Share News

సంస్థాగతంగా జనసేన బలోపేతం

ABN , Publish Date - Jul 16 , 2026 | 12:39 AM

‘గ్రామస్థాయిలో జన సేన పార్టీని బలోపేతం చేసేందుకే చర్చావేదిక కార్యక్రమాన్ని ప్రారంభించాం. సామాన్యులకు న్యాయం జరిగినప్పుడే చట్టం పై ఉన్న గౌరవం మరింత పెరుగుతుం’దని రాష్ట్ర పౌర సరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ అన్నారు.

 సంస్థాగతంగా జనసేన బలోపేతం
సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి నాదెండ్ల మనోహర్‌.. చిత్రంలో ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు

కైకలూరులో చర్చావేదికలో పాల్గొన్న మంత్రి నాదెండ్ల

కైకలూరు, జూలై 15(ఆంధ్రజ్యోతి): ‘గ్రామస్థాయిలో జన సేన పార్టీని బలోపేతం చేసేందుకే చర్చావేదిక కార్యక్రమాన్ని ప్రారంభించాం. సామాన్యులకు న్యాయం జరిగినప్పుడే చట్టం పై ఉన్న గౌరవం మరింత పెరుగుతుం’దని రాష్ట్ర పౌర సరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ అన్నారు. కైక లూరులో ఓ కల్యాణ మండపంలో బుధవారం జనసేన పార్టీ చర్చావేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న నాదెండ్ల మాట్లాడుతూ.. ‘ సామాన్య ప్రజల కష్టాలు చూసి చలించి పవన్‌ కల్యాణ్‌ వైసీపీకి వ్యతిరేకంగా పోరాటం చేశారు. పంచాయతీరాజ్‌శాఖ మంత్రిగా అన్ని గ్రామాల్లో సిమెంటు రోడ్లు నిర్మాణం చేసి పండుగ వాతావరణాన్ని తీసు కొచ్చారు. గ్రామస్థాయిలో అంకిత భావంతో పనిచేసి సమస్యల పరిష్కారానికి కృషి చేసే కార్యకర్తలకు పదవులు వాటంతటే అవే వస్తాయి. జీరామ్‌జీ పథకం ద్వారా రోడ్లు, డ్రెయిన్లు నిర్మాణం చేస్తాం. 2024 ఎన్నికల ముందు రూ.1,674 కోట్లు రైతులకు ధాన్యం సొమ్ము చెల్లించకుండా వైసీపీ ప్రభుత్వం బకాయిలు ఉంచింది. వాటిన్నంటిని అధిగమించి రెండేళ్లలో రూ. 31 వేల కోట్ల ధాన్యాన్ని కొనుగోలు చేసి 24 గంటల్లో రైతుల ఖాతాల్లో నగదు జమ చేశాం. పవన్‌ కల్యాణ్‌ తీసుకొచ్చిన జలజీవన్‌ మిషన్‌ నిధులు రూ.1,600 కోట్లు గ్రామీ ణ ప్రాంతాల్లో రక్షిత మంచినీటి పథకాలకు దోహద పడ తాయి’ అన్నారు. అనంతరం కార్యకర్తల ఇబ్బందులను వారి మధ్యకు వెళ్లి తెలుసుకున్నారు. కొంతమంది కూటమిలో ఉండడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. కైకలూరు నియోజకవర్గంలో సమస్యలను వివరించారని, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్‌ కామినేని శ్రీనివాస్‌తో, జిల్లాస్థాయి అధికారులతో కలిసి వాటి పరిష్కారానికి మరోసారి పర్యటిస్తానన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు జయమంగళ వెంకటరమణ, పిడుగు హరిప్రసాద్‌, పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ కల్యాణ్‌ శ్రీనివాస్‌, ఎమ్మెల్యేలు పంచమట్ల ధర్మరాజు, బొమ్మిడి నాయకర్‌, ఉమ్మడి కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ, కొటికలపూడి గోవిందరావు, ఏపీఐఎసీ డైరెక్టర్‌ చనుమోలు చంద్రశేఖర్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 16 , 2026 | 12:39 AM