కాంగ్రెస్.. ఆ పార్టీ మిత్రపక్షాలు మహిళా ద్రోహులు
ABN , Publish Date - Apr 19 , 2026 | 11:32 PM
పార్లమెంట్‌లో మహిళా బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్, ఆ పార్టీ మిత్రపక్షాలు మహిళా ద్రోహులు గా చరిత్రలో నిలిచిపోతారని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు.
పాలకొల్లు అర్బన్, ఏప్రిల్ 19(ఆంధ్రజ్యోతి): పార్లమెంట్‌లో మహిళా బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్, ఆ పార్టీ మిత్రపక్షాలు మహిళా ద్రోహులు గా చరిత్రలో నిలిచిపోతారని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. స్థానిక మంత్రి క్యాంపు కార్యాలయంలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజా ప్రతినిధులతో మంత్రి నిమ్మల ఆదివారం ఆత్మీయ సమావేశం ఏర్పాటు చే శారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు మంతెన రామరాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ, తాడేపల్లిగూడెం, నర సాపురం నియోజక వర్గాల పార్టీ ఇన్‌చార్జిలు వలవల బాబ్జి, పొత్తూరి రామరాజు, మాజీ ఎమ్మెల్సీ అంగర రామమోహన్, నియోజకవర్గ పార్టీ పరిశీలకుడు పెచ్చెట్టి చంద్రమౌళి తదితర నాయకులు జిల్లాలో పార్టీ నిర్మాణం, అభివృద్ధి, సంక్షేమ పథకాలపై చర్చించారు. మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ మహిళలకు న్యాయం జరిగేవిధంగా బిల్లుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మద్దతు పలికారన్నారు. విపక్షాల తీరును ఎండగడుతూ నిడదవోలులో సీఎం నిరసన ప్రదర్శన నిర్వహించి, మహిళలకు అండగా నిలిచారని అన్నారు. ఆస్తి హక్కు, రాజకీయ రిజర్వే షన్లు కల్పించింది టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు అని, తొలిసారిగా డ్వాక్రా సంఘాలన ఏర్పాటుచేసి మహిళలకు ఆర్ధిక సాధికారతను చంద్రబాబు నాయుడు తీసుకువచ్చారని తెలిపారు.
ప్రతిపక్ష హోదా లేని జగన్ అరాచకం, విధ్వంసం, రప్పా.. రప్పా రాజకీ యాలను ఎంచుకున్నారని, అభివృద్ధిని అడ్డుకోవడం, ప్రజలను రెచ్చగొట్టడ మే జగన్ అజెండాగా ఉందని మంత్రి నిమ్మల అన్నారు. వైఎస్‌ఆర్ సీపీ కాకుండా గొడ్డలి పార్టీ ప్రజలు పిలుచుకుంటున్నారన్నారు.