గొడ్డలి పార్టీ నేతలను నిలదీయండి
ABN , Publish Date - Sep 21 , 2026 | 12:22 AM
పాలకొల్లు నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తున్నానని, దానితో పెద్ద ఎత్తున నిధులు వస్తున్నాయని, ఈ రెండు ఏళ్ల కాలంలో నియోజక వర్గానికి రూ.1,170 కోట్లు నిధులు తీసుకువచ్చినట్టు మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు అన్నారు.
మంత్రి నిమ్మల రామానాయుడు
రూ. 3.79 కోట్లతో 31 అభివృద్ధి పనులకు శంకుస్థాపన
పాలకొల్లు అర్బన్, సెప్టెంబరు 20 (ఆంధ్ర జ్యోతి): పాలకొల్లు నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తున్నానని, దానితో పెద్ద ఎత్తున నిధులు వస్తున్నాయని, ఈ రెండు ఏళ్ల కాలంలో నియోజక వర్గానికి రూ.1,170 కోట్లు నిధులు తీసుకువచ్చినట్టు మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు అన్నారు. పట్టణం లోని పలు వార్డుల్లో 31 పనులకు రూ. 3.79 కోట్ల నిధులతో చేపట్టనున్న వివిధ సీసీ రహ దారులు, కల్వర్టులు, డ్రెయిన్లు వంటి అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా 26 వార్డులోని లక్ష్మీగణపతి ఆలయం వీధిలో జరిగిన సభలో మంత్రి మాట్లాడారు. మహిళలపై సోషల్ మీడియో ద్వారా అసత్య ప్రచారాలు చేసే గొడ్డలి పార్టీ నాయ కులు మీ ముందుకు వస్తే నిలదీయాలని సూచించారు. ఐదేళ్ల కాలంలో పాలకొల్లు అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయిందని అసత్య ప్రచారాలతోనే గొడ్డలి పార్టీ నెట్టుకు వచ్చిందన్నారు. పట్టణ టీడీపీ అధ్యక్షుడు గండేటి వెంకటేశ్వరరావు,కూటమి నాయ కులు పెచ్చెట్టి బాబు, కర్నేన గౌరునాయుడు, వల్లభు శ్రీనివాస్, ఎస్తేరురాణి, రియా, ఉన్నమట్ల కపర్ధి, బోణం చినబాబు, పొట్నూరి శ్రీను, తుల రామలింగం, శిడగం సురేంద్ర, మండెల రామ ప్రసాద్, మండాది అవినాష్, పెండ్యాల భవానీ, శ్రీనివాసరావు చౌదరి, మురళీ, కామిశెట్టి జయరాం, సరిదే మాధవి పాల్గొన్నారు.