రూ.1,170 కోట్లతో పాలకొల్లు అభివృద్ధి : మంత్రి నిమ్మల
ABN , Publish Date - Sep 13 , 2026 | 12:42 AM
పాలకొల్లు నియోజకవర్గాన్ని అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో ఆదర్శ నియోజ కవర్గంగా తీర్చిదిద్దాలన్నదే తన లక్ష్యమని, ఇందుకు తనతో పాటు అందరూ కలిసికట్టుగా పనిచేద్దామని రాష్ట్ర జలవన రుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు పిలుపుని చ్చారు.
పాలకొల్లు అర్బన్, సెప్టెంబరు12(ఆంధ్రజ్యోతి):పాలకొల్లు నియోజకవర్గాన్ని అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో ఆదర్శ నియోజ కవర్గంగా తీర్చిదిద్దాలన్నదే తన లక్ష్యమని, ఇందుకు తనతో పాటు అందరూ కలిసికట్టుగా పనిచేద్దామని రాష్ట్ర జలవన రుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు పిలుపుని చ్చారు. స్థానిక లయన్స్ కమ్యూనిటీ భవనంలో రానున్న పుష్క రాలను పురస్కరించుకుని వివిధ శాఖల అధికారులు, ఉద్యోగు లు, కూటమి నాయకులతో శనివారం సమీక్ష సమావేశం నిర్వ హించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సవాళ్లతో కూడుకుని ఉన్నప్పటికీ రెండేళ్ల కాలంలో పాలకొల్లు నియోజకవర్గ అభివృద్ధికి రూ.1,170 కోట్లు నిధులు తీసుకువచ్చానని, ప్రతీ రూపాయి ప్రజలకు ఉపయోగపడే విధంగా వినియోగించాలనే లక్ష్యంగా పనిచేస్తున్నానని వివరిం చారు. జిల్లా, డివిజన్, నియోజకవర్గ స్థాయిలోని వివిధ శాఖ ల అధికారులతో ఆయా శాఖల వారీగా అభివృద్ధి పనులు, పెండింగ్ పనులపై సమీక్షించారు. అలాగే కూటమి నాయకులు ప్రజలతో నిరంతరం మమేకమై ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను తెలియచేయాలని సూచించారు. ఆర్డీవో దాసి రాజు, డీఎస్పీ సుధాకర్, ఇరిగేషన్, విద్యుత్, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈలు శ్రీనివాసరావు, ఉషారాణి, విజయరత్నం, డీసీహెచ్‌ఎస్ సూర్యనారాయణ, డీఎంహెచ్‌వో భరతలక్ష్మి, డీఆర్‌డీఏ, మెప్మా పీడీలు వేణుగోపాల్, హెప్సాబా పాల్గొన్నారు.