భవిష్యత్ తరాలకు ఆద్యుడు సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Mar 04 , 2026 | 12:14 AM
భవిష్యత్ తరాలు వారికి అభివృద్ది ఫలాలు అందించే ఆద్యుడు సీఎం చంద్రబాబు అని, దూర దృష్టితో పాలన సాగిస్తున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు.
మంత్రి నిమ్మల రామానాయుడు
పోడూరు/పాలకొల్లు రూరల్, మార్చి 3(ఆంధ్రజ్యోతి): భవిష్యత్ తరాలు వారికి అభివృద్ది ఫలాలు అందించే ఆద్యుడు సీఎం చంద్రబాబు అని, దూర దృష్టితో పాలన సాగిస్తున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పోడూరు మండలం కొమ్ముచిక్కాలలో రూ.1కోటి 50లక్షలతో చేపట్టనున్న మడుగు పోలవరం ఆర్‌అండ్‌బీ రోడ్డు నిర్మాణ పనులకు ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణతో కలిసి మంగళవారం శంకుస్థాపన చేసి శిలాపలకాన్ని ఆవిష్కరించారు. పాలకొల్లు మండల నాగరాజుపేటలో రూ.4.30 కోట్లతో వెంకటాపురం ఆర్‌అండ్‌బీ రోడ్డు నిర్మాణ పనులకు మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్‌తో కలిసి శంకుస్థాపన చేసి శిలాపలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కొమ్ముచిక్కాలలో ఆయన మాట్లాడుతూ గత ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో రోడ్లు అధ్వానంగా తయారయ్యాయని, కూటమి రాగానే రోడ్లపై దృష్టి పెట్టామన్నారు. సభలో ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ మాట్లాడుతూ సంక్షేమంతో పాటు అభవృద్ధి జరిగితేనే ప్రజలకు మనుగడ ఉంటుందన్నారు. టీడీపీ నియోజకవర్గ క్లస్టర్ ఇన్‌చార్జి గొట్టుముక్కల సూర్యనారాయణరాజు, పాలకొల్లు డీసీ చైర్మన్ పెన్మెత్స రామభద్రరాజు, తదితరులు ఉన్నారు. నాగరాజు పేటలో పాలకొల్లు ఏఎంసీ చైర్మన్ కోడి విజయభాస్కర్, జనసేన జిల్లా నాయకుడు బోనం చినబాబు తదితరులు ఉన్నారు.