అభివృద్ధి పనుల్లో జాప్యం వద్దు
ABN , Publish Date - Oct 04 , 2026 | 11:46 PM
పట్టణంలో కోట్లాది రూపా యలతో చేపట్టిన పలు అభివృద్ధి పనుల్లో జాప్యం తగదని, నాణ్యత లోపం లేకుండా నిర్ణీత గడువు లోపు పూర్తి చేయాలని మంత్రి నిమ్మల రామానా యుడు అధికారులకు సూచించారు.
మంత్రి నిమ్మల రామానాయుడు
పాలకొల్లు అర్బన్, అక్టోబరు4(ఆంధ్రజ్యోతి): పట్టణంలో కోట్లాది రూపా యలతో చేపట్టిన పలు అభివృద్ధి పనుల్లో జాప్యం తగదని, నాణ్యత లోపం లేకుండా నిర్ణీత గడువు లోపు పూర్తి చేయాలని మంత్రి నిమ్మల రామానా యుడు అధికారులకు సూచించారు. పట్టణంలో వివిధ అభివృద్ధి పనులను ఆదివారం మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులు, కూటమి నాయ కులతో కలిసి పరిశీలించారు. పనుల పురోగతి, నాణ్యతలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అంబేడ్కర్ కళ్యాణ మండపం, బీసీ కళ్యాణ మండ పం, షాదిఖానా, ఎల్‌ఆర్‌పేటలోని సీవీ.రాజు పార్క్, క్రిస్టియన్ శ్మశాన వాటి క, సమతా మహిళా భవనం, టిడ్కో గృహాలు, 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి, ఎన్‌టీఆర్ కళాక్షేత్రం, చంద్రబాబు నాయుడు పార్క్ తదితర అభివృద్ధి పనులను మంత్రి పరిశీలించారు.