Share News

చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం

ABN , Publish Date - Oct 06 , 2026 | 12:14 AM

రాష్ట్ర సర్వతోముఖా భివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు.

చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం
సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి కొలుసు

మంత్రి కొలుసు పార్థసారథి

టి.నరసాపురం, అక్టోబరు 5(ఆంధ్రజ్యోతి):రాష్ట్ర సర్వతోముఖా భివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. బొర్రంపాలెంలోని సొసైటీ పెట్రోల్‌ బంకు వద్ద సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో పోలవరం నియోజకవర్గంలో అమలు జరుగు తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై అధికారులతో సమీక్షించా రు. ఆయన మాట్లాడుతూ ‘నియోజకవర్గంలో అభివృద్ధి పనులు నిర్దేశించిన సమయంలోగా పూర్తి చేయాలి. సంక్షేమ పథకాలు అర్హు లందరికీ అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. గతంలో కట్టిన ఇళ్లకు పెండింగ్‌ బిల్లులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంద’న్నా రు. మండలంలో లోఓల్టేజ్‌ సమస్యను పరిష్కరించాలని విద్యుత్‌ అధికారులను ఆదేశించారు. తాగునీటి సమస్య తలెత్తితే సహించేది లేదని హెచ్చరించారు. రాష్ట్ర ట్రైకార్‌ చైర్మన్‌ బొరగం శ్రీనివాసులు, జగ్గంపేట నియోజకవర్గం పరిశీలకులు శీలం వెంకటేశ్వరరావు, పోల వరం మార్కెటింగ్‌ చైర్మన్‌ పొట్టా రామారావు, సొసైటీ చైర్‌పర్సన్‌లు జోనుబోయిన సోంబాబు, ఆచంట సూర్యనారాయణ, శీలం సాయి వినయ్‌, టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి వెలిది నాగబాబు, కాల్నీడి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 06 , 2026 | 12:14 AM