ప్రజల ఆశీర్వాదమే నా బలం: మంత్రి నిమ్మల
ABN , Publish Date - Aug 23 , 2026 | 12:33 AM
పాలకొల్లు నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదమే నాబలం. నియోజకవర్గ అభి వృద్ధే నా అజెండా. ప్రజల రుణం తీర్చు కుంటా.... ఎవరితోనూ చెప్పించుకునే స్థాయిలో లేను’ అని మంత్రి నిమ్మల రామా నాయుడు అన్నారు.
ప్రజల ఆశీర్వాదమే నా బలం: మంత్రి నిమ్మల
పాలకొల్లు అర్బన్, ఆగస్టు 22 (ఆంధ్ర జ్యోతి): ‘పాలకొల్లు నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదమే నాబలం. నియోజకవర్గ అభి వృద్ధే నా అజెండా. ప్రజల రుణం తీర్చు కుంటా.... ఎవరితోనూ చెప్పించుకునే స్థాయిలో లేను’ అని మంత్రి నిమ్మల రామా నాయుడు అన్నారు. పట్టణంలో శనివారం రూ.7.35 కోట్లతో పలు అభివద్ధి పనులకు మంత్రి నిమ్మల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల మాట్లాడుతూ రెండేళ్లలో నియోజకవర్గ అభివృద్ధికి రూ.1100 కోట్లు తీసుకువచ్చానని, కొన్ని పనులు ఇప్పటికే పూర్తి కాగా మరికొన్ని పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రి గురించి మాట్లాడే అర్హత గొడ్డలి పార్టీ నాయకులకు లేదని, తమ ఐదేళ్ల పాలనలో పట్టిం చుకోలేదని, చేస్తున్న అభివృద్ధిపై విమర్శలు చేయడం మానాలని సూచించారు. తప్పు జరిగితే తాను సహించేది లేదని, తప్పు చేశామని చెప్పించుకునే స్థితిలో లేమని, ప్రజల రుణం తీర్చుకునే విధంగా పనిచేస్తానని, రాత్రి పగలు అనకుండా ప్రజల కోసం కష్టపడి పనిచేస్తున్నానని, మంత్రి అయిన ఆదివారం కూడా సెలవు అనేది తీసుకోకుండా పనిచేస్తున్నానని తెలిపారు. ఈకార్యక్ర మంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ యర్రా మాధురి, మున్సిపల్ కమిషనర్ డి.కిరణ్ కుమార్, పబ్లిక్ హెల్త్ డీఈ విజయ్, తోట నారాయణ రావు, ఇరిగేషన్ డిఈ వెంకట నారాయణ తదితరులు పాల్గొన్నారు.