాడి పరిశ్రమ మత్య్స పరిశ్రమ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు.
మార్టేరులో కిసాన్ మేళా సదస్సులో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు
పెనుమంట్ర, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి):‘డిమాండ్ ఆధారిత పంటల సాగుపై రైతులు దృష్టిపెట్టాలని, ఎరువులు, పురుగుమందుల వినియో గాన్ని తగ్గించి సేంద్రియ వ్యవసాయంపై ఆలోచన చేయాలని’ రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ పశు సంవర్ధక, పాడి పరిశ్రమ మత్య్స పరిశ్రమ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. బుధవారం మార్టేరు వ్యవసాయ పరిశోధన కేంద్రంలో ‘మారుతున్న వాతావరణ పరిస్థితులు–సుస్థిర వరి వ్యవసాయం’పై సదస్సును ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ కేంద్రంలో అభివృద్ధి చేసిన వరి వంగడాలు దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో సాగు చేసి అధిక దిగుబ డులు సాధిస్తున్నాయన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజల ఆహారపు అలవాట్లు మారుతున్నందున మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా పంటల సాగు చేయాలని రైతులకు సూచించారు. ఏ ప్రాంతంలో ఏ పంటలు అనుకూలమో వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు గ్రామ స్థాయిలోనే రైతులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. సేంద్రియ సాగు పద్ధతులను విస్తృతంగా అనుసరించాలని రైతులకు పిలుపుని చ్చారు. వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతికత వినియోగంపై రైతులకు అవగాహన కల్పించాలని, ప్రభుత్వం ట్రాక్టర్లు, డ్రోన్లు, ఇతర వ్యవసాయ యంత్రాలను సబ్సిడీపై అందిస్తున్నందున వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కాలువల ఆధునికీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, సాగునీటి సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. పోలవరం ప్రాజె క్టును రాబోయే పుష్కరాల కంటే ముందుగానే పూర్తి చేయడానికి ముఖ్యమంత్రి నారా చంద్ర బాబునాయుడు కృషి చేస్తున్నారని పేర్కొ న్నారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం వ్యవసాయ శాస్త్రవేత్తలను అభినందించారు. కార్యక్రమంలో ఆచార్య ఎన్.జి రంగా వ్యవసాయ విద్యాల యం వైస్ చాన్సలర్ డాక్టర్ ఆర్.శారదా జయలక్ష్మిదేవి, హార్టికల్చర్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ధనుంజయరావు, ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు, రిటైర్డు సీనియర్ శాస్త్రవేత్త ఆలపాటి సత్యనారాయణ, మార్టేరు ప్రాంతీ య వ్యవసాయ పరిశోధన సంస్థ సహాయ సంచాలకులు టి.శ్రీనివాస్, కోనసీమ, ఏలూరు, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు, సామంతపూడి శ్రీరామరాజు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జడ్.వెంకటేశ్వరరావు, శాస్త్రవేత్తలు, అధికారులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు
రాజ్యసభ సభ్యుడు పాకా వెంకట సత్యనా రాయణ మాట్లాడుతూ రైతులకు ప్రధాన మంత్రి సన్మాన్ నిధి పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిందన్నారు. రైతులు భూసార పరీక్షలపై అవగాహన కలిగి ఉండాలని, సేంద్రియ ఉత్పత్తులు సాగు చేయడానికి ఆలోచన చేయాలన్నారు. రాష్ట్రంలో నదులు అనుసంధానం ద్వారా సాగునీటి కొరత లేకుండా సాధ్యపడుతుందన్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ ఈ కేంద్రం అభివృద్ధి చేసిన వరి వంగడాలు దేశవ్యాప్తంగా విశేష గుర్తింపు పొందాయన్నారు. రైతుల సంక్షే మానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని రైతు సేవా కేంద్రాల ద్వారా కొనుగోలు చేసి 24 గంటల్లోపే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామని తెలిపారు.
ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ మాట్లాడుతూ ఈ కేంద్రం స్థాపించి ఇప్పటికే వంద సంవత్సరాలు పూర్తయ్యాయని, ఈ సందర్భంగా కిసాన్ మేళా నిర్వహించడం ఆనందదాయకమన్నారు. ఈ కేంద్రం ద్వారా 70–75 శాతం రకాల నూతన వరి వంగడా లు అభివృద్ధి చేశారన్నారు.
తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ రైతు సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతులకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని తెలిపారు. వ్యవసాయ యాంత్రికరణలో భాగంగా నూతన పరికరాలను సబ్సిడీపై అందిస్తున్నామన్నారు.