Share News

కూటమి విజయం ఖాయం

ABN , Publish Date - Oct 20 , 2026 | 12:49 AM

రాష్ట్రంలో మున్సిపల్‌ ఎన్నికల్లో కూటమిదే విజయమని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి, ఏలూరు జిల్లా ఇన్‌చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్‌ ధీమా వ్యక్తం చేశారు.

కూటమి విజయం ఖాయం
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి నాదెండ్ల మనోహర్‌.. చిత్రంలో ఎమ్మెల్యేలు చింతమనేని, బడేటి, పత్సమట్ల, మేయర్‌ అభ్యర్థి అప్పలనాయుడు తదితరులు

రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి మనోహర్‌

ఏలూరు రూరల్‌, అక్టోబరు 19, (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో మున్సిపల్‌ ఎన్నికల్లో కూటమిదే విజయమని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి, ఏలూరు జిల్లా ఇన్‌చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్‌ ధీమా వ్యక్తం చేశారు. ఏలూరులో టీడీపీ, జనసేన మధ్య సీట్ల సర్దుబాటుపై ఆదివారం స్థానిక ఓ హోటల్‌లో ఎమ్మెల్యే బడేటి చంటి, జనసేన సమన్వయకర్తలు పత్సమట్ల ధర్మరాజు, నారా శేషు, మేయర్‌ అభ్యర్థి రెడ్డి అప్పలనాయుడు తదితరులతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. ‘ప్రధాని మోదీ సహకారంతో సీఎం చంద్ర బాబు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. రాబోయే పుష్కరాల్లోగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తాం. గత ఎన్నికల్లో కూటమిపై నమ్మకంతో ప్రజలు ఆశీర్వదించారు, అదే ఐక్యతతో మున్సిపల్‌ ఎన్నిక ల్లోనూ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలి. కూటమిలో ఈగోలకు తావులేకుండా కలిసికట్టుగా ముందుకు సాగాలి. పార్టీ కోసం కష్టపడిన నాయకు లకు సముచిత స్థానం కల్పిస్తాం. ఏలూరు జిల్లా నుంచే 22ఏ భూముల సమస్యల పరిష్కారానికి శ్రీకారం చుట్టాం, దేవదాయ శాఖ భూములకు విముక్తి కల్పిస్తా’మని పేర్కొన్నారు.టీడీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ కార్యకర్తల కష్టాన్ని గుర్తించి, తప్పనిసరి పరిస్థితుల్లో సీట్ల కేటాయింపు చేపట్టామన్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో కూటమి ఏకపక్ష విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు సీహెచ్‌ విక్రమ్‌ కిషోర్‌, సీనియర్‌ నేత అంబికా కృష్ణ, గూడవల్లి శ్రీనివాస్‌ తది తరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 20 , 2026 | 12:49 AM